హోమ్ /వార్తలు /బిజినెస్ /

MCLR Hike: కస్టమర్లకు భారీ షాకిచ్చిన 2 బ్యాంకులు.. ఈరోజు నుంచి..

MCLR Hike: కస్టమర్లకు భారీ షాకిచ్చిన 2 బ్యాంకులు.. ఈరోజు నుంచి..

 MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన 2 బ్యాంకులు.. ఈరోజు నుంచి..

MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన 2 బ్యాంకులు.. ఈరోజు నుంచి..

Loan | మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? లేదంటే ఇప్పటికే రుణం పొందారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. తాజాగా రెండు బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

EMI | దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. రెపో రేటు పెంచనుందనే అంచనాలు నెలకొన్నాయి. ఆర్‌బీఐ (RBI) రెపో రేటుపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే రెండు బ్యాంకులు కస్టమర్లకు షాకిచ్చాయి. రుణ రేట్లు పెంచేశాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో (Banks) లోన్ తీసుకున్న వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. లోన్ తీసుకున్న వారిపై నెలవారీ ఈఎంఐ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొత్తగా లోన్ తీసుకోవాలని భావించే వారిపై అధిక వడ్డీ భారం పడుతుంది.

కెనరా బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను పెంచేసింది. ఎంసీఎల్ఆర్ రేటు పెంపు డిసెంబర్ 7 నుంచి అమలులోకి వస్తుంది. అంటే ఈ రోజు నుంచి రేటు పెంపు వర్తిస్తుంది. బ్యాంక్ బీఎస్ఈకి ఈ విషయాన్ని నివేదించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. 8.15 శాతానికి చేరింది. ఓవర్ నైట్, నెల రోజుల ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా కొనసాగుతోంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.6 శాతంగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.05 శాతంగా ఉంది. ఇకపోతే కెనరా బ్యాంక్ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 8.8 శాతంగా కొనసాగుతోంది.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్!

అలాగే మరోవైపు తమిళనాడుకు చెందిన కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా రుణ రేట్లు పెంచేసింది. ఈ బ్యాంక్ కూడా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. కొత్త రేట్లు నేటి నుంచే అమలులోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్ పెంపు వల్ల బ్యాంక్ కస్టమర్లపై ఈఎంఐ భారం పైకి చేరనుంది. బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ 9.05 శాతానికి చేరింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.95 శాతంగా ఉంటుంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ విషయానికి వస్తే 8.6 శాతానికి చేరుతుంది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా ఉంది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.3 శాతంగా ఉంది.

ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కొత్త సర్వీసులు తెచ్చిన బ్యాంక్, ఇకపై క్షణాల్లో..

బ్యాంకులు రుణాలకు ఎంసీఎల్ఆర్ రేటును ప్రమాణికంగా తీసుకుంటాయి. ఈ రేటు కన్నా తక్కువ రేటుకు రుణాలు అందించడం వీలు కాదు. బ్యాంకులు సాధారణంగా ఏడాది ఎంసీఎల్ఆర్‌ను రుణాలుక ప్రామాణికంగా తీసుకుంటాయి. బ్యాంక్ ప్రతిపదికన ఎంసీఎల్ఆర్ రేటు మారుతుంది. ఎంసీఎల్ఆర్ రేటుకు ప్రీమియం, ఇతర చార్జీలను కలుపుకొని బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటును వసూలు చేస్తాయి. అందుకే బ్యాంక్ ప్రతిపదికన రుణ రేట్లు కూడా మారుతూ ఉంటాయి.

First published:

Tags: Banks, Canara Bank, EMI, Mclr, Rbi

ఉత్తమ కథలు