హోమ్ /వార్తలు /బిజినెస్ /

Kawasaki W175 MY 23: రెట్రో స్టైల్‌తో కవాసకీ నుంచి క్రూజింగ్ మోటార్‌సైకిల్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..

Kawasaki W175 MY 23: రెట్రో స్టైల్‌తో కవాసకీ నుంచి క్రూజింగ్ మోటార్‌సైకిల్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..

Kawasaki W175 MY 23 (PC : Kawasaki)

Kawasaki W175 MY 23 (PC : Kawasaki)

Kawasaki W175 MY 23: ప్రముఖ జపనీస్ ద్విచక్ర వాహనాల తయారీదారు కవాసకీ (Kawasaki) ఇండియా విభాగం సరికొత్త కవాసకీ W175 MY23 బైక్‌ను లాంచ్ చేసింది. ఈ క్లాసీ బైక్ ధర, ఇంజిన్ పవర్, వేరియంట్స్‌ తదితర వివరాలపై ఓ లుక్కేద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇండియా (India)లో రూ.1-2 లక్షల లోపు రెట్రో స్టైల్‌తో వచ్చే క్రూజింగ్ మోటార్‌సైకిల్స్ (Motorcycles) చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. లిమిటెడ్‌గా ఉన్న వీటిలో మంచి టార్క్, పవర్‌, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్, ఈజీ హ్యాండ్లింగ్ ఉన్న బైక్‌ను ఎంచుకోవడం ఒక సవాలుగా మారింది. అయితే ఈ విభాగంలో అన్ని రకాల వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా ఎంట్రీ-లెవల్‌ రెట్రో స్టైల్ మోటార్‌సైకిల్స్‌ను ఆయా కంపెనీలు తీసుకు రావడం మొదలెట్టాయి. తాజాగా ప్రముఖ జపనీస్ ద్విచక్ర వాహనాల తయారీదారు కవాసకీ (Kawasaki) ఇండియా విభాగం సరికొత్త 'కవాసకీ W175 MY23 (Kawasaki W175 MY 23)' బైక్‌ను లాంచ్ చేసింది. ఈ క్లాసీ బైక్ ధర, ఇంజిన్ పవర్, వేరియంట్స్‌ తదితర వివరాలపై ఓ లుక్కేద్దాం.

* ఇంజిన్

కవాసకీ W175 177cc సింగిల్-సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. 7000 rpm వద్ద 13PS గరిష్ఠ శక్తిని.. 6000 rpm వద్ద 13.2 Nm గరిష్ఠ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ ఇంజిన్ BS6 నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీని కెర్బ్ వెయిట్ (Kerb Weight) జస్ట్ 135 కిలోలు, సీట్ హైట్ 790mm కాగా దీన్ని సిటీలో రైడ్‌ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది.

* ధర, వేరియంట్లు

కవాసకీ W175 మోటార్‌సైకిల్‌ను ఇండియాలో రూ.1.47 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)తో కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ధర నింజా 300 కంటే తక్కువే. ఈ కొత్త బైక్ స్టాండర్డ్, స్పెషల్ ఎడిషన్ అనే రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. అయితే కవాసకీ W175 స్పెషల్ ఎడిషన్ క్యాండీ పెర్సిమోన్ రెడ్‌ కలర్ (Candy Persimmon Red)లో వస్తుంది. ఆ రంగు కారణంగా దీని ధర రూ.2,000 పెరగగా దీని ధర రూ.1.49 లక్షల (ఎక్స్-షోరూమ్)కి పెరిగింది.

ఇక స్టాండర్డ్ వెర్షన్ ఎబోనీ పెయింట్‌లో అందుబాటులో ఉంటుంది. W175 MY23 డెలివరీ డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుంది. అయితే పైన చెప్పుకున్న ధరలు introductory ప్రైస్‌లు అని కంపెనీ తెలిపింది. ఈ ఇంట్రడక్టరీ ధర పరిమిత సంఖ్య యూనిట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. Kawasaki W175ని అన్ని అథారైజ్డ్‌ డీలర్‌షిప్‌లలో బుకింగ్‌ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : దసరా ఎఫెక్ట్.. రైల్వే ప్రయాణికులకు షాక్!

* కవాసకీ W175 డిజైన్, ఫీచర్లు

W175 డిజైన్‌లో రౌండ్-షేప్ హెడ్‌లైట్, సెమీ డబుల్ క్రెడిల్ ఫ్రేమ్, టియర్-డ్రాప్ షేప్డ్‌ ఫ్యూయల్ ట్యాంక్, బాక్సీ సైడ్ ప్యానెల్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో రెట్రో స్టయిల్‌లో నార్మల్ అనలాగ్ స్పీడోమీటర్, న్యూట్రల్, హై బీమ్, టర్న్ ఇండికేటర్లు, కొన్ని వార్నింగ్ లైట్లను ఆఫర్ చేశారు.

* సస్పెన్షన్, బ్రేకింగ్

W175లో 30 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్‌తో పాటు వెనుకవైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లను ఆఫర్ చేశారు. బ్రేకింగ్ విషయానికొస్తే, ముందు భాగంలో ఒక డిస్క్, వెనుక భాగంలో డ్రమ్ యూనిట్‌ను అందించారు. ఇది సింగిల్-ఛానల్ ABS బ్రేకింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో ముందు, వెనుక 17-అంగుళాల స్పోక్ వీల్స్ ఉంటాయి. ఈ నయా బైక్ యమహా FZ-X, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వంటి వాటితో పోటీపడుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, New bike, New bikes

ఉత్తమ కథలు