Home /News /business /

KEEP THESE THINGS MIND FOR PLANNING TO BUY HEALTH INSURANCE POLICY AMID COVID 19 NS GH

Health Insurance: కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలపై దృష్టి పెట్టండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కొత్తగా హెల్త్ పాలసీలను తీసుకోవాలి అనుకునేవారు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటంటే..

భారత్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ రంగాన్ని.. కరోనాకు ముందు, కరోనా తరువాత అని వర్గీకరించవచ్చు. వివిధ రకాల అనారోగ్యాల చికిత్సకు అయ్యే ఖర్చులను హెల్త్ పాలసీలు భర్తీ చేస్తాయి. అయితే కోవిడ్ నేపథ్యంలో వైద్యానికి కుటుంబాలు చేయాల్సిన ఖర్చు చాలా వరకు పెరిగింది. ఈ అదనపు ఖర్చులు అనేక కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మోపాయి. దీంతో చాలామంది ఇప్పుడు హెల్త్ పాలసీలను ఎంచుకుంటున్నారు. కానీ కరోనా తరువాత క్లెయిం రేటు కూడా పెరగడంతో.. బీమా సంస్థలు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో పాలసీ ధరలను కంపెనీలు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా హెల్త్ పాలసీలను తీసుకోవాలి అనుకునేవారు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి.
Insurance for Mental Health: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మానసిక అనారోగ్యాలకు వర్తిస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే...

చిన్న వయసులోనే పాలసీ తీసుకోవాలి
హెల్త్ పాలసీల ధరను నిర్ణయించే ప్రధాన అంశాల్లో వయసు ఒకటి. చిన్న వయసులో పాలసీ తీసుకుంటే, తక్కువ ధరలో ఆరోగ్య బీమా లభిస్తుంది. ఫలితంగా పాలసీ కవరేజీతో వినియోగదారులు ఎక్కువ లబ్ధి పొందవచ్చు. అందువల్ల ఉద్యోగంలో చేరిన కొత్తలోనే హెల్త్ పాలసీలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అవసరాలను గుర్తించాలి
ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేసేటప్పుడు పరిగణించాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. వినియోగదారులు ముందు ఇన్సూరెన్స్ కవరేజ్ పరిమితి, ఇతర పాలసీ ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ అవసరాలకు తగ్గ పాలసీని ఎంచుకోవాలి.

కవరేజ్ ఆప్షన్‌ తెలుసుకోవాలి
అన్ని హెల్త్ పాలసీలు ఒకే రకమైన ప్రయోజనాలను కల్పించవు. సంబంధిత సంస్థ నియమ, నిబంధనలను బట్టి.. పాలసీ ప్రయోజనాలు అందుతాయి. అందువల్ల వీటిని కొనడానికి ముందే.. వినియోగదారులు దాని ద్వారా అందే ప్రయోజనాలు, పరిమితుల గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఎలాంటి వైద్య ఖర్చులను పాలసీ కవర్ చేస్తుంది, ఎలాంటి చికిత్సలకు పాలసీ వర్తించదనే విషయాలను కొనుగోలుదారులు అర్థం చేసుకోవాలి. దీంతోపాటు బీమా సంస్థ కోవిడ్-19 కవరేజీని అందిస్తుందో లేదో నిర్ధారించుకోవాలి.

కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆరా తీయాలి
పాలసీని ఎంచుకోవడానికి ముందే, ఇన్సూరెన్స్ కంపెనీ గురించి చిన్నపాటి పరిశోధన చేయాలి. క్లెయిం సెటిల్‌మెంట్ విషయంలో సంస్థల గత రికార్డులను పరిశీలించాలి. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌కు కంపెనీ తీసుకున్న సగటు సమయం తెలుసుకోవాలి. దీని ఆధారంగా మెరుగైన సేవలందించే సంస్థలను ఎంచుకోవాలి.

వివిధ రకాల హెల్త్ ప్లాన్లను పోల్చాలి
వినియోగదారుల అవసరాలకు సరిపోయే వివిధ ప్లాన్లను పోల్చి చూసి.. అన్ని విధాలుగా లబ్ధి చేకూర్చే పాలసీలను ఎంచుకోవాలి. దీని ద్వారా డబ్బు ఆదా చేసుకోవడం సాధ్యమవుతుంది. అదనంగా, పాలసీ ప్రయోజనాలను సమగ్రంగా విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది.

నెట్‌వర్క్ హాస్పిటల్స్
ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ, తమ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న వారికి బీమా పాలసీని వర్తింపజేస్తుంది. అందువల్ల కొనుగోలుదారులు ఈ జాబితాలోని హాస్పిటల్స్‌ గురించి ఆరా తీయాలి. వారికి దగ్గర్లో, మెరుగైన సేవలందించే వైద్యశాలను ఈ జాబితాలో చేర్చిన కంపెనీలను కొనుగోలుదారులు ఎంచుకోవాలి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Health Insurance, Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు