• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • KIA MOTORS CONDEMNED REUTERS STORY OF MOVING OF ITS RS 7387 CRORE INDIA PLANT OUT OF ANDHRA PRADESH NK

Kia Motors: ఆ కథనాన్ని ఖండించిన కియా, ఏపీ ప్రభుత్వం... ఏపీలోనే ఉంటామని కియా ప్రకటన

Kia Motors: ఆ కథనాన్ని ఖండించిన కియా, ఏపీ ప్రభుత్వం... ఏపీలోనే ఉంటామని కియా ప్రకటన

కియా మోటార్స్(ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh : కియా మోటార్స్‌ సంస్థ తమిళనాడుకు తరలిపోతోందని రాయిటర్స్ సంస్థ ఇచ్చిన కథనాన్ని ఏపీలోని కియా మోటార్స్ తప్పుపట్టింది. తాము ఎక్కడికీ వెళ్లట్లేదని స్పష్టం చేసింది.

  • Last Updated:
  • Share this:
    Kia Motors | Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్... అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటార్స్ ప్లాంటును తమిళనాడుకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ... రాయిటర్స్ సంస్థ ఇచ్చిన కథనాన్ని కియా మోటార్స్ యాజమాన్యం ఖండించింది. ఇదివరకు మహారాష్ట్రకు తరలించేస్తున్నామని ఇలాగే కథనాలు వచ్చాయన్న కియా మోటార్స్... తాజా ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయన్న కియా మోటార్స్... తమ ప్లాంటులో 85 శాతం స్థానిక యువతే పనిచేస్తున్నారనీ... పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరుగుతోందనీ క్లారిటీ ఇచ్చింది. అందువల్ల ఇవాళ రాయిటర్స్ సంస్థ ఇచ్చిన కథనంలో నిజం లేదనేందుకు కియా మోటార్స్ ఇచ్చిన ప్రకటన బలం చేకూర్చుతోంది.


    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాయిటర్స్ కథనాన్ని తప్పుపట్టింది. ఇది పూర్తిగా అవాస్తవం అని తేల్చింది. అసత్యాలతో కూడిన కథనం అని తెలిపింది. కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయనీ... ఈ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనీ... పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ భార్గవ తెలిపారు. మొత్తంగా రాయిటర్స్ సంస్థ ఏ ఉద్దేశంతో ఈ కథనం ఇచ్చిందోగానీ... ఏపీలో అది కలకలం రేపినట్లైంది. ఐతే... కియా మోటార్స్ సంస్థ క్లారిటీ ఇవ్వడంతో... ఆ సంస్థ ప్లాంట్ తమిళనాడుకు తరలిపోవట్లేదని అనుకోవడానికి వీలవుతోంది.

    రాయిటర్స్ ఏమందంటే : ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలల కిందటే... తొలి కారును రిలీజ్ చేసిన దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్... ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంతో చర్చిస్తోందనీ, రూ.7387 కోట్ల విలువైన ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించే ఆలోచనలో ఉందనీ రాయిటర్స్ సంస్థ సంచలన కథనం ఇచ్చింది. ప్రభుత్వ పాలసీల్లో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని తెలిసింది. రెండేళ్ల పాటూ నిర్మించిన తర్వాత... గత డిసెంబర్‌లో కియా మోటార్స్... ఏపీలోని అనంతపురం జిల్లాలో... తన కార్ల తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ ప్లాంట్‌కి ఏటా 300000 లక్షల కార్లను తయారుచేసే సత్తా ఉంది. అలాగే... 12000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. ఏపీకి పక్కనే ఉన్న తమిళనాడులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ జోరుగా ఉంది. వాహనాల చాలా పార్టులు అక్కడి నుంచే సప్లై అవుతున్నాయి. అందువల్లే కియా మోటార్స్ కూడా అక్కడికి తరలిపోయే ఆలోచనలో ఉందని రాయిటర్స్ వివరించింది.

    ఏపీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కియామోటార్స్... ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపిందనీ... వచ్చే వారం సెక్రెటరీ స్థాయిలో చర్చలు జరగనున్నాయనీ... అప్పుడు ఈ అంశంపై మరింత స్పష్టత వస్తుందని ఓ ప్రభుత్వాధికారి తమకు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది.
    Published by:Krishna Kumar N
    First published: