Gold Price | పసిడి ప్రేమికులకు శుభవార్త. ఇక మీరు ఏ షాపులో బంగారం (Gold) కొన్నా ఒకే రేటు ఉంటుంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జువెలర్స్ అందరూ ఒకే గోల్డ్ రేటును (Gold Rate) కలిగి ఉండనున్నాయి. అంటే మలబాడ్ గోల్డ్ అండ్ డైమండ్స్, జోయాలుక్కాస్, కల్యాణ్ జువెలర్స్ వంటి వాటిల్లో బంగారంపై ఒకే రేటు ఉంటుంది.
బ్యాంక్ రేటు ప్రాతిపదికన బంగారం ధరను నిర్ణయిస్తామని ఈ జువెలరీ సంస్థలు పేర్కొంటున్నాయి. కాగా సాధారణంగా బంగారం ధరలు రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లోని గోల్డ్ అసోసియేషన్స్ నిర్ణయించే రేటు ప్రకారం బంగారం ధర ఉంటుంది. అలాగే ఒకే రాష్ట్రంలోని వివిధ జువెలరీ సంస్థలు కూడా బంగారంపై భిన్న మైన రేట్లను కలిగి ఉంటాయి.
ఒక్క షేరుకు ఉచితంగా 6 షేర్లు.. ఈ స్టాక్‌కు భలే డిమాండ్, కొనేందుకు పోటీ!
జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జువెలరీ షాపుల్లోనూ ఒకే విధమైన బంగారం రేటు ఉంటుందని తెలిపారు. ఇటీవల జరిగిన ఆల్ కేరళ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్స్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఒకే విధమైన బంగారం రేట్లు ఉండాలనే నిర్ణయాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం కేరళ అని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు.
భారీ షాక్.. ఏకంగా రూ.5,400 వరకు పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశంలో కేరళలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుందని, దేశవ్యాప్తంగా ఒకే రకమైన బంగారం రేట్ల అమలుకు కేరళ ఆదర్శంగా నిలుస్తోందని మలబార్ గోల్డ్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ తెలిపారు. బ్యాంక్ రేటు ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఒకేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే చాలా వరకు రాష్ట్రాల్లో బంగారం ధరలను గమనిస్తే.. బ్యాంక్ రేటు కన్నా గ్రాముకు రూ. 150 నుంచి రూ. 300 వరకు ఎక్కువగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. బ్యాంక్ రేటు ప్రాతిపదికన బంగారం రేటు నిర్ణయిస్తే.. అప్పుడు కొనుగోలుదారులకు అందుబాటు ధరలోనే బంగారం లభిస్తుందని, పారదర్శకత ఉంటుందని వివరించారు.
కాగా దేశంలో బంగారం ధరపై జీఎస్టీ , తయారీ చార్జీలు, జువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్ వంటివి కలిసి ఉంటాయి. తయారీ చార్జీలు అనేవి మీరు ఎంచుకునే ఆభరణం ప్రాతిపదికన కూడా మారుతుంది. అందుకే బంగారం రేట్లు ఒకేలా ఉండవు. కాగా గ్లోబల్ మార్కెట్లోని బంగారం ధరలు మన దేశంలో పసిడి రేట్లను ప్రభావితం చేస్తాయనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold jewellery, Gold ornmanets, Gold price, Gold rate