HOME »NEWS »BUSINESS »kerala lok sabha election 2019 wont raise income tax rahul gandhi defends nyay with a jab on pm modi

‘న్యాయ్’ కోసం పన్నులు పెంచం...నిధులు అలా వస్తాయన్న రాహుల్ గాంధీ

‘న్యాయ్’ కోసం పన్నులు పెంచం...నిధులు అలా వస్తాయన్న రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ (ఫైల్)

Kerala Lok Sabha Election 2019: కనీస ఆదాయ పథకం కోసం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పన్నులు పెంచబోదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. మధ్యతరగతి ప్రజల జోబులో నుంచి ఒక్క పైసా కూడా తీసుకోబోమని చెప్పారు.

  • Share this:
    కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వస్తే పన్నులు పెంచబోమని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు రూ.72 వేల ఆర్థిక సాయాన్ని అందించే కనీస ఆదాయ హామీ పథకం (న్యాయ్) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం తెలిసిందే. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పన్నులు భారీగా పెంచే అవకాశం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని పత్తనంతిట్టలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ...దీనిపై వివరణ ఇచ్చారు.

    కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రాహుల్ స్పష్టంచేశారు. కనీస ఆదాయ హామీ పథకం అమలు కోసం పన్నులు పెంచబోమని అన్నారు. దేశ ప్రగతికి మధ్యతరగతి ప్రజలే ప్రధాన కారకులుగా ఆయన కొనియాడారు. న్యాయ్ పథకం కోసం మధ్యతరగతి ప్రజల జోబు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోబోమని రాహుల్ స్పష్టంచేశారు. నీరవ్ మోదీ, లలిత మోదీ, విజయ్ మాల్యాలకు ప్రధాని నరేంద్ర మోడీ కోట్లాది రూపాయలు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. న్యాయ్ పథకానికి అవసరమైన నిధులను వీరే చెల్లిస్తారని వ్యాఖ్యానించారు.





    లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గంతో పాటు యూపీలోని అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండడం తెలిసిందే.
    Published by:Janardhan V
    First published:April 16, 2019, 18:05 IST