KIA Cars: భారత్ లో కియా పేరు మార్పు..? పేరు మార్చడానికి కారణం ఇదే..?

అధికారికంగా భారత్ లో పేరు మార్చుకున్న కియా

కియా మోటర్స్ పేరు మార్చుకుంది. నేటి నుంచి భారత వ్యాప్తంగా పేరు.. లోగో మారుస్తున్నట్టు ఆ సంస్థే అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ పేరు మార్పుకు కారణం ఏంటో తెలుసా..?

  • Share this:
    కియా.. భారత్ లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే అదుర్స్ అనిపించింది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో కియా కార్లకు భారత్ లో డిమాండ్ పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది. కరోనా కష్ట కాలంలో కూడా కియా కార్ల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో కియా కార్లను కొనేందుకు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా యువతను ఈ కార్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.  దీంతోనే కేవలం ఏడాదిన్నర కాలంలోనూ కియా కార్లకు అనుకన్నదానికంటే డిమాండ్ పెరిగింది.  దక్షిణ కొరియాకు చెందిన కార్ల కంపెనీ కియా భారత్ లోనే అడుగు పెట్టినా.. కేవలం రెండేళ్ల లోపే అగ్రగామి కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తాజాగా కియా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భారత్ లో తన పేరు మార్చుకుంటున్నట్టు ప్రకటించింది. కియా మోటార్స్‌ను ఇకపై ‘కియా ఇండియా’గా మారుస్తున్నట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

    ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్ కేంద్రంగా పనిచేస్తున్న కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇండియా ఇకపై తమ సంస్థ పేరును కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (కెఐపిఎల్)గా మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. కొంతకాలం క్రితం, కియా ప్రపంచ వ్యాప్తంగా తమ కార్ల కోసం కొత్త లోగోను ఆవిష్కరించింది.

    ఇదీ చదవండి: ఆనందయ్య మందు సీక్రెట్ అదే.. సినీ నటుడు జగపతి బాబు వ్యాఖ్యలు వైరల్

    కార్పొరేట్‌ మంత్రిత్వ శాఖ గుర్తించిన కియా మోటార్స్ స్థానంలో ఇకపై కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అనంతపురంలోని కంపెనీ తయారీ పరిశ్రమలో ఆ మేరకు లోగో, పేరులో మార్పులు చేసింది. డీలర్‌షిప్‌ కేంద్రాల దగ్గర కూడా దశలవారీగా ఆ మేరకు మార్పులు చేయనున్నట్లు కియా తెలిపింది. ఏడాదిన్నరగా దేశంలో కార్ల విక్రయాలు చేపడుతున్న కియా.. అనతికాలంలోనే దేశంలో నాలుగో అతిపెద్ద కార్ల విక్రయదారుగా అవతరించింది.

    ఇదీ చదవండి: ఏపీలో పదో తరగతి పరీక్షలు వద్దు... కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం కోరుతూ లోకేష్ లేఖ

    2019లో భారత్ లో కియా అడుగుపెట్టింది. భారత్ లో తొలిసారిగా సెల్టోస్ పేరుతో కార్ల ను తయారు చేసింది. భారత్ లో సెల్టోస్ అమ్మకాలు ఊహించని స్థాయిలో జరిగాయి. ఏడాదిన్నరలోపై సెల్టోస్ తరువాత కియా నుంచి వచ్చిన అన్ని సూపర్ హిట్ పేరు తెచ్చుకున్నాయి. దేశ వ్యాప్తంగా రెండున్నర లక్షలపైగా కార్లను విక్రయించింది ఆ సంస్థ.. అయితే ఆ విజయానికి చిహ్నంగా తమ పేరును మార్చాలి అని యాజమాన్యం భావించింది. కొత్త పేరు కంపెనీ బ్రాండ్ కు మరింత గుర్తింపు తెచ్చి పెడుతుందని భావించే పేరు మారుస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. దీర్ఘకాలంలో కంపెనీకి ఉన్నతికి తోడ్పడుతుందని అధికారికంగా ప్రకటించారు.
    Published by:Nagesh Paina
    First published: