KIA CARES S VS MARUTI SUZUKI XL6 VS MARUTI SUZUKI ERTIGA WHICH OF THESE THREE CARS IS THE BEST GH VB
Best Car: కియా కారెన్స్ vs మారుతి సుజుకి XL6 vs మారుతి సుజుకి ఎర్టిగా.. ఈ మూడు కార్లలో ఏది బెస్ట్..?
ప్రతీకాత్మక చిత్రం
మారుతి సంస్థకు చెందిన ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 MPVలలో కొత్త ఫీచర్లను యాడ్ చేసి ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు కొత్త ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఇతర అప్‌గ్రేడ్‌లు కల్పించారు.
కియా కారెన్స్, మారుతి సుజుకి(Maruti Suzuki) ఎక్స్‌ఎల్6, ఎర్టిగా కార్లు మార్కెట్లో పోటీ పడుతున్నాయి. మారుతి(Maruti) సంస్థకు చెందిన ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 MPVలలో కొత్త ఫీచర్లను యాడ్ చేసి ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు కొత్త ఇంజిన్(New Engine), ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్(Automatic Transmission), ఇతర అప్‌గ్రేడ్‌లు(Upgrades) కల్పించారు. కొత్త ఫీచర్‌లతో కియా కరెన్స్(Kia Careens) వంటి కార్లతో పోటీపడే సామర్థ్యాన్ని సంపాదించాయి. ఈ మోడల్‌లలో ఏది బెస్ట్ కార్‌గా నిలుస్తుందో తెలుసుకోండి.
* మారుతి సుజుకి XL6(Maruti Suzuki XL6)
C-సెగ్మెంట్ కారు లేదా చిన్న SUV ధరతో ఈ 6 సీట్ల MPV వస్తుంది. అత్యుత్తమ ఫ్యూయల్ ఎకానమీతో సామర్థ్యం గల BS6 గ్యాసోలిన్ ఉంది. ఆటోమేటిక్ కన్వీనియన్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. సేఫ్టీ కిట్ 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ఇంటిగ్రేటెడ్ TPMSతో అధునాత ఫీచర్‌లను అందిస్తుంది. డ్యూయల్‌జెట్ ఇంజిన్, 6-స్పీడ్ AT, ప్యాడిల్ షిఫ్టర్‌లు, వెంటిలేటెడ్ కంట్రోల్స్, కిటికీల కోసం UV కట్ గ్లాస్ వంటి కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. మారుతి సుజుకి ఆఫ్టెర్ సేల్ సర్వీసులు కూడా ఉత్తమంగా ఉంటాయి.
ప్రతికూలతలు
మారుతీ సుజుకి ఎక్స్‌ఎల్6 పెట్రోలు వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. డీజిల్ వెర్షన్ అందుబాటులో లేదు. తీరికగా ప్రయాణించడానికి మాత్రమే అనువైనది, ఫ్యూయల్ ఎకానమీ కోసం తయారు చేశారు. బిల్డ్, నాణ్యతతో పోల్చితే కారు ధర చాలా ఎక్కువ. క్యాబిన్ అప్‌డేట్‌ల విషయానికొస్తే, ప్రీమియం ఫ్యాక్టర్ మునుపటి మోడల్ కంటే పెద్దగా పెరగలేదు. కెప్టెన్ సీట్లతో మధ్య వరుసలో ఇద్దరు మాత్రమే కూర్చోనే అవకాశం ఉంది.
* కియా కారెన్స్(Kia Carens)
నాణ్యమైన నిర్మాణం, ప్రాక్టికల్, కుటుంబానికి చక్కగా సరిపోయే మూడు వరుసల కారు. మూడవ వరుస సీటును పెద్దలు కూడా ఉపయోగించవచ్చు. 1.5L డీజిల్ ఇంజిన్ MT, AT వెర్షన్లలో వస్తుంది. 7 స్పీడ్ DCTతో 1.4L టర్బో పెట్రోల్ ఆప్షన్ ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, TPMS, ఇతర భద్రతా ఫీచర్లు కారెన్స్‌లో వస్తాయి.
ప్రతికూలతలు
మొదటి వరుస సీటు స్పేస్ రెస్ట్రిక్ట్ చేసినా.. రెండవ వరుస లెగ్‌రూమ్ యావరేజ్‌గా ఉంటుంది. పెద్ద వాహనంలో 7-స్పీడ్ DCT సమస్య కావచ్చు. భద్రతా రేటింగ్‌పై స్పష్టత లేదు, సెల్టోస్ కేవలం 3 స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్‌ను ఇచ్చింది. ఫుల్ వర్చువల్ డయల్స్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి కొన్ని ఫీచర్‌లు లేవు. ఎక్కువ స్థలంతో క్యాబిన్‌లను అందించే కార్‌లు పోటీగా ఉన్నాయి.
* మారుతీ సుజుకీ ఎర్టిగా(Maruti Suzuki Ertiga)
C-సెగ్మెంట్ సెడాన్ ధరతో ఏడు సీట్ల MPV లభిస్తుంది. రూ.10 లక్షల లోపు పెట్రోల్ వేరియంట్ లభించడం మేలు. క్యాబిన్ ఇప్పుడు ఉపయోగకరమైన మూడవ వరుస, పెద్ద బూట్ కూడా ఉంది. ఇప్పుడు డీజిల్, పెట్రోల్, ఆటోమేటిక్ ఆప్షన్‌లలో లభిస్తుంది. స్టాండర్డ్ ఫీచర్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS+ EBD, ఐసోఫిక్స్ యాంకర్లు, పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఆటోమేటిక్ వెర్షన్‌లో ESP కూడా ఉంది. మారుతి సుజుకి ఆఫ్టర్ సేల్ సర్వీస్ అదనపు ఆకర్షణ.
ప్రతికూలతలు
బిల్డ్, నాణ్యత ధరను పరిగణనలోకి తీసుకుంటే యావరేజ్‌గా ఉన్నాయి. ఇకపై ఎలాంటి డీజిల్ వెర్షన్ అందుబాటులో లేదు. భారీ వినియోగదారులు దాని కనీస నిర్వహణ ఖర్చులను కోల్పోతారు. ఈ ధర వద్ద ఆటో-డిమ్మింగ్ IRVMతో పాటు ఆటో హెడ్‌ల్యాంప్‌లు, వైపర్‌ల వంటి ఫీచర్‌లను ఎవరైనా ఆశించవచ్చు, కానీ అన్నీ లేవు. 4-స్పీడ్ ఆటోమేటిక్ ఫ్యాషన్‌లో లేదు. టాప్ వేరియంట్‌లో కూడా అందుబాటులో లేదు. నిర్దిష్ట వేరియంట్‌ల కోసం 5 నుంచి 9 నెలల వరకు వేచి ఉండాల్సి వస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.