KARUR VYSYA BANK REVISED INTEREST RATES ON FIXED DEPOSITS BUMPER OFFER FOR SENIOR CITIZENS MK
Karur Vysya Bank: Fixed Depsits పై సవరించిన వడ్డీ రేట్లు, సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్..
Karur Vysya Bank: Fixed Depsits పై సవరించిన వడ్డీ రేట్లు, సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్..
ఇప్పటికీ ఆర్థిక రంగంలో సేఫెస్ట్ పెట్టుబడి అంటే ఫిక్స్ డ్ డిపాజిట్ అనే చెప్పాలి. ఆర్థిక నిపుణులు ఎన్నిక పథకాలు వచ్చినప్పటికీ FDలనే సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే ఇవి పెట్టుబడిపరంగా FD ఒక మంచి ఎంపికగా పరిగణించబడుతుంది, ఇది హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. ఇందులో సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ వడ్డీ ఇందులో లభిస్తుంది.
ఇప్పటికీ ఆర్థిక రంగంలో సేఫెస్ట్ పెట్టుబడి అంటే ఫిక్స్ డ్ డిపాజిట్ అనే చెప్పాలి. ఆర్థిక నిపుణులు ఎన్నిక పథకాలు వచ్చినప్పటికీ FDలనే సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే ఇవి పెట్టుబడిపరంగా FD ఒక మంచి ఎంపికగా పరిగణించబడుతుంది, ఇది హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. ఇందులో సేవింగ్స్ ఖాతా కంటే ఎక్కువ వడ్డీ ఇందులో లభిస్తుంది. అయితే ఇదే సమయంలో, ప్రైవేట్ రంగానికి చెందిన కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank) అంటే KVB ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మార్చింది. కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank) 2 కోట్ల రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చింది. కొత్త రేట్లు జనవరి 12, 2022 నుండి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.25 నుంచి 5.75 శాతం వరకు వడ్డీ అందిస్తున్నారు. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం ఎక్కువ లభిస్తుంది.
కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank) 7 నుండి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీని అందిస్తోంది. 91 నుండి 120 రోజుల ఎఫ్డిలపై 3.50 శాతం వడ్డీ , 121 నుండి 180 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.75 శాతం వడ్డీ అందిస్తున్నారు. 181 నుండి 270 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీని అందిస్తుంది. 5 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ అందిస్తున్నారు.
టర్మ్ - వడ్డీ రేటు
7-14 రోజులు - 3.25 శాతం
15-30 రోజులు - 3.25 శాతం
31-45 రోజులు - 3.25 శాతం
46-90 రోజులు - 3.25 శాతం
91-120 రోజులు - 3.50 శాతం
121-180 రోజులు - 3.75 శాతం
181-270 రోజులు - 4.00 శాతం
271 రోజులు - 1 సంవత్సరం కంటే తక్కువ 4.25 శాతం
1 సంవత్సరం - 2 సంవత్సరాల కంటే తక్కువ 5.15 శాతం
2 సంవత్సరాలు - 3 సంవత్సరాల కంటే తక్కువ 5.25 శాతం
3 సంవత్సరాలు - 5 సంవత్సరాల కంటే తక్కువ 5.40 శాతం
5 సంవత్సరాలు , అంతకంటే ఎక్కువ 5.60 శాతం
సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం ఎక్కువ వడ్డీ
సాధారణ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.50 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తున్నారు. తాజా వడ్డీ రేట్ల మార్పు తర్వాత, సీనియర్ సిటిజన్లు ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 5.90% వరకు వడ్డీని పొందుతారు. అదే సమయంలో, నాన్-సీనియర్ సిటిజన్ల మాదిరిగానే, కెవిబి-టాక్స్ షీల్డ్ పథకం కింద సీనియర్ సిటిజన్లకు కూడా కొత్త రేట్లు 5.75 శాతంగా నిర్ణయించారు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.