హోమ్ /వార్తలు /బిజినెస్ /

Kia Sonet: సోనెట్ CNG వేరియంట్‌ను టెస్ట్ చేస్తున్న కియా కంపెనీ.. త్వరలో ఇండియాలో కూడా..

Kia Sonet: సోనెట్ CNG వేరియంట్‌ను టెస్ట్ చేస్తున్న కియా కంపెనీ.. త్వరలో ఇండియాలో కూడా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కియా నుంచి రాబోయే సోనెట్ CNG వెర్షన్‌ను ఇండియాలో టెస్ట్ చేస్తుండగా కెమెరాలకు చిక్కింది. దీంతో ఈ మోడల్‌ను కంపెనీ త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

కియా కంపెనీ కార్ల సేల్స్‌లో(Kia Company Cars Sales) కొత్త ట్రెండ్(Trend) క్రియేట్ చేస్తోంది. కొత్త మోడళ్లపై (New Models) దృష్టి పెట్టిన ఈ కంపెనీ ఇటీవల ఇండియాలో సెల్టోస్, సోనెట్‌(Senet) వేరియంట్లను విడుదల చేసింది. 2022 కియా సోనెట్ సిరీస్‌లో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు(Airbags) వంటి సేఫ్టీ ఫీచర్‌లతో సహా అనేక అప్‌డేట్‌లను పొందుపర్చింది. అయితే కియా అమ్మకాలను(Kia Sales) పెంచుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను వెతుకుతోంది. కియా ఇండియా(Kia India) మన దేశంలో సోనెట్ CNG వెర్షన్‌ను పరీక్షించడం ప్రారంభించింది. కియా నుంచి రాబోయే సోనెట్ CNG వెర్షన్‌ను ఇండియాలో టెస్ట్ చేస్తుండగా కెమెరాలకు(Camera) చిక్కింది. దీంతో ఈ మోడల్‌ను కంపెనీ త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. చూడటానికి ఇది సాధారణ సోనెట్ లాగా కనిపిస్తున్నప్పటికీ, జాగ్రత్తగా పరిశీలిస్తే దీనికి CNG స్టిక్కర్ ఉన్నట్లు చూడవచ్చు. SUV GT లైన్ బ్యాడ్జ్‌ కూడా ఈ కారుకు ఉంది. ఇది Kia 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మోటారుతో CNG ఎంపికను అందించే అవకాశం ఉందని సూచిస్తుంది.

SBI: బ్యాంక్ లో దొంగతనం.. డబ్బులను ముట్టుకోలేదు కానీ.. రూ.11 కోట్ల విలువైన వాటిని తీసుకెళ్లారు..!


కియా సోనెట్ పెట్రోల్ వేరియంట్‌లో 1.0-లీటర్, 3-సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటారు ఉంటుంది. ఇది 118 hp శక్తిని, 172 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. అయితే బై-ఫ్యూయెల్ CNG వేరియంట్ తక్కువ శక్తి, టార్క్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. అలాగే ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్‌కు కంపెనీ అధికారికంగా లాంచ్ చేసిన తర్వాతే దీని గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. CNG కిట్‌తో ఇండియాలో లాంచ్ అయిన ఫస్ట్ కియా కారుగా సరికొత్త సోనెట్ గుర్తింపు పొందనుంది.

సోనెట్ మోడల్ 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటారుతో పాటు 82 hp 1.2-లీటర్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 98 hp / 113 hp 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్‌లో 5-స్పీడ్ MT, డీజిల్ వేరియంట్‌లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ / 6-స్పీడ్ AT ఉన్నాయి.

Loans vs Credit card: క్రెడిట్‌ కార్డ్‌ వర్సెస్ పర్సనల్‌ లోన్‌.. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఈ రెండింట్లో ఏది మంచిది..?


ప్రస్తుతం భారతదేశంలో CNG సబ్-కాంపాక్ట్ SUV అమ్మకంలో లేనప్పటికీ.. కియాతో పాటు టాటా మోటార్స్, మారుతి సుజుకీ నుంచి కూడా ఇలాంటి కార్లను చూసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ సరికొత్త సీఎన్‌జీ వేరియంట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

First published:

Tags: CNG, Kia cars, KIA Motors

ఉత్తమ కథలు