Kawasaki Offers | మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపు లభిస్తోంది. ఏకంగా రూ. 35 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. కంపెనీ ఆఫర్‌లో (Offers) భాగంగా బైక్స్ (Bikes) ధరలను తగ్గించేసింది. అయితే ఈ బైక్స్ ఆఫర్లు పరిమిత కాలం వరకే ఉంటాయి. ఈ నెల చివరి వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉంటాయి. అందువల్ల బైక్ కొనాలని భావించే వారు ఈ నెల చివరి కల్లా ఈ డీల్స్ సొంతం చేసుకోవచ్చు.
ప్రముఖ టీవీలర్ తయారీ కంపెనీ కవాసకి తన బైక్స్‌పై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. బైక్ రెండు బైక్స్‌పై ధరలను తగ్గించేసింది. కవాసకి నింజా 300 బైక్‌పై రూ. 10 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే కవాసకి జెడ్ 650 బైక్‌పై అయితే ఏకంగా రూ. 35 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ రెండు బైక్స్‌పై సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు.
రైతుల కోసం 6 అదిరిపోయే స్కీమ్స్.. ప్రతి ఏడాది అకౌంట్లలోకి రూ.42 వేలు, సులభంగా రుణాలు
కవాసకి నింజా 300 బైక్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మార్కెట్‌లోకి వచ్చింది. దీని ధర రూ. 3.37 లక్షలు. తర్వాత దీని రేటు రూ. 3 వేలు పెరిగింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.4 లక్షలుగా ఉంది. కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ ఆఫర్ వివరాలను వెల్లడించింది. కవాసకి నింజా బైక్‌పై రూ.10 వేలు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే కవాసకి జెడ్650 బైక్‌పై అయితే రూ. 35 వేల తగ్గింపు లభిస్తోంది. డిసెంబర్ 31 వరకు ఆఫర్లు ఉంటాయి. దగ్గరిలోని కవాసకి షోరూమ్‌కు వెళ్లి ఈ బైక్స్‌ను బుక్ చేసుకోవచ్చు.
వారెవ్వా.. రూ.1497కే విమాన టికెట్, కంపెనీ కళ్లుచెదిరే ఆఫర్!
కవాసకి నింజా 300 బైక్‌లో 296 సీసీ పారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ 4 స్ట్రోక్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో ఆరు గేర్లు ఉంటాయి. సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. గ్యాస్ చార్జ్‌డ్ మోనో షాక్ అబ్జార్బర్ ఉంటుంది. ఇందులో ఇంకా పెటల్ డిస్క్ బ్రేక్స్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇకపోతే కవాసకి జెడ్ 650 బైక్‌లో అయితే 649 సీసీ పారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో కూడా ఆరు గేర్లు ఉంటాయని చెప్పుకోవచ్చు. యాంటి లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ బైక్ బరువు 191 కేజీలు. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్లు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 6.43 లక్షలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike, Bikes, Latest offers, Offers