Home /News /business /

KALYAN JEWELLERS MALABAR GOLD AND OTHER JEWELLERS ANNOUNCED AKSHAYA TRITIYA OFFERS GET HUGE DISCOUNTS AND FREE GOLD COINS SS

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్స్... ఉచితంగా గోల్డ్ కాయిన్

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్స్... ఉచితంగా గోల్డ్ కాయిన్
(ప్రతీకాత్మక చిత్రం)

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్స్... ఉచితంగా గోల్డ్ కాయిన్ (ప్రతీకాత్మక చిత్రం)

Akshaya Tritiya | అక్షయ తృతీయ సందర్భంగా నగల దుకాణాలన్నీ ఆఫర్స్ ప్రకటించాయి. డిస్కౌంట్స్, మేకింగ్ ఛార్జీలపై తగ్గింపుతో పాటు ఉచితంగా గోల్డ్ కాయిన్స్ (Free Gold Coins) ఇస్తున్నాయి.

అక్షయ తృతీయ... భారతీయులు సెంటిమెంట్‌గా భావించే పర్వదినం. ఈ రోజు ఏపని చేసినా అంతా శుభమే జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అక్షయ తృతీయ (Akshaya Tritiya) రోజున బంగారం కొంటే మంచిదన్న సెంటిమెంట్ ఉంది. అందుకే డబ్బులు దాచుకొని మరీ అక్షయ తృతీయ రోజున బంగారం కొంటూ ఉంటారు. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం నగల దుకాణాలు బంగారు నగలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ (Gold Jewellery Offers) ప్రకటిస్తుంటాయి. మే 3న అక్షయ తృతీయ ఉండటంతో పెద్దపెద్ద నగల దుకాణాలన్నీ ఆఫర్స్ ప్రకటించాయి. కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్, తనిష్క్ లాంటి బ్రాండ్స్ ఎక్స్‌క్లూజీవ్ ఆఫర్స్ అందిస్తున్నాయి. ఆ ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.

Candere by Kalyan Jewellers: కళ్యాణ్ జ్యువెలర్స్‌కు చెందిన కాండీర్ కూడా రూ.25,000 విలువైన నగల కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్స్ ఇస్తోంది. సాలిటైర్లపై 40 శాతం తగ్గింపు, బంగారు నగల తయారీ ఖర్చులపై 60 శాతం తగ్గింపు, వజ్రాల నగలపై జీరో మేకింగ్ ఛార్జెస్, ప్లాటినం నగల తయారీ ఖర్చులపై 40 శాతం తగ్గింపు లభిస్తుంది. రూ.20,000 కన్నా ఎక్కువ విలువైన బంగారు నగల మేకింగ్ ఛార్జీలపై 55 శాతం తగ్గింపు, రూ.1,00,000 కన్నా ఎక్కువ విలువైన బంగారు నగల మేకింగ్ ఛార్జీలపై 60 శాతం తగ్గింపు లభిస్తుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

PM Kisan Alert: పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్... ఈ సర్వీస్ మీకోసమే

Tanishq: అక్షయ తృతీయ సందర్భంగా తనిష్క్ బంగారు నగలు, వజ్రాల నగల మేకింగ్ ఛార్జీలపై 20 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ప్లెయిన్ జ్యువెలరీ కొంటే ఒక గ్రాముకు రూ.200 తగ్గింపు పొందొచ్చు. ఏప్రిల్ 24న మొదలైన ఆఫర్స్ మే 4న వరకు అందుబాటులో ఉంటాయి.

Malabar Gold: మలబార్ గోల్డ్ ఆన్‌లైన్ ఆఫర్ అందిస్తోంది. రూ.25,000 విలువైన బంగారు నగలు కొనేవారికి ఉచితంగా గోల్డ్ కాయిన్ లభిస్తుంది. రూ.25,000 విలువైన వజ్రాల నగలు కొంటే రెండు గోల్డ్ కాయిన్స్ ఉచితంగా పొందొచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Joyalukkas: జాయ్‌అలుక్కాస్‌లో రూ.50,000 విలువైన డైమండ్, అన్‌కట్ డైమండ్ నగల కొనుగోలుపై 1 గ్రాము గోల్డ్ కాయిన్ ఉచితంగా లభిస్తుంది.

Caratlane: కార్టాలైన్‌లో వజ్రాల నగలపై 20 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ మే 3 వరకే పొందొచ్చు.

Goa Tour: హైదరాబాద్ నుంచి గోవా టూర్... రూ.10,000 లోపే ఐదు రోజుల ట్రిప్

Senco Gold: సెంకో గోల్డ్‌లో బంగారు నగలు కొంటే ప్రతీ గ్రాముపై రూ.224 తగ్గింపు, మేకింగ్ ఛార్జీలపై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. వజ్రాల నగలు, వెండి నాణేల మేకింగ్ ఛార్జీలపై 100 శాతం తగ్గింపు లభిస్తుంది.

PC Jewellers: పీసీ జ్యువెలర్స్‌లో వెండి నగలపై 40 శాతం డిస్కౌంట్, వజ్రాల నగలపై 30 శాతం తగ్గింపు లభిస్తుంది.

Tribhovandas Bhimji Zaveri: త్రిభొవన్‌దాస్ భీమ్‌జీ జవేరీ నగల షాపులో అక్షయ తృతీయ సందర్భంగా బంగారు నగలు, డైమండ్ నగలు కొంటే మేకింగ్ ఛార్జీలపై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. గోల్డ్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే 100 శాతం ఎక్స్‌ఛేంజ్ వ్యాల్యూ లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Akshaya Tritiya, Gold Prices, Gold rates, Malabar gold

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు