Home /News /business /

KERALA BASED STARTUP COMPANY ERRANDO LAUNCHES WORLDS FIRST WHATSAPP DELIVERY SERVICE TO CUSTOMERS AND PLANNING TO EXPANDING SERVICE TO SOUTH INDIA PRV GH

WhatsApp Delivery: వాట్సాప్ నుంచే ఆర్డర్లు, డెలివరీలు.. ప్రపంచంలో మొట్టమొదటి వాట్సాప్‌ బేస్డ్ డెలివరీ సర్వీస్‌.. ఇండియాలో ప్రారంభం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేరళకు చెందిన మొదటి హైపర్‌ లోకల్‌ డెలివరీ స్టార్టప్‌ Errando ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా Whatsapp బేస్డ్ డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. ఈ సంస్థ సేవల కోసం ఫుడ్‌, స్టేషనరీ, మందులు, కిరాణ సరుకులు లేదా పికప్‌, డ్రాప్‌ సర్వీసుల కోసం Whatsapp ఉపయోగించవచ్చు.

ఇంకా చదవండి ...
మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ (WhatsApp) కొత్త రకం సేవలకు యాక్సెస్ అందిస్తోంది. సేవల విస్తరణలో భాగంగా డెలివరీ సర్వీస్‌ల (Delivery service)ను తమ ప్లాట్‌ఫాం ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా కేరళకు చెందిన మొదటి హైపర్‌ లోకల్‌ డెలివరీ స్టార్టప్‌ Errando ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా WhatsApp బేస్డ్ డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. ఈ సంస్థ సేవల కోసం ఫుడ్‌, స్టేషనరీ, మందులు, కిరాణ సరుకులు లేదా పికప్‌, డ్రాప్‌ సర్వీసుల కోసం WhatsApp ఉపయోగించవచ్చు. కస్టమర్లు 7994834834 నెంబర్‌కు Hello అని మెసేజ్‌ చేసి ఈ సేవలు పొందవచ్చని సంస్థ ప్రకటించింది. ఆ నెంబర్‌ నుంచి వచ్చే ఆటోమేటెడ్‌ మెసేజులు (Automated messages) ఆర్డర్‌ ప్లేస్‌ చేయడంలో కస్టమర్లను గైడ్‌ చేస్తాయి. డెలివరీ లేదా పికప్‌ సేవల కోసం టైప్‌ చేసి అడ్రస్‌ షేర్‌ చేయవచ్చు లేదా Whatsappలో ఉండే లొకేషన్ సెర్చ్‌ ఫంక్షనాలిటీని ఉపయోగించవచ్చు.

చాట్‌ విండోలో ఆర్డర్‌ ఆప్‌డేట్స్‌..

ఆటో జనరేటెడ్‌ పేమెంట్ లింక్ (Auto generated payment link) ద్వారా కస్టమర్లు పేమెంట్స్ చేయవచ్చన్నారు Errando సహ వ్యవస్థాపకుడు షమీర్‌ పఠాయాకంది. తమ ఆర్డర్‌కు సంబంధించిన ఆప్‌డేట్స్‌ కూడా అదే చాట్‌ విండోలో చూడవచ్చని చెప్పారు. WhatsApp ఆధారిత సేవలు పొందడం వల్ల రకరకాల యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే అవసరం ఉండదని షమీర్‌ అంటున్నారు. అంతే కాదు యాప్స్‌ కారణంగా స్టోరేజ్‌ నిండిపోవడం, స్మార్ట్‌ ఫోన్‌ పనితీరు తగ్గడం కూడా జరుగుతుందని గుర్తు చేస్తున్నారు.

ఇంట్లో మర్చిపోయిన వస్తువులు చేరవేయడం..

ప్రస్తుతం ఈ సేవలు ఇంగ్లిష్‌లోనే అందుబాటులో ఉన్నాయి. త్వరలో మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విస్తరించనున్నారు. 2016 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న Errando ప్రస్తుతం కొచ్చి, కొళికోడ్‌, తిరువనంతపురం, బెంగళూరు నగరాల్లో సేవలందిస్తోంది. ప్రస్తుతం తాము ప్రతి నెలా 1.5 లక్షల ఆర్డర్లు పూర్తి చేస్తున్నామని షమీర్‌ తెలిపారు. షాపులు లేదా ఆఫీసుల నుంచి వస్తువులు ఇళ్లకు డెలివరీ చేయడం, ఇంట్లో మర్చిపోయిన వస్తువులు చేరవేయడం, మందుల కొనుగోలు, బిల్‌ పేమెంట్స్‌ వంటి సేవలు సహ ఈ తరహా అనేక రకాల సదుపాయాలను Errando తన కస్టమర్లకు అందిస్తోంది.

ఇప్పటికే ఈ స్టార్టప్‌ రూ.15 కోట్లను ఏంజిల్‌ ఫండింగ్‌ ద్వారా సమీకరించింది. దక్షిణాదిన మరో ఆరు నగరాలు- హైదరాబాద్‌, చెన్నై, కోయంబత్తూరు, మైసూరు, మంగళూరు, త్రిస్సూరుకు సేవలను విస్తరిస్తోంది. ఇవే కాకుండా వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్డర్లు సేవలు అంటే B2B, డెలివరీ, రిటర్న్స్‌, Cod వంటి సేవల కూడా Errando అందిస్తోంది. ప్రస్తుతం Errando సేవలను రోజు 2000 మంది కస్టమర్లు ఉపయోగిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో రోజు 3000 మంది ఈ సేవలు ఉపయోగించుకున్నారు.

ఆరేళ్ల క్రితం ప్రారంభం..

2016లో Food of Touch పేరుతో ఈ స్టార్టప్‌ను షమీర్‌ తన స్నేహితులతో కలిసి ప్రారంభించారు. అప్పట్లో ఇది రెస్టారెంట్లు నుంచి ఫుడ్‌ డెలివరీ చేసేది. ఆ తర్వాత 2018లో Errando గా దీన్ని పేరు మార్చి కేరళలోని మూడు నగరాలకు సేవలు విస్తరించారు. 2020లో ఇది బెంగళూరులో కూడా కార్యకలాపాలు ప్రారంభించింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Home delivery, Kerala, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు