• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • KINETIC SAFAR JUMBO 1 TON ELECTRIC THREE WHEELER WITH 120 KM RANGE LAUNCHED IN INDIA NS GH

Electric Vehicles: సరుకు రవాణాకు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం.. కిలోమీటరుకు 50 పైసలే ఖర్చు

Electric Vehicles: సరుకు రవాణాకు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం.. కిలోమీటరుకు 50 పైసలే ఖర్చు

Kinetic Safar Jumbo. (Image source: Kinetic Energy)

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్.. సఫర్ జంబో పేరిట సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ను భారత్లో విడుదల చేసింది. దేశీయంగా డిజైన్ చేసిన ఈ వాహనం గరిష్టంగా గంటకు 55 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

  • Share this:
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్.. సఫర్ జంబో పేరిట సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ను భారత్లో విడుదల చేసింది. EV R&D ల్యాబ్‌లో రూపొందించబడిన ఈ సఫర్ జంబో వాహనాన్ని అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఫీచర్లతో తయారు చేశారు. అంతేకాక దీని తయారీలో వాడిన అన్ని భాగాలు100 శాతం భారత్లో రూపొందించినవే కావడం విశేషం. దేశీయంగా డిజైన్ చేసిన ఈ వాహనం గరిష్టంగా గంటకు 55 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీ ఉండడం వల్ల ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 120 కిలో మీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఎల్ 5 కేటగిరీ పరిధిలోని ఈ కొత్త కైనెటిక్ సఫర్ జంబోలో 1 టన్నుకు పైగా జివిడబ్ల్యూ, 150 చదరపు అడుగుల క్యూబిట్ సామర్థ్యం గల కార్గో బాక్స్ మరియు 500 కిలోల పేలోడ్ తో సరకు రవాణాకు అనుకూలంగా ఉంటుంది. ఈ తరహా సరుకు రవాణా వాహనాలకు ఈ–కామర్స్ సంస్థల నుంచి బారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వచ్చే 6–7 నెలల్లో 5,000లకు పైగా సఫర్ జంబో వాహనాలను డెలివరీ చేయాలని కంపెనీ భావిస్తోంది. గ్యాస్ సిలిండర్ల పంపిణీ, నీటి పంపిణీ, చెత్త సేకరణ తదితర అవసరాలకు అనువైన వాహనాలను త్వరలోనే తీసుకురావాలని యోచిస్తున్నట్లు కైనటిక్ గ్రీన్ కంపెనీ పేర్కొంది.

కిలోమీటర్ కు 50 పైసలే ఖర్చు..
తాము ఆవిష్కరించిన ఈ నూతన ఎలక్ట్రిక్ వాహనంతో కిలోమీటరుకు 50 పైసల కంటే తక్కువగానే ఖర్చు అవుతుందని కైనెటిక్ గ్రీన్ పేర్కొంది. కాగా ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న డీజిల్ ఇంజిన్ ఆధారిత కార్గో త్రీ- వీలర్లతో చేసే సరుకు రవాణాకు కిలోమీటరుకు రూ.3 కు పైగా ఖర్చు అవుతుందని కైనెటిక్ గ్రీన్ పేర్కొంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో మరియు 10 డిగ్రీల గ్రేడబిలిటీతో వచ్చే ఈ వాహనం దేశంలోని పెద్ద లేదా చిన్న నగరాల్లో సరకు రవాణాకు ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. భారతీయ రహదారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు హైటెక్ ఫీచర్లతో ఈ వాహనం రూపొందించబడింది.

ఇందులో డ్యురెబిలిటీ మరియు సేఫ్టీ కోసం పూర్తి స్టీల్ బాడీ, బలమైన సీడీ కోటెడ్ స్టీల్ చాసిస్, డిజిటల్ క్లస్టర్, డైనమిక్ ఎస్ఓసి, ఇంటరాక్టివ్ కైనెటిక్ కనెక్ట్ ఎపిపి మరియు జిపిఎస్‌తో కూడిన క్యాన్ బేసిడ్ కంట్రోలర్, ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్, బెటర్ స్టెబిలిటీ, హైడ్రాలిక్ బ్రేక్స్ మరియు ట్రాన్స్మిషన్ సిస్టమ్స్‌లో ఎక్స్పర్ట్ అయిన కైనెటిక్ ఇంజనీరింగ్ గ్రూప్ కంపెనీ రూపొందించిన ప్రత్యేకమైన గేర్ బాక్స్‌ వంటివి ఉన్నాయి. ఈ వాహనం స్వాపబుల్ బ్యాటరీ ప్లాట్‌ఫామ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఈ ఎలక్ట్రిక్ లోడర్ కొనుగోలుదారులకు ప్రభుత్వం అందించే FAME II సబ్సిడీ కూడా వర్తిస్తుంది. ఇది 3 సంవత్సరాల వారంటీతో అందుబాటులో ఉండనుంది.
Published by:Nikhil Kumar S
First published: