TATA Tiago Car: రోజుకు కేవలం 166 రూపాయలకే టాటా టియాగో...ఇంటికి తీసుకెళ్లిపోండి...

టాటా మోటార్స్ ఆరు నెలల ఇఎంఐ హాలిడే ఆఫర్ ప్రారంభించింది. ఈ ఆఫర్ ఎంపిక చేసిన మోడల్స్ టియాగో, నెక్సాన్, అల్ట్రోస్‌లలో లభిస్తుంది. దీని కింద, కస్టమర్లు 6 నెలలు ఎటువంటి EMI చెల్లించాల్సిన అవసరం లేదు.

Krishna Adithya | news18-telugu
Updated: July 21, 2020, 11:08 PM IST
TATA Tiago Car: రోజుకు కేవలం 166 రూపాయలకే టాటా టియాగో...ఇంటికి తీసుకెళ్లిపోండి...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కరూర్ వైశ్యా బ్యాంక్ (KVB) టాటా మోటార్స్‌ (TATA MOTORS)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద టాటా కారు కొనుగోలుదారులకు బ్యాంక్ రుణాలు అందిస్తుంది. బ్యాంకు ప్రస్తుత, కొత్త కస్టమర్లు కెవిబి నుండి రుణం తీసుకోవడానికి అర్హులు. దీని కింద టాటా మోటార్స్ కొత్త కార్లను దేశంలోని ఏ రిటైల్ నెట్ వర్క్ కింద అయినా తీసుకోవచ్చు. KVBకి దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 779 శాఖలు ఉన్నాయి.

టాటా మోటార్స్ తన కస్టమర్లకు కరూర్ వైశ్యా బ్యాంక్ ద్వారా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. దీని కింద, వాహనం ఆన్ రోడ్ కాస్ట్ తో సమానంగా కారు లోన్ అందిస్తున్నారు. ఈ ఆఫర్ కింద, లోన్ తీసుకున్న కస్టమర్లు మొదటి ఆరు నెలలు EMIలను చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రుణం తీసుకున్న వారికి ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ ప్రధానంగా టాటా టియాగో, టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోజ్ లాంటి మూడు మోడళ్ల కొనుగోలుకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది. టాటా మోటార్స్ వాహనాలను కొనుగోలు చేయడానికి సాలరీడ్ క్లాస్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కస్టమర్లకు రుణం లభిస్తుంది.

టాటా టియాగో కారు


రోజుకు కేవలం 166 రూపాయలకే టాటా టియాగో...
టాటా మోటార్స్ ఆరు నెలల ఇఎంఐ హాలిడే ఆఫర్ ప్రారంభించింది. ఈ ఆఫర్ ఎంపిక చేసిన మోడల్స్ టియాగో, నెక్సాన్, అల్ట్రోస్‌లలో లభిస్తుంది. దీని కింద, కస్టమర్లు 6 నెలలు ఎటువంటి EMI చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో పాటు, 5 సంవత్సరాల లోన్ వ్యవధి, జీరో డౌన్ పేమెంట్, కారు ఆన్-రోడ్ ధరకు 100% ఫైనాన్స్ చేయనున్నారు.

ఆరు నెలల EMI హాలిడే స్కీమ్ -
ఈ హాలిడే స్కీమ్ కింద, వినియోగదారులు టాటా ఆల్ట్రోజ్‌ను నెలకు 5555 రూపాయల EMI కింద కొనుగోలు చేయవచ్చు. అంటే రోజుకు 185 రూపాయలు మాత్రమే. అదేవిధంగా, మీరు రోజుకు రూ .250 చొప్పున నెలకు 4999 రూపాయలు ఈఎంఐతో TATA Nexon కారును కొనుగోలు చేయవచ్చు. ఇక TATA Tiagoను రోజుకు 166 రూపాయలకు చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్‌లను Nexon, Altroz, Tiago లకు మాత్రమే అందిస్తున్నారు.వాహనాలను జీరో డౌన్ పేమెంట్‌పై కొనుగోలు చేయవచ్చు -
టాటా మోటార్స్ ఈ పథకం కింద వినియోగదారులు ఇప్పుడు జీరో డౌన్ పేమెంట్ చేయవచ్చని, అలాగే ఆరు నెలల ఇఎంఐ కూడా హాలిడే ఇవ్వనున్నారు. అంటే 6 నెలల పాటు ఇఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ వడ్డీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల లోన్ పేమెంట్ కాలం కోసం 100 శాతం వరకు ఆన్-రోడ్ ఫండింగ్ చేయవచ్చు.
Published by: Krishna Adithya
First published: July 21, 2020, 11:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading