హోమ్ /వార్తలు /బిజినెస్ /

Amazon: లోదుస్తులపై కన్నడ జెండా.. అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు.. అసలేం జరిగిందంటే..

Amazon: లోదుస్తులపై కన్నడ జెండా.. అమెజాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు.. అసలేం జరిగిందంటే..

కన్నడ జెండా చిత్రంతో లోదుస్తులు

కన్నడ జెండా చిత్రంతో లోదుస్తులు

గూగుల్ ఘటన మరవకముందే అమెజాన్ సైతం కన్నడ ప్రజలను అవమానించింది. దీంతో కన్నడ నాట తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

  ఇటీవల కన్నడ భాషను గూగుల్ అవమానించిన వివాదం మరవకముందే మరో వివాదం చోటు చేసుకుంది. అమెజాన్ సంస్థ కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. పసుపు, ఎరుపు రంగులతో కూడిన కన్నడ జాతీయ జెండాను ను ముద్రించిన లో దుస్తువులను అమెజాన్ తన వెబ్ సైట్ లో అమ్మకానికి ఉచ్చింది. కెనడాలోని అమెజాన్ యొక్క ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో ఇది చోటు చేసుకుంది. దీంతో కన్నడ ప్రముఖులు అమెజాన్ పై ధ్వజమెత్తారు. అమెజాన్ తక్షణం తమకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై అనేక మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోకచక్రాన్ని సైతం లోదుస్తులపై ముద్రించడంపై అమెజాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే ఈ అంశంపై అమెజాన్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. అయితే అమెజాన్ ఇప్పుడు ఆ దుస్తులను తన సైట్ నుండి తొలగించింది.

  ఈ అంశంపై రాష్ట్ర కన్నడ శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద్ లింబావాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ గౌరవాన్ని దెబ్బతీసేందుకు యత్నించిన అమెజాన్ కెనడాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కన్నడ జెండా ముద్రించిన బికీని అమ్మినందుకు అమెజాన్ క్షమాపణ చెప్పకపోతే తాను న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ అంశంపై అరవింద్ లింబాయవాలి ట్వీట్ చేశారు. ఇటీవల గూగుల్ చేత తాము అవమానించబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మరవక ముందే కన్నడ జెండాను అమెజాన్ అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  అమెజాన్‌లో కన్నడ జెండా యొక్క ప్రింట్ మరియు లోగోతో కెనడియన్ మహిళల లోదుస్తుల అమ్మకాన్ని తాము చూశామన్నారు. బహుళజాతి కంపెనీలు ఈ పద్ధతిలో కన్నడను అవమానించడం మానేయాలన్నారు. కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీసే పని ఏ కంపెనీ చేయకూడదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తమ ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. దీనికి అమెజాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే అమెజాన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మంత్రి అరవింద్ లింబాగ్ ట్విట్టర్‌లో అమెజాన్ ను హెచ్చరించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Amazon, Canada, Karnataka

  ఉత్తమ కథలు