హోమ్ /వార్తలు /బిజినెస్ /

Keeway New Bikes: ఇండియాలో రెండు కొత్త కీవే మోటార్‌సైకిల్స్ లాంచ్.. లుక్, ఫీచర్లు అయితే అదుర్స్..

Keeway New Bikes: ఇండియాలో రెండు కొత్త కీవే మోటార్‌సైకిల్స్ లాంచ్.. లుక్, ఫీచర్లు అయితే అదుర్స్..

Photo Credit : Keeway

Photo Credit : Keeway

Keeway New Bikes: రెండూ డిజైన్ పరంగా వేర్వేరుగా ఉన్నా.. వీటిలో ఆఫర్ చేసిన ఇంజన్, మెకానికల్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ K300 బైక్స్‌లో 292cc లిక్విడ్ కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ అందించారు. 292cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 8,750 rpm వద్ద 27.1 bhp గరిష్ఠ శక్తిని.. 7,000 rpm వద్ద 25 Nm గరిష్ఠ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియాలో మోటార్‌సైకిల్స్‌ (Motorcycles)కు డిమాండ్ ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. ఫ్యామిలీ, అడ్వెంచర్, రేసింగ్, కమ్యూటింగ్ తదితర అవసరాలకు వినియోగదారులు రకరకాల బైకుల (New Bikes) కోసం మార్కెట్లలో అన్వేషిస్తుంటారు. వీరి అభిరుచులకు తగినట్లుగా కంపెనీలు ఇండియాలో ఎన్నో అద్భుతమైన బైక్స్‌ తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా చైనీస్ యాజమాన్యంలోని హంగేరియన్ బ్రాండ్ కీవే (Keeway) ఇప్పటికే క్రూయిజర్, రోడ్‌స్టర్‌ బైక్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు కె300 ఎన్ (Keeway K300 N), కె300 ఆర్‌ (Keeway K300 R) అనే రెండు సరికొత్త మోటార్‌సైకిళ్లను ఇండియాలో విడుదల చేసింది.

* ధరలు ఎంత?

కీవే ఇండియా కె300 ఎన్ బైక్‌ను ఒక నేకెడ్ స్ట్రీట్ బైక్‌గా కంపెనీ పరిచయం చేసింది. దీనిని రూ.2.65-2.85 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించింది. K300 R అనేది ఒక స్పోర్ట్స్ రేసింగ్ మోటార్‌సైకిల్ కాగా దీని ధరను రూ.2.99-3.20 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఇండియా)గా నిర్ణయించింది.

ఇవి రెండూ డిజైన్ పరంగా వేర్వేరుగా ఉన్నా.. వీటిలో ఆఫర్ చేసిన ఇంజన్, మెకానికల్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ K300 బైక్స్‌లో 292cc లిక్విడ్ కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ అందించారు. 292cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 8,750 rpm వద్ద 27.1 bhp గరిష్ఠ శక్తిని.. 7,000 rpm వద్ద 25 Nm గరిష్ఠ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఈ బైక్స్‌లో స్టాండర్డ్ వెర్షన్‌లోనే డ్యూయల్-ఛానల్ ABS, స్లిప్పర్ క్లచ్ (Slipper Clutch) వంటి బెస్ట్ ఫీచర్లు అందించారు. దీనివల్ల రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఇంజన్, బైక్ ఎక్కువ కాలం మన్నుతుంది. బ్రేకింగ్ కోసం బైక్స్ ముందు, వెనుక డిస్క్స్‌ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ 292మిమీ డిస్క్, వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేకులు ఆఫర్ చేశారు. ఈ బైక్స్ బుకింగ్స్‌ డీలర్ అవుట్‌లెట్‌లలో, ఆన్‌లైన్‌లో రూ.10 వేల టోకెన్ పేమెంట్‌తో ప్రారంభమయ్యాయి. ఇవి అథారైజ్డ్‌ బెనెల్లీ, కీవే డీలర్‌షిప్‌ల వద్ద టెస్ట్ రైడ్స్‌కు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇప్పుడు బుక్ చేసుకుంటే డెలివరీలు సెప్టెంబర్, 2022 చివరిలో ప్రారంభమవుతాయి.

ఇది కూడా చదవండి :  గాల్లో ఎగిరై బైక్ వచ్చేసిందిగా..దీని ధర,ఫీచర్లు తెలిస్తే వావ్ అనక తప్పదు!

* కీవే కె300 ఆర్‌ బైక్ ప్రత్యేకతలు

కీవే కె300 ఆర్‌ మోటార్‌సైకిల్‌లో విండ్‌షీల్డ్, కాంపాక్ట్ హ్యాండిల్‌బార్లు, బాసినెట్ ఫ్రేమ్, డ్రాగ్-రిడ్యూసింగ్ ఫెయిరింగ్స్‌తో ఏరోడైనమిక్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో రైడ్ మెట్రిక్స్‌, డ్యూయల్ రైడింగ్ మోడ్స్‌ కోసం యూజర్ ఫ్రెండ్లీ డిస్‌ప్లే ఉంటుంది. ఈ బైక్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్-అలైన్డ్ మోనో రియర్ సస్పెన్షన్, హైడ్రాలిక్ డంపింగ్‌తో ఫ్రంట్ ఫోర్క్‌తో రావడం విశేషం. ఇది గ్లోసీ వైట్, గ్లోసీ రెడ్, గ్లోసీ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ అయింది.

* కీవే కె300 ఎన్ ఫీచర్లు

కీవే కె300 ఎన్ బాసినెట్ ఫ్రేమ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఫెండర్లతో కవర్ చేసిన 110/70, 140/60 టైర్లు ఆఫర్ చేశారు. ఇన్‌వర్టెడ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్‌ ఆఫర్ చేశారు. దీంతో ఈ బైక్‌పై రైడ్‌ చేస్తున్నప్పుడు స్టాండింగ్ రైడింగ్ పొజిషన్‌లో ఉండొచ్చు. 12.5 లీటర్ల యాంగ్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, హయ్యెర్ ఫ్రంట్ ఎండ్, హ్యాండిల్‌బార్-మౌంటెడ్ మిర్రర్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఆఫర్ చేసిన మరికొన్ని అద్భుతమైన ఫీచర్లు. ఈ బైక్ మ్యాట్ వైట్, మ్యాట్ రెడ్, మ్యాట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో రిలీజ్ అయింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Auto mobile, New bike, New bikes

ఉత్తమ కథలు