Kia Motors, Hyundai Recall: హ్యుందాయ్ మోటార్స్, కియా మోటార్స్ 6 లక్షలకు పైగా కార్లను రీకాల్ చేయనున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ వల్ల మంటలకు దారితీస్తోందని, దీంతో కారులో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కావచ్చని అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయా మోడల్స్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ఇరు కంపెనీలు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపాయి. ఇరు కార్ల తయారీదారులు యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు అనంతరం ఇంజిన్ ఫైర్ సమస్యలను గుర్తించి రీకాల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. రీకాల్ చేస్తున్న వాహనాల్లో కియా సోరెంటో ఎస్‌యూవీలు (2014-2015 మధ్య ఉత్పత్తి జరిగినవి), కియా ఆప్టిమా సెడాన్ (2013- 2015 మధ్య ఉత్పత్తి జరిగినవి), హ్యుందాయ్ శాంటా ఫే ఎస్యువి (2013-2015 మధ్య ఉత్పత్తి చేసినవి) ఉన్నాయి. కాగా వీటిని యుఎస్, కెనడాలో మాత్రమే రీకాల్ చేయనున్నారు. ముఖ్యంగా బ్రేక్ ఫ్లూయిడ్ ఆయిల్ లీక్ కావడం వల్ల ఇంజిన్ మంటలు సంభవించినట్లు ఇప్పటికే 15 నివేదికలు నమోదు అయినట్లు హ్యుందాయ్ తెలిపింది. ఇందులో కియాకు సంబంధించినవి కూడా ఎనిమిది సంఘటనలు ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ నివేదికలో కస్టమర్లు ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది.
కస్టమర్లకు సూచనలు ఇస్తూ రీకాల్ చేసిన ఆయా మోడల్స్ కార్లను ఆరుబయట పార్క్ చేయవలసిన అవసరం లేదని, అయితే యాంటీ-లాక్ బ్రేక్ హెచ్చరిక లైట్ వస్తే, యజమానులు తమ వాహనాలను నడపకూడదని, వెంటనే ఒక డీలర్‌ను సంప్రదించాలని హ్యుందాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. పాజిటివ్ కేబుల్‌ను తొలగించడం ద్వారా 12 వోల్ట్ బ్యాటరీని కూడా డిస్కనెక్ట్ చేయాలని కంపెనీ తెలిపింది.
రెండు కంపెనీల డీలర్లు లీక్‌ల విషయంలో కంట్రోల్ యూనిట్లను తనిఖీ చేస్తారు. యజమానులకు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైతే వాటిని భర్తీ చేస్తారు. రెండు సంవత్సరాల క్రితం 2014 Santa Feలో ఇంజిన్ అగ్నిప్రమాదం హ్యుందాయ్ మొదటి ఫిర్యాదును అందుకుంది మరియు ఇది దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2015 సోరెంటోలో కరిగిన కంట్రోల్ యూనిట్ యొక్క ఫిర్యాదు వచ్చిన తరువాత కియా దర్యాప్తు ప్రారంభించింది.
ఫిబ్రవరిలో, హ్యుందాయ్ దాదాపు 430,000 చిన్న కార్లను ఇలాగే రీకాల్ చేసింది. యాంటిలాక్ బ్రేక్ కంప్యూటర్లోకి ప్రవేశించి, ఎలక్ట్రికల్ షార్ట్ మరియు ఇంజిన్ ఫైర్‌కు కారణమవుతుందని కంపెనీ తెలిపింది. ఆ రీకాల్ కొన్ని 2006 నుండి 2011 ఎలంట్రా మరియు 2007 నుండి 2011 ఎలంట్రా టూరింగ్ వాహనాలను కవర్ చేసింది. తాజా రీకాల్ మునుపటి రీకాల్స్ లేదా యుఎస్ దర్యాప్తుకు సంబంధించినది కాదని హ్యుందాయ్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, Cars