హోమ్ /వార్తలు /బిజినెస్ /

Kia Carens CNG: కియా నుంచి త్వరలో సీఎన్‌జీ కారు లాంచ్.. దీని గురించి ఈ విషయాలను తెలుసుకోండి..

Kia Carens CNG: కియా నుంచి త్వరలో సీఎన్‌జీ కారు లాంచ్.. దీని గురించి ఈ విషయాలను తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కియా కంపెనీ ఇటీవల విడుదల చేసిన కారెన్స్ MPV (Carens MPV) మోడల్‌కు మంచి ఆదరణ లబించింది. ఇదే ఉత్సాహంతో ఈ సంస్థ ఇప్పుడు CNG విభాగంలోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కియా తర్వలోనే కారెన్స్ సీఎన్‌జీ (Carens CNG) కారును ఇండియాలో లాంచ్‌ చేయనుంది.

ఇంకా చదవండి ...

సౌత్ కొరియన్(South Korea) ఆటో మొబైల్ దిగ్గజం కియా మోటార్స్(Kia Motors).. ఇండియన్ మార్కెట్‌లో(Indian Market) కొత్త మోడల్స్(New Models) రిలీజ్ చేస్తూ దూసుకుపోతోంది. కియా కంపెనీ(Kia Company) ఇటీవల విడుదల చేసిన కారెన్స్ MPV (Carens MPV) మోడల్‌కు మంచి ఆదరణ లబించింది. ఇదే ఉత్సాహంతో ఈ సంస్థ ఇప్పుడు CNG విభాగంలోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కియా తర్వలోనే కారెన్స్ సీఎన్‌జీ (Carens CNG) కారును ఇండియాలో లాంచ్‌ చేయనుంది. దీని లాంచింగ్‌తో కంపెనీ CNG విభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే ఈ వివరాలను కంపెనీ ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు.

అయితే కారెన్స్ CNG మాడ్యూల్‌ను కంపెనీ ఇటీవల టెస్ట్ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. కారు బూట్‌లో అమర్చిన తెల్లటి CNG సిలిండర్‌ను ఈ ఫోటోలు హైలెట్ చేశాయి. బ్యాక్ ఫెండర్స్‌పై ఫ్యూయెల్ క్యాప్ పక్కన ఉంచిన ఇన్‌లెట్ నాజిల్‌ను కూడా మనం చూడవచ్చు. కారెన్స్ CNG ఇతర స్టైలింగ్ ఫీచర్లు.. MPV రెగ్యులర్ వెర్షన్‌తో సమానంగా ఉండవచ్చు.

కారు క్వార్టర్ గ్లాస్‌పై ఉన్న లేబుల్ ప్రకారం.. స్టాండర్డ్ కారెన్స్‌తో అందించిన 1.4-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్‌తో కొత్త మోడల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. స్టాండర్డ్ సెట్టింగ్‌లో ఈ ఇంజిన్ 138 bhp పవర్‌ను, 242 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అయితే CNG కిట్‌తో దీని పనితీరు తగ్గవచ్చు. స్టాండర్డ్ ఎడిషన్‌లో కారు ఇంజిన్ 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. CNG వేరియంట్‌లో దీన్ని 6-స్పీడ్ మాన్యువల్ గేర్ షిఫ్టర్‌తో మాత్రమే అందించే అవకాశం ఉంది. రెగ్యులర్ కారెన్స్ 1.5-లీటర్ డీజిల్, 1.5 లీటర్స్ నేచురల్లీ యాస్పైర్డ్ పెట్రోల్ యూనిట్‌లలో అందుబాటులో ఉంది.

Gadgets: సమ్మర్‌లో స్మార్ట్ గాడ్జెట్స్ హీట్ అవుతున్నాయా..? మీ డివైజ్‌లను సేఫ్‌గా, కూల్‌గా ఉంచే టిప్స్ పాటించండి..


* ధర ఎంత?

ధర పరంగా చూస్తే.. కారెన్స్ CNG వేరియంట్ కారు స్టాండర్డ్ కారెన్స్ MPV వేరియంట్ ధర కంటే దాదాపు రూ. 75,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఎక్కువగా ఉండవచ్చు. ఇది లాంచ్ అయిన తర్వాత.. CNG MPV విభాగంలో మారుతి సుజుకి ఎర్టిగాతో కారెన్స్ CNG పోటీపడనుంది. మారుతి రాబోయే వారాల్లో XL6 CNGని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. అంతకుముందు CNG బ్యాడ్జింగ్‌తో టెస్ట్ మ్యూల్ సోనెట్ ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ సబ్ కాంపాక్ట్ ప్రోటోటైప్ CNG వేరియంట్‌ను.. 1.0-లీటర్ GDi టర్బో పెట్రోల్ మోటార్‌తో రూపొందించారు. ఇది యూజువల్ సెట్టింగ్‌లో 118 bhp పవర్‌ను, 172 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

First published:

Tags: Kia cars, KIA Motors, Kia sales

ఉత్తమ కథలు