How to write your Will: వీలునామా రాస్తున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

విలునామా రేసేవారిని ‘టెస్టేట‌ర్’ అంటారు. వ్యక్తుల వారసుల మధ్య వివాదాలను నివారించాలంటే టెస్టేట‌ర్‌ విలునామాను పక్కాగా రాయాలి. త‌న ఆస్తిలో దేన్నీ వ‌దిలేయ‌కుండా డాక్యుమెంట్‌లో ప్ర‌స్తావించ‌డం మంచిది. విలునామా రాసేముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ గురించి తెలుసుకుందాం.

  • Share this:
క‌రోనా కాలంలో ప‌రిస్థితుల‌ను ఎవరూ ఊహించ‌లేక‌పోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో మ‌ర‌ణ వీలునామాపై చాలా మంది దృష్టి పెడుతున్నారు. త‌మపై ఆధార‌ప‌డిన వారికి మంచి జీవితాన్ని ఇవ్వాల‌నే ఉద్దేశంతో సంపాదించుకున్న స్వార్జితాన్ని చట్టబద్దంగా పంచివ్వ‌డానికి ఇది ఎంతో అవ‌స‌రం కూడా. ఆస్తులు, సంపదపై హక్కులను ఇతరులకు బదిలీ చేయాలనే లక్ష్యంతో మ‌ర‌ణానికి ముందు వ్యక్తులు రాసే లీగల్ డాక్యుమెంట్‌ను వీలునామా (Will) అంటారు. వీలునామా రేసేవారిని ‘టెస్టేట‌ర్’ అంటారు. వ్యక్తుల వారసుల మధ్య వివాదాలను నివారించాలంటే టెస్టేట‌ర్‌ విలునామాను పక్కాగా రాయాలి. త‌న ఆస్తిలో దేన్నీ వ‌దిలేయ‌కుండా డాక్యుమెంట్‌లో ప్ర‌స్తావించ‌డం మంచిది. విలునామా రాసేముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ గురించి తెలుసుకుందాం.

భాష‌
వీలునామా రాసే భాష టెస్టేట‌ర్‌కి తెలిసిన‌, అర్థం చేసుకోగ‌లిగిన భాష అయి ఉండాలి. ఒక‌వేళ‌ వేరే భాష‌లో రాస్తే.. ఆ వీలునామాను పూర్తిగా చ‌దివి వినిపించ‌డానికి, దాన్ని అర్థం చేసుకోవ‌డానికి టెస్టేట‌ర్ త‌న‌కు బాగా న‌మ్మ‌క‌స్తులైన‌ వ్య‌క్తి స‌హాయం తీసుకున్నార‌ని వీలునామాలో ప్ర‌స్తావించాలి. అలాగే టేస్టేట‌ర్‌కు స‌హాయం చేసిన వ్య‌క్తి సాక్షిగా కానీ, లేక‌పోతే కార్య‌నిర్వాహ‌కులుగా గానీ, లేదంటే విలునామాలోని ల‌బ్ధిదారునిగా కూడా ఉండ‌వ‌చ్చు.

పాత వీలునామాలు
తాజాగా రాస్తున్న వీలునామాలో టేస్టేట‌ర్ ఇదే తన చివ‌రి విలునామా అనే విష‌యాన్ని ప్ర‌స్తావించాలి. ఇది ఇంత‌కుముందు రాసిన విలునామాలన్నింటి కంటే, వాటిల్లో చేసిన మార్పుల కంటే (కోడిసిల్స్) ముందు ఉంటుందని ప్ర‌స్తావించాలి. తాజాగా రాసినదాంట్లో.. గ‌త విలునామాలు, కోడిసిల్స్ గురించి తప్పనిసరిగా ప్రస్తావించాలి. లేదంటే.. అనుమానాస్ప‌ద ప‌రిస్థితుల్లో ఈ విలునామా త‌యారు చేశారని ఎవ‌రూ నిరూపించ‌క‌పోతేనే అది చెల్లుబాటు అవుతుంది. ఈ చివ‌రి విలునామా పాత‌వాటన్నింటినీ త‌న స్వాధీనంలోకి తీసుకోగ‌ల‌దు.

ఎవ‌రినైనా తొల‌గించాల‌నుకున్న‌ప్ప‌డు?
ఒక‌వేళ టెస్టేట‌ర్ త‌న కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రికైనా త‌న ఆస్తిని కానీ, అందులో భాగం కానీ ఇవ్వ‌కూడ‌ద‌ని అనుకుంటే.. ఎవ‌రికి వాటా ఇవ్వ‌కూడ‌దు అనుకుంటున్నారనే వివరాలను త‌ప్ప‌నిస‌రిగా విలునామాలో రాయాలి. అయితే ఎందుకు ఇవ్వ‌ట్లేదనే కార‌ణాన్ని త‌ప్ప‌నిస‌రిగా చెప్పాల్సిన అవసరం లేదు.

ముఖ్య‌మైన అంశాలు
వీలునామాలో సంత‌కం చేసే సమ‌యానికి టెస్టేట‌ర్‌కు ఉన్న అప్పులు, చెల్లింపుల‌ను అందులో ప్ర‌స్తావించాలి. అలాగే భ‌విష్య‌త్తులో నిర్థారించ‌ద‌గిన అప్పులు, చెల్లింపులు, వాటిని ఎలా తీర్చాలో కూడా పేర్కొనాలి. విలునామాపై సాక్షులుగా సంతకం చేసే ఇద్ద‌రు వ్య‌క్తులు ల‌బ్ధిదారులు కాకూడ‌దు. వీలునామాలో సాక్ష్యులకు చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. టెస్టేట‌ర్ మంచి జ్ఞానాన్ని క‌లిగి ఉన్నార‌ని, ఎలాంటి బెదిరింపుల‌కు, బ‌ల‌వంతానికి లోను కాలేద‌ని, మ‌త్తులో లేర‌ని సాక్ష్యులే ధ్రువీక‌రిస్తారు.

ప్ర‌తి విలునామాలో కార్య‌నిర్వాహ‌కుల పేరును ప్ర‌స్తావించాలి. లేక‌పోతే ల‌బ్ధిదారునికి ప‌రిపాల‌నా ప‌ర‌మైన ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి. అప్పుడు విలునామాను అమ‌లు చేయ‌డానికి వాళ్లు లెట‌ర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్ కోసం కోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌స్తుంది. విలునామాను రిజిస్ట్రేషన్ చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి కాక‌పోయిన‌ప్ప‌టికీ, అది వ్యాజ్యం, ఇతర చట్టపరమైన ఇబ్బందులను దూరం చేస్తుంది. టెస్టేట‌ర్ చ‌నిపోయిన త‌ర్వాత కూడా విలునామాను కార్య‌నిర్వాహ‌కుడు లేదా ల‌బ్ధిదారులు రిజిస్ట‌ర్ చేయవచ్చు. దీంతోపాటు విలునామాలో ప్ర‌స్తావించ‌కూడ‌ని అంశాల కోసం న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Published by:Krishna Adithya
First published: