Home /News /business /

KATHGODAM DEHRADUN EXPRESS CANCELLED UNTIL JUNE 5 DUE TO TECHNICAL WORK GH VB

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు గమనిక.. జూన్ 5 వరకు ఆ రూట్‌లో ట్రైన్స్ రద్దు.. ఆ వివరాలు ఇలా...

Daily Express Trains: డైలీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించిన రైల్వే... రూట్స్, టైమింగ్స్ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Daily Express Trains: డైలీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించిన రైల్వే... రూట్స్, టైమింగ్స్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

ఉత్తరాఖండ్‌లోని సహరాన్‌పూర్-మొరాదాబాద్ (Saharanpur-Moradabad) మార్గంలో జూన్ 5 వరకు రైలు సేవలు (Rail Services) నిలిచిపోనున్నాయి. ఈ రూట్‌లోని బ్రిడ్జి నంబర్ 1202, 1211, 1216ల్లో సాంకేతిక, అభివృద్ధి పనుల కారణంగా రైలు సేవలపై ప్రభావం పడుతుందని తాజాగా ఈశాన్య రైల్వే (North Eastern) ప్రకటించింది.

ఇంకా చదవండి ...
ట్రైన్‌ (Train)లో ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే మీకు ఒక ముఖ్య గమనిక. ఉత్తరాఖండ్‌లోని సహరాన్‌పూర్-మొరాదాబాద్ (Saharanpur-Moradabad) మార్గంలో జూన్ 5 వరకు రైలు సేవలు (Rail Services) నిలిచిపోనున్నాయి. ఈ రూట్‌లోని బ్రిడ్జి నంబర్ 1202, 1211, 1216ల్లో సాంకేతిక, అభివృద్ధి పనుల కారణంగా రైలు సేవలపై ప్రభావం పడుతుందని తాజాగా ఈశాన్య రైల్వే (North Eastern) ప్రకటించింది. బుండ్కి-నాగినా రూట్‌లోని బ్రిడ్జి నంబర్ 1219లో కూడా టెక్నికల్, డెవలప్‌మెంట్ వర్క్స్ కొనసాగుతున్నాయి. అందుకే ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లపై కూడా ప్రభావం పడనుంది. పనుల వల్ల పలు రైళ్లు జూన్ 5 వరకు రద్దు అవుతాయని ఈశాన్య రైల్వే ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

రైలు నం. 12091/12092 కత్గోడం-డెహ్రాడూన్-కత్గోడం ఎక్స్‌ప్రెస్ (Kathgodam-Dehradun-Kathgodam) 01.... రైలు నం. 12091/12092 కత్గోడం-డెహ్రాడూన్-కత్గోడం ఎక్స్‌ప్రెస్ రైళ్లు జూన్ 5 వరకు రద్దయ్యాయని ఈశాన్య రైల్వే పేర్కొంది. అలానే ఈశాన్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం గోరఖ్‌పూర్-డెహ్రాడూన్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, ముజఫర్‌పూర్-డెహ్రాడూన్-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కొన్ని మార్పులు చేసింది. రైలు నం. 15005/15006 గోరఖ్‌పూర్-డెహ్రాడూన్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, 15001/15002 ముజఫర్‌పూర్-డెహ్రాడూన్-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రేక్ నిర్మాణాన్ని ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే సవరించింది.

Business Idea: ఇంటి నుంచే చేసే బిజినెస్.. నెలకు కనీసం రూ. 20 వేల ఆదాయం.. తెలుసుకోండి

రైలు నం. 15005/15006 గోరఖ్‌పూర్-డెహ్రాడూన్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ జనరేటర్-కమ్-లగేజీ వెహికల్ సవరించిన నిర్మాణం ప్రకారం జూన్ 10న గోరఖ్‌పూర్.. జూన్ 14 నుంచి డెహ్రాడూన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్‌లో 01 జనరల్ సెకండ్ క్లాస్, 02 స్లీపర్ క్లాస్, 05 ఏసీ III, 02 ఏసీ సెకండ్ క్లాస్‌తో సహా మొత్తం 17 కోచ్‌లు అందించారు. ఈ జెనరేటర్ కమ్ లగేజీ వెహికల్ సవరించిన నిర్మాణం ప్రకారం, ఈ ట్రైన్ కాకుండా రైలు నం.15001/15002 ముజఫర్‌పూర్-డెహ్రాడూన్-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ జూన్ 13 నుంచి ముజఫర్‌పూర్ నుంచి బయల్దేరుతుంది. డెహ్రాడూన్ నుంచి జూన్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. 01 జనరల్ సెకండ్ క్లాస్, 02 స్లీపర్ క్లాస్, 05 ఏసీ III మరియు 02 ఏసీ సెకండ్ క్లాస్‌తో సహా మొత్తం 17 కోచ్‌లు అందించారు. జూన్ 02, 2022న గోండా జంక్షన్ స్టేషన్‌లో యార్డ్ రీమోడలింగ్ కారణంగా 15069/15070 గోరఖ్‌పూర్-ఐష్‌బాగ్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, 05093/05094 గోరఖ్‌పూర్-గోండా-గోరఖ్‌పూర్ అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ ట్రైన్, 15009/15010 గోరఖ్‌పూర్-మైలానీ-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు అయ్యాయని ఈశాన్య రైల్వే తన ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా పేర్కొంది.

ఇదిలా ఉండగా, నిన్న అంటే జూన్ 1తో ముంబై & పుణేల మధ్య నడిచిన మొదటి డీలక్స్ ట్రాన్ డెక్కన్ క్వీన్ 92 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1 జూన్ 1930న, ముంబై & పూణేల మధ్య ఈ డీలక్స్ రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ సాధారణంగా కోచ్‌లను లింక్ హాఫ్మాన్ బుష్ (LHB) కోచ్‌లతో భర్తీ చేయాలని రైల్వే నిర్ణయించింది.
Published by:Veera Babu
First published:

Tags: India Railways, North eastern railway, Trains, Trains cancelled

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు