KIA TO HIKE PRICES OF CARS BY UPTO RS 54000 IN JANUARY 2022 DETAILS HERE GH VB
Prices Hike: కొత్త సంవత్సరంలో భారీ షాక్ ఇచ్చిన కియా.. ఈ మోడళ్లపై ఎంత ధర పెంరిగిందో తెలుసా..
కియా
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా (Kia) కొత్త సంవత్సరంలో వాహన ప్రియులకు షాకిచ్చింది. ఈ కంపెనీ దేశీయ విపణిలో ప్రస్తుతం విక్రయిస్తున్న సోనెట్ (Sonet), సెల్టోస్ (Seltos) ఎస్యూవీ మోడళ్లతో పాటు కార్నివాల్ (Carnival) ప్రీమియం ఎంపీవీ మోడల్ ధరలను భారీగా పెంచింది.
దక్షిణ కొరియాకు(South Korea) చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా (Kia) కొత్త సంవత్సరంలో వాహన ప్రియులకు షాకిచ్చింది. ఈ కంపెనీ దేశీయ విపణిలో ప్రస్తుతం విక్రయిస్తున్న సోనెట్ (Sonet), సెల్టోస్ (Seltos) ఎస్యూవీ మోడళ్లతో పాటు కార్నివాల్ (Carnival) ప్రీమియం ఎంపీవీ మోడల్ ధరలను భారీగా పెంచింది. ఈ మోడళ్లపై వేరియంట్‌ను బట్టి రూ.4,000 నుంచి 54,000 వరకు ధర పెరిగింది. కియా మరో ఎస్యూవీ మోడల్ కారెన్స్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ధరల పెరుగుదల నిర్ణయం తీసుకుంది. కియా కార్ల మోడల్ వారీగా సవరించిన ధరలను పరిశీలిద్దాం.
కియా కార్నివాల్..
కియా కార్నివాల్ ప్రెస్టీజ్ 7 సీటర్, ప్రెస్టీజ్ 6 సీటర్ మోడల్‌పై రూ. 54,000 ధర పెరిగింది. ఈ ప్రీమియం ఎంపీవీ మోడల్ ఇతర అన్ని మోడళ్ల కంటే రూ. 50,000 ఎక్కువ పెరగడం విశేషం. ధర సవరణతో, కియా కార్నివాల్ ఇప్పుడు రూ. 24.95 లక్షల ధర వద్ద ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ రూ. 33.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంటుంది.
కియా సెల్టోస్..
కియా సెల్టోస్ 1.5 లీటర్ పెట్రోల్ HTE వేరియంట్లపై కనిష్టంగా రూ. 9,000 ధర పెరిగింది. 1.5 లీటర్ డీజిల్ మోడల్ ఎక్స్ లైన్ వేరియంట్‌పై రూ. 9,000 మేర పెరిగింది. కాగా, HTK వేరియంట్ 1.5 -లీటర్ పెట్రోల్ మోడల్, 1.4- లీటర్ టర్బో పెట్రోల్ GTX+ DCT, GTX+ DCT డ్యూయల్ టోన్ వేరియంట్లపై రూ. 11,000 ధర పెరిగింది. ఇతర అన్ని మోడల్స్ రూ. 10,000 పెంపును పొందాయి.
కియా సోనెట్..
కియా సోనెట్ 1-లీటర్ టర్బో-పెట్రోల్ iMT HTK+తో సహా మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. కాగా, 1-లీటర్ టర్బో-పెట్రోల్ DCT మోడల్ మినహా మిగతా అన్ని మోడళ్లపై ధర పెరిగింది. 1-లీటర్ టర్బో పెట్రోల్ iMT HTX+, HTX+ డ్యూయల్ టోన్ వేరియంట్, 1.2 -లీటర్ పెట్రోల్ మోడల్‌కు చెందిన HTK+ వేరియంట్లపై కనీసం రూ.4,000 ధర పెరిగింది. 1-లీటర్ టర్బో-పెట్రోల్ iMT HTX, HTX యానివర్సరీ ఎడిషన్‌పై రూ. 10,000 మేర పెరిగింది. కియా సోనెట్ అన్ని పెట్రోల్ మోడళ్లపై రూ. 6,000 ధర పెరిగింది. డీజిల్ మోడల్‌లలో, HTE MT, HTK MT వేరియంట్లు రూ. 10,000 పెంపును అందుకున్నాయి. అయితే, GTX+ AT, GTX AT+ డ్యూయల్ టోన్ వేరియంట్లపై రూ. 14,000 ధర పెరిగింది. కియా సోనెట్ అన్ని ఇతర డీజిల్ మోడళ్లపై రూ. 20,000 ధర పెరిగింది.
మరోవైపు భారతదేశంలో కియా నాలుగో మోడల్, కియా కేరెన్స్ బుకింగ్స్ జనవరి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం సోనెట్, సెల్టోస్ మోడళ్లను భారత్‌లోనే తయారు చేస్తుండగా.. కార్నివాల్ మోడల్ మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.