హోమ్ /వార్తలు /బిజినెస్ /

Kia Sonet X Line: కియా సోనెట్ X లైన్ టీజర్‌ విడుదల.. లాంచ్ ఎప్పుడంటే..

Kia Sonet X Line: కియా సోనెట్ X లైన్ టీజర్‌ విడుదల.. లాంచ్ ఎప్పుడంటే..

Kia Sonet X Line ( PC : Kia Motors)

Kia Sonet X Line ( PC : Kia Motors)

Kia Sonet X Line: స్టాండర్డ్ సోనెట్‌లో కనిపించే 16-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో పోలిస్తే కొత్త వేరియంట్ పెద్ద అల్లాయ్‌ వీల్స్‌తో వచ్చే అవకాశం ఉంది. సెల్టోస్ X లైన్ దాని స్టాండర్డ్‌ వేరియంట్‌లలో కనిపించే 17-అంగుళాల యూనిట్ల స్థానంలో 18-అంగుళాలతో రీప్లేస్‌ చేయనుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కియా ఇండియా (Kia India) నుంచి మరో కొత్త కారు (New Car) లాంచ్ కానుంది. కంపెనీ నుంచి రానున్న సోనెట్ X లైన్‌ (Sonet X Line) కారు గురించి పూర్తి వివరాలను అధికారిక టీజర్‌ (Teaser) ద్వారా వెబ్‌సైట్‌లో పంచుకుంది. ఈ టీజర్‌ ద్వారా కొన్ని ఫీచర్లను వినియోగదారులకు తెలియజేసింది. ఈ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ స్పోర్టి టాప్-ఆఫ్-ది-లైన్ ట్రిమ్ సెప్టెంబర్‌లో మార్కెట్లో లాంచ్‌ కానుంది. అయితే కచ్చితంగా ఏ తేదీన లాంచ్‌ చేస్తారనేదానిపై స్పష్టత లేదు. సోనెట్ X లైన్ టీజర్ ఆధారంగా ఇది సెల్టోస్ X లైన్ వేరియంట్‌లో వచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ మ్యాట్ గ్రాఫిక్(Xclusive Matte Graphic) పెయింట్ స్కీమ్ తరహాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. కియా సోనెట్ X లైన్ గత సంవత్సరం లాంచ్ అయిన సెల్టోస్ X లైన్‌లతో పాటు ఎక్స్‌టర్నల్‌, ఇంటర్నల్‌ మార్పులతో సహా మరిన్ని అప్‌డేట్స్‌తో రావచ్చని భావిస్తున్నారు. కాంపాక్ట్ ఎస్‌యూవీ వెనుక భాగంలో X లైన్ బ్యాడ్జింగ్ కనిపిస్తోంది.


* కొత్త వేరియంట్‌లో అప్‌డేటెడ్‌ అల్లాయ్‌లు
స్టాండర్డ్ సోనెట్‌లో కనిపించే 16-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో పోలిస్తే కొత్త వేరియంట్ పెద్ద అల్లాయ్‌ వీల్స్‌తో వచ్చే అవకాశం ఉంది. సెల్టోస్ X లైన్ దాని స్టాండర్డ్‌ వేరియంట్‌లలో కనిపించే 17-అంగుళాల యూనిట్ల స్థానంలో 18-అంగుళాలతో రీప్లేస్‌ చేయనుంది. సోనెట్ X లైన్ డిజైన్‌కు సంబంధించిన ఇతర అప్‌గ్రేడ్‌లలో ఆరెంజ్‌ హైలైట్‌లు, బాడీ అంతటా బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్ టచ్‌లతో బ్లాక్డ్-అవుట్ స్కిడ్ ప్లేన్ ఉండే అవకాశం ఉంది.కారు లోపలి భాగంలో సెల్టోస్ X లైన్‌ లాంటి హనీకోంబ్‌ ప్యాటర్న్, గ్రే స్టిచింగ్‌తో 'ఇండిగో పెరా' లెథెరెట్ సీట్లు ఉండవచ్చు. డ్యాష్‌బోర్డ్ నలుపు, బూడిద రంగు డ్యూయల్-టోన్‌లో కనిపిస్తోంది. ఇతర యాక్సెసరీస్, ఫీచర్లు సోనెట్ ట్రిమ్ GT లైన్ ట్రిమ్‌ మాదిరిగానే ఉండవచ్చు.


ఇది కూడా చదవండి : ఇప్పుడు ఒక రాజులా ప్రయాణించవచ్చు.. మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ లగ్జరీ ట్రైన్ బుకింగ్స్ ప్రారంభం.. స్పెషల్ ప్యాకేజీల వివరాలివే..


* ధరలను వెల్లడించని కియా

సోనెట్‌ X లైన్ డిజైన్, ఫీచర్ల పరంగా చాలా అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, మెకానికల్ కాన్ఫిగరేషన్ మారకుండా ఉంటుంది. కియా ఎస్‌యూవీని 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లను మాత్రమే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందించే అవకాశం ఉంది. డీజిల్ యూనిట్ 115 bhp శక్తిని, 250 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేసే సామర్ధ్యాలతో ఉంటుంది. మరోవైపు టర్బో పెట్రోల్ ఇంజన్ 120 bhp శక్తిని, 172 Nm గరిష్ట టార్క్‌ను అందించగలదు.సోనెట్ ఎక్స్ లైన్ ధరలను కియా ఇంకా వెల్లడించలేదు. స్టాండర్డ్‌ కియా సోనెట్ భారతదేశంలో రూ.7.5 లక్షల నుంచి రూ.13. 5 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. లాంచ్‌ అయిన తర్వాత ఈ ఎస్‌యూవీ టయోటా అర్బన్ క్రూయిజర్, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్, రాబోయే, హ్యుందాయ్ వెన్యూ N లైన్ వంటి వాటి నుంచి పోటీ ఎదుర్కొంటుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Cars, Kia cars, KIA Motors

ఉత్తమ కథలు