Home /News /business /

KIA SELTOS MID SPEC DIESEL AUTOMATIC CARNIVAL PREMIUM 7 SEATER BASE VARIANTS DROPPED GH VB

Kia Seltos: కియా కీలక నిర్ణయం.. భారత్​లో ఆ రెండు మోడల్స్​ పూర్తిగా నిలిపివేత.. ఎందుకంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ కొరియా ఆటోమొబైల్​ దిగ్గజం కియా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన రెండు వేరియంట్లను భారత మార్కెట్​లో నిలిపివేయాలని నిర్ణయించింది.

దక్షిణ కొరియా(South Korea) ఆటోమొబైల్​ దిగ్గజం కియా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీకి(Company) చెందిన రెండు వేరియంట్లను భారత మార్కెట్​లో నిలిపివేయాలని నిర్ణయించింది. భారత్​లో అత్యంత ప్రజాదరణ పొందిన కియా సెల్టోస్ ఎస్​యూవీ, కార్నివాల్ ఎంపీవీ మోడళ్లకు(Models) చెందిన రెండు వేరియంట్లను తన లైనప్​ నుంచి తొలగించింది. భారత్​లో కంపెనీ మొట్టమొదటి ఉత్పత్తి అయిన సెల్టోస్ ఎస్​యూవీ(SUV) రేంజ్​లోని మిడ్​రేంజ్​ HTK+ డీజిల్​ ఆటోమేటిక్​ ట్రిమ్​, ఏడు సీట్ల ప్రీమియం ఎంపీవీ కార్నివల్​ వేస్​ వేరియంట్లను ఉపసంహరించుకున్నట్లు కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను కియా ఇండియా ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ రెండు వేరియంట్లకు భారత్​లో తక్కువ డిమాండ్​ ఉన్నందున వీటిని నిలిపివేయాలని నిర్ణయించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక, ఈ కార్ల కోసం డీలర్ల నుంచి బుకింగ్​లు తీసుకోవడానికి కియా ఇండియా నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు వేరియంట్లు భారత్​లో ఇక కనిపించవని స్పష్టమవుతోంది.

Apple iPhone 13 Mini: యాపిల్​ ఐఫోన్​ 13 మినీపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్​.. అమెజాన్​లో ఏకంగా రూ. 15 వేల వరకు డిస్కౌంట్..


డీలర్​షిప్​ సెంటర్లలో బుకింగ్స్​ నిలిపివేత..

ప్రస్తుతం కంపెనీ ఉపసంహరించుకున్న కియా సెల్టోస్​ HTK+ డీజిల్​ ఆటోమేటిక్​ వేరియంట్​ ధర రూ. 14.25 లక్షలు (ఎక్స్​షోరూమ్​). కియా కార్నివల్​ బేస్​ వేరియంట్​ డీజిల్​ ఆటోమేటిక్​ రూ. 25.49 లక్షలు (ఎక్స్​షోరూమ్​, ఢిల్లీ) వద్ద అందుబాటులో ఉన్నాయి. కాగా, సెల్టోస్​ డీజిల్ ఆటోమేటిక్​ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు జీటీఎక్స్​ ప్లస్ డీజిల్​ సెల్టోస్​​ ఆటోమేటిక్​ వేరియంట్​ను బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. 6 -స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో వచ్చే 1.5 -లీటర్ పవర్డ్ డీజిల్ సెల్టోస్ కారు రూ. 17.95 లక్షల (ఎక్స్ -షోరూమ్, ఢిల్లీ) వద్ద లభిస్తుంది. ఇది HTK+ వేరియంట్​ కంటే రూ. 3.7 లక్షలు ఎక్కువ. కార్నివల్​ ఎంపీవీ కొత్త బేస్​ వేరియంట్​ రూ. 29.99 లక్షల (ఎక్స్​షోరూమ్​, ఢిల్లీ) వద్ద లభిస్తుంది. ఇది HTK+ డీజిల్​ ఆటోమేటిక్​ వేరియంట్​ కంటే రూ. 4.5 లక్షలు ఎక్కువ.

కియా కారెన్స్​కు మంచి డిమాండ్..​

కియా ఇటీవల ప్రారంభించిన కారెన్స్​ MPV మోడల్​కు భారత మార్కెట్​లో మంచి డిమాండ్ వస్తోంది. సరసమైన ధరలోనే అద్భుతమైన ఫీచర్లు అందించింది. ఇది భారతదేశంలోని 7 -సీట్ల MPV మార్కెట్‌లో కొనుగోలుదారులకు అత్యంత గొప్ప ఎంపికగా రాణిస్తోంది. కారెన్స్ ప్రారంభ ధరలు రూ. 8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఇది హ్యుందాయ్ క్రెటా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, ఎంజీ హెక్టర్‌లతో పోటీపడుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Bengali models, Business, Business Loan, Cars, KIA Motors, New cars

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు