Bank News | ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్యా బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కీలక ప్రకటన చేసింది. సేవింగ్స్ అకౌంట్లపై (Savings Account) వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఆ బ్యాంక్‌లో (Bank) అకౌంట్ ఉన్న వారికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై సేవింగ్స్ ఖాతాలపై అధిక వడ్డీ రేటు లభిస్తుంది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం జనవరి 18 నుంచే అమలులోకి వచ్చింది. అంటే నేటి నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ బ్రాంచ్ లేదా ఏటీఎం సెంటర్‌కు వెళ్లి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా కలిగిన వారికి గరిష్టంగా 5.25 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. రూ. 5 లక్షలలోపు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై వడ్డీ రేటు 2.25 శాతంగా ఉంది. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే.. అప్పుడు వడ్డీ రేటు 2.5 శాతంగా ఉంటుంది. రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై వడ్డీ రేటు 3 శాతం వడ్డీ వస్తుంది.
ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇక వారికి 2 రోజుల్లోనే అకౌంట్‌లోకి డబ్బులు!
ఇంకా రూ. కోటి నుంచి రూ. 100 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై వడ్డీ రేటు 3.25 శాతంగా ఉంది. రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై అయితే వడ్డీ రేటు 5 శాతంగాఉంది. ఇక రూ. 150 కోట్లు లేదా ఆపైన బ్యాలెన్స్ ఉంటే మాత్రం 5.25 శాతం వరకు వడ్డీ వస్తుంది. అంటే బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ ప్రతిపదికన కస్టమర్లకు వచ్చే వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుందని గుర్తించుకోవాలి.
వావ్.. ఆఫర్ అంటే ఇదే.. ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే రూ.25,000 డిస్కౌంట్!
ఇకపోతే ఈ బ్యాంక్ 2022 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో అదరగొట్టింది. నికర లాభం ఏకంగా 56 శాతానికి పైగా పెరిగింది. రూ. 289 కోట్లుగా నమోదు అయ్యింది. మునపటి ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 185 కోట్లు. నిర్వహణ లాభం రూ. 401 కోట్ల నుంచి రూ. 689 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 29 శాతానికి పైగా పెరిగింది. రూ. 889 కోట్లుగా ఉంది. మునపటి ఏడాది ఇదే క్వార్టర్‌లో నికర వడ్డీ ఆదాయం రూ. 686 కోట్లు. అంటే బ్యాంక్ అదిరిపోయే ఫలితాలను నమోదు చేసిందని చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank news, Banks, Interest rates, Personal Finance