Price Hike | మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కార్ల ధరలు పెరగబోతున్నాయి. మార్చి 1 నుంచి కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. అందువల్ల మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తే.. మాత్రం ఈ నెలలోనే కారు కొనేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వచ్చే నెల నుంచి కార్ల (Cars) ధరలు పెరగబోతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు కార్ల ధరలను పెంచేశాయి. కియా (Kia) మోటార్స్ కూడా కార్ల ధరలు పెంచేసింది. అయితే ఈ కంపెనీ మరోసారి కార్ల ధరల పెంపునకు రెడీ అవుతోంది.
ఏప్రిల్ నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. దీంతో కార్ల కంపెనీలు అన్నీ కూడా ఆ రూల్స్‌కు అనుగుణంగా కార్లను తయారు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల కార్ల ఉత్పత్తి వ్యయాలు పైకి చేరనున్నాయి. అందుకే కార్ల కంపెనీలు కూడా ధరల పెంపునకు సిద్ధం అవుతున్నాయి. కియా మోటార్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.
రూ.1కే ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఫ్లిప్‌కార్ట్ మైండ్‌బ్లోయింగ్ ఆఫర్!
ఆర్‌డీఈ నిబంధనలకు అనుగుణంగా కార్లను తయారు చేసి విక్రయించాల్సి ఉందని, అందుకే కార్ల ధరలు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు పెరగనున్నాయని కియా మోటార్స్ వెల్లడించింది. కియా సొనెట్, కియా సెల్టోస్, కియా కరెన్స్ వంటి మోడళ్ల ధరలు పైపైకి కదలనున్నాయి. మార్చి 1 నుంచి రేట్ల పెంపు వర్తిస్తుంది. ఇప్పటికే కియా కంపెనీ జనవరిలో కార్ల ధరలు పెంచింది. ఇప్పుడు మార్చి నుంచి ధరలు మరోసారి పెరగబోతున్నాయి.
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ఢమాల్, రూ.3,300 పతనమైన రేట్లు!
అప్‌డేటెడ్ సెల్టోస్ కారు ధర రూ. 40 వేల వరకు పైకి చేరుతుంది. ఇది పెట్లోల్ ఆప్షన్‌కు వర్తిస్తుంది. అదే డీజిల్ వేరియంట్‌కు అయితే ధర పెంపు రూ. 50 వేలగా ఉంది. సొనెట్ కారు విషయానికి వస్తే.. ధర పెంపు రూ. 30 వేలుగా ఉంది. పెట్రోల్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. అదే ఈ కారులో డీజిల్ వేరియంట్ ధర అయితే రూ. 45 వేలు పెరుగుతుంది. కరెన్స్ మోడల్ విషయానికి వస్తే.. దీని రేటు పెట్రోల్ వేరియంట్‌కు రూ. 30 వేలు, డీజిల్ వేరియంట్‌కు రూ. 50 వేలు పెరుగుతుంది.
అంటే జనవరి నుంచి చూస్తే సెల్టోస్ కారు ధర ఏకంగా రూ. లక్ష పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే సొనెట్ ధర రూ. 85 వేలు పైకి చేరిందని అర్థం చేసుకోవాలి. ఇంకా కరెన్స్ కారు ధర రూ. 95 వేలు పెరిగిందని చెప్పుకోవాలి. కొత్త కారు కొనే వారికి ఇది నిజంగా షాకింగ్ అనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Budget cars, Cars, Kia cars, KIA Motors, Kia sales, Price Hike