Home /News /business /

KIA CARENS GOT 7738 BOOKING ON THE FIRST DAY MK

Kia Carens కారుకు మార్కెట్లో అదిరిపోయిన రెస్పాన్స్...మొదటి రోజే రికార్డు బుకింగ్స్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Kia Carens జనవరి 14న దాని ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. మొదటి రోజునే 7 వేల కంటే ఎక్కువ యూనిట్ బుకింగ్‌లను అందుకుంది. కియా కారులో 6-7 సీటింగ్ ఆప్షన్ ఉంది. ఇది ప్రీమియం క్లాస్ MPV కారు. ఈ కారును కేవలం 25 వేల రూపాయల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
    Kia Carens జనవరి 14న దాని ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. మొదటి రోజునే 7 వేల కంటే ఎక్కువ యూనిట్ బుకింగ్‌లను అందుకుంది. కియా కారులో 6-7 సీటింగ్ ఆప్షన్ ఉంది. ఇది ప్రీమియం క్లాస్ MPV కారు. ఈ కారును కేవలం 25 వేల రూపాయల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కియా తన గ్లోబల్ లాంచ్ సందర్భంగా భారతదేశం కోసం ప్రత్యేకంగా ఈ కారును రూపొందించి విడుదల చేసింది. భారత్  కియా నుంచి వచ్చిన నాలుగో కారు ఇదే కావడం విశేషం. గతంలో కంపెనీకి చెందిన కియా సెల్టోస్, కియా కార్నివాల్ , కియా సోనెట్ కార్లు మార్కెట్లో సందడి చేశాయి.  Kia Carens అనేక అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు కంపెనీ దీని ధరను వెల్లడించలేదు. భారతదేశంలో ఈ కారు మారుతి సుజుకి XL వంటి కార్లతో పోటీపడుతుందని నిపుణుల. కారు ప్రీమియం ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ , లగ్జరీ ప్లస్‌లతో కూడిన ట్రిమ్ రేంజులో కూడా ఈ కారు రానుంది. బలమైన హై సేఫ్టీ ప్యాకేజీ స్టాండర్డ్ మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

    Kia Carens ఫీచర్స్...

    ఈ కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, ఇది టచ్‌స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. కియా కనెక్ట్ ఇందులో అందుబాటులో ఉంది. ఇందులో రైడర్ల కోసం స్వచ్ఛమైన ఎయిర్ ప్యూరిఫైయర్‌ అందుబాటులో ఉంది.  ఇందులో బ్యాక్టీరియా రక్షణ పొందవచ్చు. వన్ టచ్ ఈజీ ఎలక్ట్రిక్ టంబుల్ , స్కై లైట్ సన్‌రూఫ్ ఈ కారులో అందుబాటులో ఉంది.

    Kia Carens ఇతర ఫీచర్స్ ఇవే...

    Kia Carense స్మార్ట్ స్ట్రీమ్ 1.5 పెట్రోల్, స్మార్ట్ స్ట్రీమ్ 1.4T GDI పెట్రోల్ వేరియంట్ , 1.5CRDi VGT డీజిల్ అనే మూడు పవర్ రైలు ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. అలాగే, ఇది మూడు ట్రాన్స్‌మిషన్ ఎంపికలను కలిగి ఉంది, అవి 6MT, 7DCT , 6AT. ఈ వాహనం 7 సీట్ల ఎంపికలో కూడా అందుబాటులో ఉంటుంది. 6 సీట్ల ఆప్షన్ కూడా ఉంటుంది.

    కియా కేరెన్స్ ఈ కార్లతో పోటీపడనుంది

    హ్యుందాయ్, హ్యుందాయ్ అల్కాజార్, మారుతి ఎక్స్‌ఎల్6, టయోటా క్రిస్టా వంటి బ్రాండ్‌లతో కియా కేరెన్స్ పోటీపడనుంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: KIA Motors

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు