Kia Cars | కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కార్ల కంపెనీలు వరుసపెట్టి కార్ల (Cars) ధరలను పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఇప్పటికే రెండు దిగ్గజ కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించాయి. ఎంజీ మోటార్ ఇండియా, కియా (Kia) మోటార్స్ తన కార్ల ధరలను పెంచేశాయి. కార్ల ధర ఏకంగా రూ. లక్ష వరకు పెరిగింది. దీంతో ఈ కంపెనీ కార్లు కొనుగోలు చేయాలని భావించే వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.
ఎంజీ మోటార్ ఇండియా తాజాగా ఎంజీ జెడ్ఎస్ ఈవీ, ఎంజీ అస్టర్, ఎంజీ గ్లాస్టర్ వంటి మోడళ్ల ధరలను పెంచింది. ఎంజీ గ్లాస్టర్ మోడల్ ధర గరిష్టంగా రూ. లక్ష పైకి చేరింది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ రేటు రూ. 40 వేలు పైకి కదిలింది. అన్ని వేరియంట్లకు ఈ రేటు పెంపు వర్తిస్తుంది. దీంతో ఈ కారు ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ. 23 లక్షలు పైనే ఉంది. అలాగే ఎంజీ గ్లాస్టర్ మూడు వేరియంట్ల రూపంలో ఉంది. ఈ కారు ధర రూ. 55 వేల నుంచి పెరిగింది. గరిష్టంగా రూ.లక్ష పైకి చేరింది.
కొత్త కారు కొనే వారికి బంపరాఫర్.. రూ.65,000 డిస్కౌంట్!
ఇక ఎంజీ అస్టర్ కారు ధర రూ. 20 వేలు పెరిగింది. ఈ కారు మార్కెట్‌లోకి రూ. 10.51 లక్షల ఎక్స్‌షోరూమ్ రేటుతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని కొనాలంటే మరో రూ. 20 వేలు ఎక్కువగా ఖర్చు చేయాలి. కేవలం ఎంజీ కార్ల ధరలు మాత్రమే కాకుండా కియా కార్ల ధరలు కూడా పైకి కదిలింది. కియా కార్ల ధర కూడా రూ.లక్ష వరకు పైకి చేరింది. ఈవీ6 కారు ధర గరిష్టంగా రూ. లక్ష వరకు పైపైకి కదిలింది. దీని ప్రారంభ ధర రూ. 60.95 లక్షలుగా ఉంది.
పడిపోయిన బంగారం.. మళ్లీ పరుగులు పెట్టింది, నేటి రేట్లు ఇలా!
అలాగే కియా సెల్టోస్ కారు ధర కూడా పైకి కదిలింది. ఈ కారు రేటు రూ. 50 వేలు పెరిగింది. దీని రేటు రూ. 10.69 లక్షల నుంచి ఉంది. ఇంకా కియా సొనెట్ కారు రేటు కూడా పెరిగింది. ఈ కారు ధర రూ. 40 వేల వరకు పైకి చేరింది. bigg bomg, తో ఈ కారు రేటు రూ. 7.69 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే కియా కరెన్స్ కారు ధర రూడా రూ. 45 వేల వరకు పైకి చేరింది. దీని రేటు రూ. 10.2 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ధరలు అన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కార్ల ధరల పెంపుతో చాలా మంది పై ప్రభావం పడనుంది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car prices, Cars, Kia cars, KIA Motors, Price Hike