హోమ్ /వార్తలు /బిజినెస్ /

Agriculture Loan: రైతులకు రుణాలు... వడ్డీ 7 శాతం నుంచి

Agriculture Loan: రైతులకు రుణాలు... వడ్డీ 7 శాతం నుంచి

Agriculture Loan: రైతులకు రుణాలు... వడ్డీ 7 శాతం నుంచి
(ప్రతీకాత్మక చిత్రం)

Agriculture Loan: రైతులకు రుణాలు... వడ్డీ 7 శాతం నుంచి (ప్రతీకాత్మక చిత్రం)

Kisan Credit Card Scheme | కేంద్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా వ్యవసాయ రుణాలు (Agriculture Loans) ఇస్తోంది. ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులకు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card) ఇస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు వారి సాగు, ఇతర అవసరాలు తీర్చుకోవడం కోసం ఒకే విండో కింద బ్యాంకుల నుంచి సకాలంలో తగినంత రుణాలు పొందడమే లక్ష్యంగా ఏర్పడ్డ పథకం ఇది. వడ్డీ రాయితీ పథకం ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. రైతులు ఎవరైనా బ్యాంకులో ఈ క్రెడిట్ కార్డ్ (Credit Card) తీసుకోవచ్చు. వ్యవసాయ రుణాలు (Agriculture Loans) తీసుకొని తిరిగి చెల్లించవచ్చు. అసలు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఎవరికి? ఎలా అప్లై చేయాలి? వడ్డీ రేటు ఎంత? ఏఏ బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డుల్ని ఇస్తున్నాయి? పూర్తి వివరాలు తెలుసుకోండి.


కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎవరికి?


సొంతగా లేదా ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు, కౌలు రైతులు, స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్‌లు కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. రుణాలు తీసుకునేవారి కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 75 ఏళ్లు. సీనియర్ సిటిజన్లు అయితే వారి చట్టబద్ధమైన వారసుల్ని సహ రుణగ్రహీతగా చేర్చుకోవాలి.


SBI ATM Card: పిన్ ఎంటర్ చేయకుండా డెబిట్ కార్డ్ పేమెంట్స్... ఇలా యాక్టివేట్ చేయండి


కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏ బ్యాంకులు ఇస్తాయి?


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకులన్నీ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తాయి. వడ్డీ రేట్లు వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్స్యూరెన్స్ ప్రీమియం కూడా వర్తిస్తాయి. Paisabazaar వివరాల ప్రకారం ఏ బ్యాంకులో వడ్డీ రేటు ఎంత ఉందో తెలుసుకోండి.


ఎస్‌బీఐ కిసాన్ క్రెడిట్ కార్డ్ (SBI Kisan Credit Card)- వార్షిక వడ్డీ 7 శాతం నుంచి


పీఎన్‌బీ కిసాన్ క్రెడిట్ కార్డ్ (PNB Kisan Credit Card) - వార్షిక వడ్డీ 7 శాతం నుంచి


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ (HDFC Bank Kisan Credit Card) - వార్షిక వడ్డీ 9 శాతం నుంచి


యాక్సిస్ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ (Axis Bank Kisan Credit Card)- వార్షిక వడ్డీ 8.85 శాతం నుంచి


మహాబ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ (Mahabank Kisan Credit Card)- వార్షిక వడ్డీ 7 శాతం నుంచి


ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ (Indian Overseas Bank Kisan Credit Card)- వార్షిక వడ్డీ 7 శాతం నుంచి


యూకో బ్యాంక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ (UCO Bank Kisan Credit Card)- వార్షిక వడ్డీ 7 శాతం నుంచి


2022 Alto K10: రూ.3.99 లక్షలకే మారుతీ కార్... ధర, ఫీచర్స్ వివరాలివే


రుణాలు తీసుకున్న రైతులకు తిరిగి చెల్లించే గడువును బ్యాంకులు సూచిస్తాయి. పంటల కోత, మార్కెటింగ్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రీపేమెంట్ పీరియడ్‌ను నిర్ణయిస్తాయి బ్యాంకులు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది. రుణగ్రహీతలు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా తీసుకోవచ్చు.కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఏఏ డాక్యుమెంట్స్ కావాలి?


కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడెంటిటీ కార్డ్, పాస్‌పోర్ట్ లాంటి డాక్యుమెంట్స్ తప్పనిసరి. పొలానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ధృవీకరించిన డాక్యుమెంట్స్, ఇతర సెక్యూరిటీ డాక్యుమెంట్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తప్పనిసరి. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కిసాన్ క్రెడిట్ కార్డుకు అప్లై చేయొచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Agriculture, Bank loan, Farmer, Personal Finance, Personal Loan

ఉత్తమ కథలు