కేరళలో(Kerala) తొలిసారిగా 5జీ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. రిలయన్స్ జియో 5G సేవలు నేటి నుండి కొచ్చి కార్పొరేషన్ పరిధి అండ్ గురువాయూర్ టెంపుల్(Temple) ప్రాంగణంలో అందుబాటులోకి వచ్చింది. ఈ జియో 5జీ సేవలను ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) ప్రారంభించారు. మొదటి దశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 5G సేవలు అందుబాటులోకి వస్తుంది. డిసెంబర్ 20 సాయంత్రం 5.30 గంటలకు పనంపిల్లి నగర్ హోటల్(Hotel) అవెన్యూ సెంటర్‌లో ముఖ్యమంత్రి తిరువనంతపురం నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. కొచ్చి మేయర్ ఎం అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రిలయన్స్ జియో అక్టోబర్ నుండి దేశంలో 5G సేవలను అందుబాటులోకి తీసుకురావడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా ముంబై, ఢిల్లీ , కోల్‌కతా నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించింది.
కొచ్చి నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా 5G సేవలు అందుబాటులోకి వచ్చింది. జియో కొచ్చిలో 130కి పైగా టవర్లను అప్‌గ్రేడ్ చేసింది. భారతదేశంలో 5G సేవలు అందుబాటులో ఉన్న 50 నగరాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 5G మొదటిసారిగా 14 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని టైర్ 1 మరియు టైర్ 2 నగరాలకు చేరుకుంది. కేరళ నుంచి కొచ్చి ఈ జాబితాలో చేరింది.5G అనేది 4G కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో డేటాను అందించగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం 5G ఫోన్ ఉన్నవారికి.. ఫోన్‌లోని సెట్టింగ్‌లను మార్చడం ద్వారా మీరు 5Gకి మారవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా.. ఏ SIM కార్డ్‌ని మార్చాల్సిన అవసరం లేదు.
ఈ కార్యక్రమంలో సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. కేరళలో జియో ట్రూ 5G సేవలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కేరళలో 5G నెట్‌వర్క్‌ని అమలు చేయడానికి Jio రూ.6000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఇది మన రాష్ట్రం పట్ల వారికున్న నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. వారు ఈ నెలాఖరు నాటికి త్రివేండ్రంలో 5G సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత జనవరి 2023 నాటికి త్రిసూర్, కోజికోడ్ మరియు మలప్పురం ప్రాంతాల్లో.. డిసెంబర్ 2023 నాటికి కేరళలోని ప్రతీ మండలం, గ్రామం Jio 5G సేవలను కలిగి ఉంటాయన్నారు.
కేరళలో ఈ జియో 5జీ సేవలు ప్రారంభించడం వల్ల.. ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను పొందడమే కాకుండా.. ఈ-గవర్నెన్స్, విద్య , ఆరోగ్య సంరక్షణ, IT అండ్ SME వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతాయని.. అదే సమయంలో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నారు. నెట్ వర్క్ స్వీడ్ గా ఉంటే.. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ఇతర సౌకర్యాలు ప్రతీ పౌరుడికి అందుతాయన్నారు.
కేరళ ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై ప్రత్యేక దృష్టి సారించిందని.. రాష్ట్రంలో 5G సేవలు అందుబాటులోకి రవడం వల్ల IoT, Blockchain, AI, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా అనలిటిక్స్ వంటి నియో టెక్నాలజీలపై పనిచేస్తున్న స్టార్టప్‌లకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. 5G రావడం వల్ల కేరళలో ఈ స్టార్ట్-అప్‌లను మరింత ముందుకు నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జియో ప్రతినిధి మాట్లాడుతూ.. కేరళలోని కొచ్చి అండ్ గురువాయూర్ టెంపుల్‌లో జియో ట్రూ 5జిని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. త్వరలో Jio True 5G నెట్‌వర్క్ కేరళ అంతటా విస్తరిస్తామన్నారు. కేరళలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక 5G నెట్‌వర్క్ జియో మాత్రమేనన్నారు. ఇక ప్రతి భారతీయుడికి True-5Gని అందించడానికి Jio ఇంజనీర్లు 24 గంటలు పని చేస్తున్నారని.. ఈ సాంకేతికతో ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. కేరళను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో తమ సహాయాన్ని అందించినందుకు ముఖ్యమంత్రికి.. కేరళ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. డిసెంబర్ 20 నుండి.. కొచ్చి మరియు గురువాయూర్‌లోని జియో వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా 1 Gbps+ వేగంతో అపరిమిత డేటాను పొందేందుకు Jio వెల్‌కమ్ ఆఫర్‌కు ఆహ్వానించబడతారని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Jio 5G, Kerala, Pinarayi Vijayan