హోమ్ /వార్తలు /బిజినెస్ /

Kawasaki Bikes: క్రిస్ మస్ పండగకు Kawasaki Bikes బంపర్ ఆపర్ .. రూ .50,000 వరకు డిస్కౌంట్

Kawasaki Bikes: క్రిస్ మస్ పండగకు Kawasaki Bikes బంపర్ ఆపర్ .. రూ .50,000 వరకు డిస్కౌంట్

Honda Hornet 2.0: హోండా హార్నెట్ 2.0 వచ్చేసింది... ధర, ఫీచర్స్ ఇవే
(image: Honda 2 Wheelers India)

Honda Hornet 2.0: హోండా హార్నెట్ 2.0 వచ్చేసింది... ధర, ఫీచర్స్ ఇవే (image: Honda 2 Wheelers India)

స్టాక్ క్లియరెన్స్ సేల్లో భాగంగా ఎంపిక చేసిన బైక్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్ను ప్రకటించింది.

జపాన్ కి చెందిన స్పోర్ట్స్ బైక్ ల తయారీ సంస్థ కవాసకి(Kawasaki) తమ స్టాక్ క్లియర్ చేయడానికి భారీ డిస్కౌంట్ల (discounts)తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్లన్నీ డిసెంబర్ నెల అంతా చెల్లుబాటు అవుతాయని కంపెనీ తెలిపింది. ఇటీవలే ముగిసిన దసరా, దీపావళి పండుగ సీజన్లో పలు ఆటోమొబైల్ కంపెనీలు భారీ డిస్కౌంట్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది కరోనా ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర నష్టాలు చవిచూడటంతో తమ అమ్మకాలను పెంచుకొని నష్టాల నుంచి గట్టెక్కాలని కంపెనీలు యోచిస్తున్నాయి. దీనిలో భాగంగా జపాన్ కి చెందిన ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి ఇండియా స్టాక్ క్లియరెన్స్ ఆఫర్ను ప్రకటించింది. కవాసకి KLX 110, కవాసకి KLX 140, కవాసకి KX 100, రెట్రో క్రూయిజర్ డబ్ల్యూ 800, కవాసకి వల్కాన్ S, కవాసకి Z 650, కవాసకి వెర్సిస్ 650 వేరియంట్ల కొనుగోలుపై ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. స్టాక్ క్లియరెన్స్ సేల్లో భాగంగా ఎంపిక చేసిన బైక్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్ను ప్రకటించింది.

కవాసకి బైక్‌లపై వర్తించే డిస్కౌంట్లు..

కవాసకి KLX 110 బైక్పై రూ .30,000, KLX 140పై రూ .40,000 KX 100పై రూ .50,000, రెట్రో క్రూయిజర్ డబ్ల్యూ 800పై రూ .30,000, వల్కాన్ ఎస్పై రూ .20,000, Z 650 పై రూ .30,000, వెర్సిస్ 650పై రూ .30,000 డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇటీవలే, కవాసకి నింజా ZX-10R, -ZX-10RR బైక్లలో హార్డ్‌వేర్, డిజైన్ మార్పులు చేసి అప్‌డేట్ చేయనుంది కవాసకి. మునుపటి కంటే మెరుగైన ఫీచర్లను దీనిలో అందిస్తోంది. అంతేకాక, 2021లో విడుదలయ్యే నింజా ZX-10R, నింజా ZX- 10R KRT ఎడిషన్, నింజా ZX-10RR బైక్లలో ఏరోడైనమిక్ బాడీని చేర్చనుంది. 2021లో విడుదల కాబోయే అన్ని బైక్‌లకు ఇంటిగ్రేటెడ్ వింగ్లెట్స్, స్మాల్ అండ్ లైట్ ఎల్‌ఈడి హెడ్‌లైట్లు, టిఎఫ్‌టి కలర్ ఇన్‌స్ట్రుమెంటేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లను చేర్చనుంది. ఈ బైక్ల ఇంజన్, ఛాసిస్లలో కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ బైక్లన్నీ 998 సిసి ఇన్-లైన్ ఫోర్-సిలిండర్, 16- వాల్వ్ ఇంజన్ ద్వారా పనిచేస్తాయని కవాసకి తెలిపింది. పీక్ టార్క్ను ఉత్పత్తి చేసే ఈ బైక్లను ప్రత్యేకంగా రైడర్స్ సౌలభ్యం కోసం తయారు చేసినట్లు కవాసకి పేర్కొంది.

Published by:Krishna Adithya
First published:

Tags: Automobiles, Cars

ఉత్తమ కథలు