దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్(Automobile) తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) భారత్‌లో విద్యుత్తు కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. EV6 పేరుతో తన తొలి ఎలక్ట్రిక్ వెహికిల్‌ను(Electric Vehicle) ఇండియాలో లాంచ్ (Launch) చేసింది. GT లైనప్‌లో వచ్చిన ఆర్‌డబ్ల్యూడీ (రేర్ వీల్ డ్రైవ్/టూ వీల్ డ్రైవ్) ధర రూ.59.95లక్షలు (ఎక్స్ షోరూం). ఏడబ్ల్యూడీ(ఆల్ వీల్ డ్రైవ్) వేరియంట్ ధర రూ.64.96లక్షలు (ఎక్స్ షోరూం)గా ఉంది. EV6 ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌ను కియా ఇప్పటికే భారతదేశంలో ప్రారంభించింది. 100 యూనిట్ల కోసం బుకింగ్స్ ఓపెన్ చేయగా.. అనూహ్యంగా 355 బుకింగ్స్ వచ్చాయి.
ఈ నేపథ్యంలో మొదట నిర్ణయించినదానికంటే వేగంగా డెలివరీలను అందించేందుకు ప్రయత్నిస్తామని కియా తెలిపింది. అయితే ఈ డెలివరీలు ఈ ఏడాది సెప్టెంబరు నుంచే ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. అలాగే భారత్ లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసేందుకు పెట్టుబడి పెట్టనున్నట్లు కియా తెలిపింది. రూ.3 లక్షలు చెల్లించి Kia EV6ను ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 12 నగరాల్లోని 15 డీలర్‌షిప్‌ల ద్వారా ఈ EV6 వాహనాలను కియా విక్రయించనున్నట్లు పేర్కొంది. డీలర్‌షిప్‌ల వద్ద 150 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.
WhatsApp: వాట్సప్‌లో మెసేజ్ తప్పుగా పంపారా? ఎడిట్ చేయొచ్చు
* కియా EV6 ఫీచర్లు..
- 400V-800V ఛార్జర్‌లతో పనిచేసే మల్టీ-ఛార్జింగ్ సిస్టమ్.
- వెహికల్-టూ-లోడ్ ఛార్జింగ్ (V2L): టూ వే ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. తద్వారా హోమ్ ఏసీకి సరిపోయేంత పవర్ తో Kia EV6ను ఛార్జ్ చేయవచ్చు.
- డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్.
- నార్మల్, స్పోర్ట్, ఎకో డ్రైవ్ మోడ్స్
- రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ 'i-PEDAL' డ్రైవింగ్ మోడ్‌లో ఉన్న కారును సులువుగా ఆపేందుకు వీలవుతుంది.
- డ్యూయల్ 12.3-అంగుళాల డిస్‌ప్లే.
- 14 స్పీకర్లతో మెరిడియన్ సౌండ్ సిస్టమ్
- ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
- ఆగ్‌మెంటెడ్ రియాలిటీ (AR) హెడ్ అప్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), కార్ స్పీడ్ వివరాలు, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సూచనలు, హెచ్చరికలను అందిస్తుంది.
-స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ (SCC): స్టాప్ అండ్ గో ఫంక్షనాలిటీతో వస్తుంది.
-భారతదేశ వెర్షన్ గా చెబుతున్న 77.4 kWh లిథియం అయాన్ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 528 కిలోమీటర్లు ట్రావెల్ చేయవచ్చు. 5.2 సెకన్లలో 100 km వేగాన్ని అందుకుంటుంది.
* కియా EV6 ఇంటీరియర్
అడాప్టివ్ డ్రైవింగ్ బీమ్, డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లు. సీక్వెన్షియల్ ఇండికేటర్‌లు, టెయిల్ ల్యాంప్ డిజైన్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
* Kia EV6 సేఫ్టీ ఫీచర్లు..
ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), మల్టీ కొలిజన్ బ్రేక్ అసిస్ట్ (MCBA), యాంటీ-లాక్‌లు ఇందులో ఉన్నాయి. బ్రేక్ అసిస్టెంట్ సిస్టమ్ (BAS), ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS), ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ (FCA) ఫీచర్ తో ప్రమాదాలను నివారించవచ్చని కియా పేర్కొంది. దీని సహాయంతో డ్రైవర్‌ను హెచ్చరించడం, ఆటోమేటిక్ గా బ్రేకులు వేయడం ద్వారా ప్రమాదాన్ని నివారించడం లేదా తీవ్రతను తగ్గించడం చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Car, Kia cars, New cars