Kia Motors: ఈనెల 8న కియా కొత్త కారు విడుదల...సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

ముఖ్యమంత్రి నివాసంలో కంపెనీ ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ ముఖ్యమంత్రిని కలిసి కొత్తకారు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏడాదికి 3 లక్షల కార్లను అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటుద్వారా ఉత్పత్తి చేయగలమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

news18-telugu
Updated: August 5, 2019, 10:52 PM IST
Kia Motors: ఈనెల 8న కియా కొత్త కారు విడుదల...సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ప్రతీకాత్మక చిత్రం (Image : Twitter)
news18-telugu
Updated: August 5, 2019, 10:52 PM IST
ఈనెల 8న కియా కంపెనీ తన కొత్తకారు ‘సెల్తోస్‌’ను మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి   వైయస్‌. జగన్‌ను కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నివాసంలో కంపెనీ ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ ముఖ్యమంత్రిని కలిసి కొత్తకారు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏడాదికి 3 లక్షల కార్లను అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటు ద్వారా ఉత్పత్తి చేయగలమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. భవిష్యత్తులో 7 లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యానికి చేరుకుంటామని సీఎంకు వెల్లడించారు. ప్రస్తుతం టర్కీ, స్లొవేకియాలకు ఇంజన్లను కూడా ఎగుమతి చేస్తామన్నారు. కియా కొత్తకారు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ హాజరవుతున్నారు.

ముఖ్యమంత్రిని ఆహ్వానించిన కియా కంపెనీ, హాజరుకానున్న సీఎం


First published: August 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...