హోమ్ /వార్తలు /బిజినెస్ /

Kia Electric Car: కియా నుంచి ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్.. బుకింగ్స్ ప్రారంభమయ్యేది అప్పుడే..

Kia Electric Car: కియా నుంచి ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్.. బుకింగ్స్ ప్రారంభమయ్యేది అప్పుడే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా (Kia) భారతీయ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఇండియాలో తమ కంపెనీ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (Electric Vehicle) లాంచ్ చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేసింది.

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా (Kia) భారతీయ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఇండియాలో తమ కంపెనీ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (Electric Vehicle) లాంచ్ చేస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేసింది. ఈ ఏడాదిలోనే ఈవీ6 (EV6) అనే హై-ఎండ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్‌ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టు ఇది అధికారికంగా ప్రకటించింది. దీనితో ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి కియా కూడా చేరుకోవడం ఖాయమైంది. ఈవీ6 వెహికల్ ప్రపంచవ్యాప్తంగా గతేడాది మార్చిలోనే రిలీజ్ అయింది. భారత్‌లో కియా ఈవీ6 బుకింగ్స్ (Kia EV6 Bookings) మే 26 నుంచి ప్రారంభమవుతాయని దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ పేర్కొంది. ఇండియన్ మార్కెట్ కోసం కేవలం 100 యూనిట్ల ఈవీ6ని మాత్రమే కియా కేటాయిస్తుంది. వీటిలో ప్రతి ఒక్కటి కంప్లీట్లీ బిల్ట్-ఇన్ యూనిట్‌గా ఇక్కడకు చేరుకుంటుంది. వీటికి దిగుమతి సుంకం చెల్లించాలి కాబట్టి ఈవీ6 భారీ ప్రైస్ ట్యాగ్‌తో ఇండియాకి రావచ్చని తెలుస్తోంది.

ఈవీ6 అనేది ఒక ఆల్-ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్. ఇది ఈవీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ (E-GM) ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. ఈవీ6 అనేది కియా నుంచి లాంచ్ అయిన ఫస్ట్ బీఈవీ (Battery Electric Vehicle Or Pure Electric Vehicle) కావడం విశేషం. ఇందులోని అద్భుతమైన డిజైన్, క్వాలిటీ, ఫీచర్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును పరిమిత యూనిట్లలో మాత్రమే కియా ఇండియాకి తీసుకువస్తుంది. ఈవీ6 58 kWh బ్యాటరీ ప్యాక్, 77.4 kWh బ్యాటరీ ప్యాక్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఇండియాలో 222 bhp, 350 Nm అభివృద్ధి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈవీ6 రావచ్చని సమాచారం. ఈ కారు సింగిల్ ఛార్జీకి 499 కిమీల డ్రైవింగ్ రేంజ్ ని అందజేస్తుంది.

Nitin Gadkari: ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు.. అది నిజమైతే చర్యలు తప్పవంటూ..


"మోస్ట్ హైటెక్ కారుగా ఈవీ6ని కియా అందుబాటులోకి తెచ్చింది. ఇది రియల్ గేమ్-ఛేంజర్. ఎలక్ట్రిక్ మొబిలిటీని ఫన్, కన్వీనియంట్ & యాక్సెసబుల్ గా ఉండేలా దీనిని గ్రౌండ్ నుంచి చక్కగా డిజైన్ చేశాం" అని కియా కంపెనీ చెప్పుకొచ్చింది. ఇది బెస్ట్ రియల్-వరల్డ్ డ్రైవింగ్ రేంజ్, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ కెపాబిలిటీస్, వైడ్ హై-టెక్ ఇంటీరియర్‌తో వస్తుందని కియా వెల్లడించింది. ఈవీ6లో లెడ్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన అందమైన ఫ్రంట్ గ్రిల్‌, క్లీన్ డిజైన్‌తో ఫ్రంట్ బంపర్, ఏటవాలుగా ఉన్న రూఫ్‌లైన్, ర్యాక్డ్ విండ్‌స్క్రీన్‌, రూఫ్ స్పాయిలర్, డక్-టెయిల్ స్పాయిలర్, గ్లోసీ బ్లాక్ సైడ్ క్లాడింగ్, లార్జ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే, ఎల్ఈడీ లైటింగ్, ఆన్‌బోర్డ్ పవర్ జనరేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాహనంతో కేవలం ఈవీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారిని మాత్రమే కాకుండా ప్రీమియం కార్ కొనాలనుకునేవారిని కూడా ఆకట్టుకోవాలని కియా భావిస్తోంది. ఇటీవల, ఈ కారు ప్రతిష్టాత్మక యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022ని కూడా గెలుచుకోవడం విశేషం. దీని ధర ఎంత ఉంటుందనేది ఈ ఏడాది ద్వితీయార్ధం నాటికి తెలిసే అవకాశం ఉంది.

First published:

Tags: Electric cars, Kia cars

ఉత్తమ కథలు