హోమ్ /వార్తలు /బిజినెస్ /

Kia Motors: ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించనున్న కియా మోటర్స్...ఇక పెట్రోల్, డీజిల్ ఇంజిన్లకు టాటా...

Kia Motors: ఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించనున్న కియా మోటర్స్...ఇక పెట్రోల్, డీజిల్ ఇంజిన్లకు టాటా...

kia motors

kia motors

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ 2027 నాటికి- ఏడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్నామని తెలిపింది. కియా మోటార్స్ కార్పొరేషన్ తన గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ స్ట్రాటజీని వెల్లడించింది.

రాబోయేకాలంలో ఆటోమొబైల్స్ యొక్క భవిష్యత్తు ఎలక్ట్రిక్ కార్లు మరియు బ్యాటరీ కార్లపై ఆధారపడి ఉంటుంది. దీనికి అనుగుణంగా అన్ని కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ 2027 నాటికి- ఏడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్నామని తెలిపింది. కియా మోటార్స్ కార్పొరేషన్ తన గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ స్ట్రాటజీని వెల్లడించింది. కొరియాలోని కియా బ్రాండ్ హ్వాసుంగ్ ప్లాంట్‌లో జరిగిన కార్యక్రమంలో కియా భవిష్యత్తు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వ్యూహాలపై కియా ప్రెసిడెంట్ మరియు CEO హో సుంగ్ సాంగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ "2011లో మా కంపెనీ మొట్టమొదటి ఉత్పత్తి చేసిన బీఈవీ, కియా రే ఈవీలను ప్రవేశపెట్టినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా 100,000 బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్(బీఈవీ)లను విక్రయించింది. అప్పటి నుండి, మేము ప్రపంచ మార్కెట్ల కోసం కొత్త బీఈవీల శ్రేణిని ప్రవేశపెట్టడం ప్రారంభించాము. రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నాం. ఎలక్ట్రిక్ కార్లపై మా వ్యాపారాన్ని కేంద్రీకరించడం ద్వారా, 2029 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అమ్మకాలలో 25 శాతం బీఈవీలను తాము కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని సాంగ్ చెప్పారు. 2020 ప్రారంభంలో ప్రకటించిన కియా 'ప్లాన్ ఎస్' స్ట్రాటజీ కింద బిఇవి లైనప్‌ను 2025 నాటికి 11 మోడళ్లకు విస్తరించాలని యోచిస్తోంది. అదే కాలంలో కొరియా, ఉత్తర అమెరికా మరియు ఐరోపాతో సహా ఆధునిక మార్కెట్లలో మొత్తం వాహన అమ్మకాల్లో తమ బ్రాండ్ 20 శాతం వాటా పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కియా ‘ప్లాన్ ఎస్’ స్ట్రాటజీ

జనవరిలో కియా మోటార్స్‘ప్లాన్ ఎస్’ ద్వారా దీర్ఘకాలిక భవిష్యత్ వ్యూహాన్ని ఆవిష్కరించింది, బీఈవీలపై దృష్టి పెట్టడానికి, తన భవిష్యత్ వ్యాపారాలను మార్చడానికి ప్రణాళికలను రచించింది. పట్టణ కేంద్రాలు, సుదూర ప్రయాణాలకు డ్రైవింగ్ చేసేవారికి అనువైన మోడళ్ల శ్రేణితో, విభిన్న ఉత్పత్తి రకాలను అందించడం ద్వారా మార్కెట్ డిమాండ్ తీర్చాలని కియా యోచిస్తోంది. తన కొత్త ఎలక్ట్రిక్ -గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ ద్వారా, కియా ఉత్తమ- ఇన్-క్లాస్ ఇంటీరియర్ స్పేస్ కలిగిన వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా, కియా తన డీలర్ నెట్‌వర్క్‌ల భాగస్వామ్యంతో యూరప్‌లో 2,400 మరియు ఉత్తర అమెరికాలో 500 కి పైగా EV ఛార్జర్లను ఏర్పాటు చేస్తోంది. EV ల కోసం మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కియా తన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచాలని యోచిస్తోంది. ఈ సంవత్సరం జూలైలో పర్పుల్ ఎమ్‌ను ప్రారంభించిన కియా విద్యుత్ శక్తి, రవాణా మరియు EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన కొరకు వివిధ ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయాలని యోచిస్తోంది.

First published:

Tags: Automobiles, Business, Cars

ఉత్తమ కథలు