• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • KHATABOOK HAS SEEN A WHOPPING 200 PC GROWTH IN 2020 21 MK GH

Khatabook: అద్భుతాలు సృష్టించిన ఖాతాబుక్ యాప్...వృద్ధి రేటు తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.

Khatabook: అద్భుతాలు సృష్టించిన ఖాతాబుక్ యాప్...వృద్ధి రేటు తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.

ప్రతీకాత్మకచిత్రం

రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఖాతాబుక్ స్టార్టప్ ఇప్పుడు దేశంలోని 95 శాతం జిల్లాలకు సేవలను విస్తరించింది. సూక్ష్మ, చిన్నతరహా వ్యాపారాలపై దృష్టి పెట్టిన ఈ సంస్థ.. కొద్ది కాలంలోనే వ్యాపారంలో 200 శాతం వృద్ధి సాధించడం విశేషం.

  • Share this:
ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గిన తరువాత ప్రతి పనినీ సులభంగా చేయగలిగే టెక్నాలజీకి ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్లు ఎంటర్‌ప్రెన్యూర్లు కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నారు. కిరాణా దుకాణాల యజమానులు నిర్వహించే ఖాతా పుస్తకాలను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకువచ్చి విజయం సాధించారు కొందరు యువ వ్యవస్థాపకులు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానులు నిర్వహించే లావాదేవీలను అకౌంట్ బుక్స్‌లో రాసుకోవడం కష్టమయ్యేది. ఇప్పుడు ఈ పనిని ఖాతాబుక్ యాప్‌ సులభతరం చేసింది. ఫలితంగా ఇప్పుడు కిరాణా షాపులు, చిన్న వ్యాపార సంస్థలు కూడా స్మార్ట్ టెక్నాలజీకి మారాయి. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఖాతాబుక్ స్టార్టప్ ఇప్పుడు దేశంలోని 95 శాతం జిల్లాలకు సేవలను విస్తరించింది. సూక్ష్మ, చిన్నతరహా వ్యాపారాలపై దృష్టి పెట్టిన ఈ సంస్థ.. కొద్ది కాలంలోనే వ్యాపారంలో 200 శాతం వృద్ధి సాధించడం విశేషం.

పాతకాలంలో నోటుపుస్తకాల్లో రాసే లెక్కలను డిజిటలైజ్ చేయడమే ఖాతాబుక్ లక్ష్యం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానులు తమ కస్టమర్ల అప్పులు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఖాతాబుక్ ద్వారా నిర్వహించవచ్చు. కొద్దికాలంలోనే ఇది ఎంతోమంది చిన్న వ్యాపారులను ఆకట్టుకుంది. వివిధ రకాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా లభిస్తుండటంతో సంస్థకు యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో వివిధ రకాల సేవలు అందిస్తున్న ఖాతాబుక్.. ఎక్కువ మంది వినియోగదారులకు చేరువైంది. 2020-21లో తమ సంస్థ 200 శాతం వృద్ధిని నమోదు చేసిందని సంస్థ సహ వ్యవస్థాపకుడు రవీశ్ నరేష్ ప్రకటించడం విశేషం.ఇంటర్నెట్ సదుపాయంతో వృద్ధి
2016లో పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజలు డిజిటల్ విధానానికి మారక తప్పలేదు. UPI పేమెంట్లతో వ్యాపారాలు నిర్వహించే విధానాలకు కూడా ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఖాతాబుక్‌ సంస్థ తక్కువ కాలంలోనే ప్రజలకు చేరువైంది. 2011లో IIT బాంబేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రవీశ్‌ నరేష్, మరికొంతమందితో కలిసి ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. టెలికాం విభాగంలోకి రిలయన్స్ జియో ప్రవేశించిన తరువాత కూరగాయలు అమ్మేవారు సైతం 4జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించే అవకాశం దక్కింది. ప్రజల్లో పాతుకుపోయిన డిజిటలైజేషన్ ఆలోచన కారణంగానే తమ వ్యాపారం విజయవంతమైందని చెబుతున్నారు రవీశ్‌.

ఖాతాబుక్ ఎలాంటి సేవలు అందిస్తుంది?
ఖాతాబుక్ అనేది కిరాణా స్టోర్ల అకౌంట్ లెడ్జర్‌కు డిజిటల్ రూపం. అమ్మకందారులు చేసే ప్రతి సేల్‌కు సంబంధించిన వివరాలను యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇన్వాయిస్ వెంటనే కస్టమర్‌కు వెళ్తుంది. దీంతో లావాదేవీలకు సంబంధించిన వివరాల్లో తప్పులు నమోదయ్యే అవకాశం ఉండదు. తెలిసిన వ్యక్తులకు అప్పులు ఇస్తూ వ్యాపారం చేసుకునేవారు ఈ యాప్‌లో క్రెడిట్ వివరాలను రిమైండర్ల రూపంలో సెట్ చేయవచ్చు. కస్టమర్లకు వారానికి లేదా 15 రోజులకు లేదా నెలకు చెల్లింపులకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. UPI ద్వారా నిర్ణీత సమయంలో పేమెంట్ చేసే ఆప్షన్‌ కూడా ఉంటుంది.

స్థానిక భాషల్లో సేవలు
ఖాతాబుక్ మొత్తం 13 దేశీయ భాషల్లో సేవలందిస్తోంది. సంస్థకు ప్రస్తుతం సుమారు 80 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ కంపెనీ విలువ తాజాగా 300 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. స్థానిక భాషల్లో సేవలు లభ్యమవటం కూడా ఖాతాబుక్ విజయానికి కారణమని వ్యవస్థాపకులు చెబుతున్నారు. ప్రస్తుతం 50 శాతానికి పైగా కస్టమర్లు యాప్‌ను ఇంగ్లీష్‌లో వాడుతున్నారు. 20 శాతం మంది హిందీలో ఉపయోగిస్తున్నారు. మరాఠీ, గుజరాతీ, కన్నడ వంటి భాషలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

దేశమంతటా సేవలు
ప్రస్తుతం భారత్‌లోని 95 శాతం జిల్లాల్లో ఖాతాబుక్‌ వినియోగదారులు ఉన్నారు. జైపూర్, లక్నోలో ఈ సంస్థకు ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు. చిన్న వ్యాపారాలు పేరోల్, జీతాలకు సంబంధించిన వివరాలను నమోదు చేసే ‘పగార్ ఖాతా’ యాప్‌ను కూడా సంస్థ తాజాగా ప్రారంభించింది. చిన్న వ్యాపారాలకు చెందిన అన్ని వివరాలను డిజిటైజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు రవీశ్ తెలిపారు. దేశంలో దాదాపు 60 మిలియన్ల చిన్న వ్యాపార సంస్థలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. సమర్థవంతంగా పనిచేస్తూ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు.
First published:

అగ్ర కథనాలు