Kia Motors: ఏపీ నుంచీ తరలిపోతున్న కియా మోటార్స్... సంచలన కథనం

Kia Motors : అవునా... నిజమేనా అనిపించే న్యూస్ ఇది. కియా మోటార్స్‌ని తామే తెచ్చామని గత ఏపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ఇప్పుడా కంపెనీ తరలిపోతే... ప్రస్తుత ప్రభుత్వానికి సమస్యే.

news18-telugu
Updated: February 6, 2020, 10:23 AM IST
Kia Motors: ఏపీ నుంచీ తరలిపోతున్న కియా మోటార్స్... సంచలన కథనం
ఏపీ నుంచీ తరలిపోతున్న కియా మోటార్స్... సంచలన కథనం
  • Share this:
Kia Motors | Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలల కిందటే... తొలి కారును రిలీజ్ చేసిన దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్... ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంతో చర్చిస్తోందనీ, రూ.7387 కోట్ల విలువైన ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించే ఆలోచనలో ఉందనీ రాయిటర్స్ సంస్థ సంచలన కథనం ఇచ్చింది. ప్రభుత్వ పాలసీల్లో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని తెలిసింది. రెండేళ్ల పాటూ నిర్మించిన తర్వాత... గత డిసెంబర్‌లో కియా మోటార్స్... ఏపీలోని అనంతపురం జిల్లాలో... తన కార్ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌కి ఏటా 300000 లక్షల కార్లను తయారుచేసే సత్తా ఉంది. అలాగే... 12000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఏపీకి పక్కనే ఉన్న తమిళనాడులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ జోరుగా ఉంది. వాహనాల చాలా పార్టులు అక్కడి నుంచే సప్లై అవుతున్నాయి. అందువల్లే కియా మోటార్స్ కూడా అక్కడికి తరలిపోయే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఏపీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కియామోటార్స్... ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వచ్చే వారం సెక్రెటరీ స్థాయిలో చర్చలు జరగనున్నాయి. అప్పుడు ఈ అంశంపై మరింత స్పష్టత వస్తుంది అని ఓ ప్రభుత్వాధికారి తమకు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది.


ఇండియా మార్కెట్‌లో దీర్ఘకాలికంగా కొనసాగాలనుకుంటున్నట్లు... ఏపీ ప్లాంట్‌ నుంచీ ఉత్పత్తిని సంపూర్ణంగా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కియా కంపెనీ తన స్టేట్‌మెంట్‌లో తెలిపింది. ఇప్పుడున్న ప్రదేశం నుంచీ ప్లాంటును తరలించే ఉద్దేశం లేదనీ... తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి కాబట్టి... వాటిపై అప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపింది. కియా స్థానంలో... అదే కంపెనీకి చెందిన మరో కంపెనీ హ్యూందయ్ మోటార్స్ కంపెనీ నిర్వాహకులు... తమిళనాడు ప్రభుత్వంతో ఈ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. హ్యూందయ్ కంపెనీ... ఇండియాలో రెండో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ. ఇది తన కార్లను తమిళనాడులో ఉత్పత్తి చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై హ్యాందయ్ గానీ, ఏపీ, తమిళనాడు ప్రభుత్వాల సీఎం కార్యాలయాలు గానీ స్పందించలేదు. కొత్త ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానం తమకు ఇబ్బంది కలుగుతోందని కియా భావిస్తోంది. ముఖ్యంగా స్థానికులకే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనే కండీషన్... కియా నిర్వాహకులకు తలనొప్పిగా మారిందని తెలిసింది. ఐతే.. ప్రభుత్వాలు మారితే... పాలసీ విధానాల మార్పుతో విదేశీ పెట్టుబడిదారులు ఇబ్బంది పడకుండా చట్టాల్లో మార్పులు చేసే అంశాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం.

తమిళనాడుకు ప్లాంటును తరలిస్తే... కియా కంపెనీకి లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి. అలాగే వాహన పార్టుల సప్లై దారులకు దగ్గరవుతుంది. ఐతే... కియా ఎప్పటికల్లా తరలిపోతుందో స్పష్టత లేదని రాయిటర్స్ సంస్థ తన కథనంలో తెలిపింది.
First published: February 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు