Gold Bars: బంగారం పెద్ద మొత్తంలో కొంటున్నారా...అయితే ఇది మీ కోసం...

ప్రతీకాత్మకచిత్రం

Flipkart, Amazon వంటి e-commerce ప్లాట్‌ఫామ్‌లలో కూడా gold bars లభిస్తున్నాయి. ఆభరణాలు, నాణేలతో పోలిస్తే వీటిని కొనడానికి అయ్యే ఖర్చు తక్కువ.

  • Share this:
భారతీయులకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల జాబితాలో భారత్‌ ఉంది. సాధారణంగా goldను ఆభరణాలు(jewellery), నాణేలు(coins), బంగారపు కడ్డీల(goldbars) రూపంలో దాచుకుంటారు. ఇప్పుడిప్పుడే పెట్టుబడి మార్గంగానూ దీన్ని ఎంచుకుంటున్నారు. ఆభరణాల తయారీలో చోటుచేసుకుంటున్న మార్పులు, భారీగా పెరుగుతున్న making charges, design charges వల్ల goldbarsను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. Flipkart, Amazon వంటి e-commerce ప్లాట్‌ఫామ్‌లలో కూడా gold bars లభిస్తున్నాయి. ఆభరణాలు, నాణేలతో పోలిస్తే వీటిని కొనడానికి అయ్యే ఖర్చు తక్కువ. కానీ వీటి గురించి సరిగ్గా ఆరా తీయకుండా, అవగాహన లేకుండా కొనుగోలు చేస్తే మోసపోయే అవకాశం ఉంది. అందువల్ల గోల్డ్‌బార్స్‌ను కొనాలనుకునేవారు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అవేంటంటే...

1. Fineness
బంగారాన్ని కొనేవారు gold metal contentను అంచనా వేసే ఫిట్‌నెస్‌ గురించి తెలుసుకోవాలి. సాధారణంగా బంగారాన్ని కొనేవారు దాని స్వచ్ఛతను క్యారట్స్‌(Karats)లో కొలుస్తారు. కానీ ఫిట్‌నెస్‌ పరంగా బంగారం నాణ్యత, స్వచ్ఛతను parts per thousand విధానంలో కొలుస్తారు. Goldbar ఫిట్‌నెస్ లెవల్ వెయ్యికి 999.9గా నమోదైతే.. బంగారం మొత్తం ఫిట్‌నెస్‌ను 999.9గా గుర్తిస్తారు.

2. Certification
gold barను కొనేవారు బంగారానికి ఉండే హాల్‌మార్క్ సర్టిఫికేషన్ (Hallmarked Certification)ను సరిచూసుకోవాలి. కస్టమర్లు BIS (Bureau of Indian Standards) hallmark ఉండే గోల్డ్ బార్‌ను ఎంచుకోవడం మంచిది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఆభరణాలను తయారు చేస్తేనే.. వాటికి BIS hallmark గుర్తింపు ఉంటుంది.

3. బంగారం స్వచ్ఛత (Purity of Gold)
బంగారం స్వచ్ఛతను క్యారట్ (karat) పరంగా కొలుస్తారు. karat విలువ ఎక్కువగా ఉంటే బంగారం స్వచ్ఛత కూడా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో బంగారం స్వచ్ఛతను 24 క్యారట్లు, 22 క్యారట్లు, 18 క్యారట్లు, 14 క్యారట్లుగా కొలుస్తారు. 24 క్యారట్ల బంగారం అత్యంత స్వచ్చమైనది. దీంట్లో ఎలాంటి మలినాలు లేకుండా, 100శాతం pure gold ఉంటుంది. అందువల్ల పెట్టుబడుల కోసం దీన్నే ఎంచుకోవాలి. ఆభరణాల కోసం 22 క్యారెట్ల బంగారాన్ని ఎంచుకోవచ్చు.

4. Packaging
ఆన్‌లైన్‌లో gold barను కొనే కస్టమర్లకు ప్యాకేజీ రూపంలో డెలివరీ చేస్తారు. అందువల్ల బంగారాన్ని ప్యాకేజీతో సహా భద్రపరచాలి. ప్యాకింగ్‌లో చెక్కుచెదరకుండా ఉంచడం వల్ల గోల్డ్ బార్ స్వచ్ఛత పరంగా మెరుగ్గా ఉంటుంది.

5. Refinery
ప్రముఖ రిఫైనరీల నుంచి కొనుగోలు చేసే గోల్డ్ బార్స్‌ స్వచ్చత పరంగా మెరుగ్గా ఉంటాయి. అందువల్ల గోల్డ్ బార్స్‌ను కొనుగోలుచేసే సమయంలో, దాన్ని ఎక్కడ శుద్ధి చేశారనే వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. భారతదేశంలో ప్రస్తుతం రెండు బంగారు శుద్ధి కర్మాగారాలు (gold refineries) ఉన్నాయి. అవి MMTC- PAMP (MMTC, స్విట్జర్లాండ్‌కు చెందిన PAMP SA సంస్థల జాయింట్ వెంచర్), బెంగళూరు రిఫైనరీ.
First published: