తెలుగు రాష్ట్రాల్లో ఇక నుంచి వినియోగదారులకు కైనీ మిల్క్ అందుబాటులోకి రానున్నాయి. ఈ పాలు ఆరునెలల పాటు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాల్లో రూ. 200 కోట్ల పెట్టుబడితో పాల ఫ్యాక్టరీ సిద్ధమవుతోంది. ఉమెనోవా అగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వస్తున్న కైనీ మిల్క్ ను ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర పశు సంవర్దక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. సంస్థ ప్రతినిధులు డాక్టర్. రంగయ్య, శరద్ లతో కలిసి ఆయన తన నివాసంలో టెట్రాప్యాకెట్ లో ఆరునెలలు నిల్వ ఉండే పాల ప్యాకెట్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విదేశాల్లో వ్యాపారం చేసుకుంటున్న సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు వికారాబాద్ జిల్లాల్ ఫ్యాక్టరీ ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్యాక్టరీ ద్వారా మరింత మందికి ఉపాధి కలగనుందని మంత్రి చెప్పారు. సంస్థ మరింత అభివృద్ధి చెందాలని తలసాని ఆకాంక్షించారు.
తమ కంపెనీ నుంచి వస్తున్న కైనీ మిల్క్ తెలుగురాష్ట్రాల్లో ప్రారంభించడంపై కంపెనీ సీఈఓ డాక్టర్ రంగయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమెనోవా అగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ 2018లో ప్రారంభించామన్నారు. విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ భారతదేశంలో కూడా పెట్టుబడులు పెట్టాలని 2017లో తెలంగాణ ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత టీఎస్ పాస్ ద్వారా ల్యాండ్ , పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఉమోనోవా డైరీ స్థాపించామన్నారు. ఇప్పుడు రూ. 200 కోట్ల పెట్టుబడితో వికారాబాద్ జిల్లాలోని హైదరాబాద్ – ముంబాయి రహదారికి సమీపంలో ఈ ప్యాక్టరీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. ప్రపథమంగా Schreiber Dynamix Dairies Pvt.ltd. వారి భాగస్వామ్యంతో కైన్ మిల్క్ లాంగ్ లైఫ్ మిల్క్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ చేతుల మీద ప్రారంభించామన్నారు. భారతదేశం అంతటా కూడా ఆ ప్రొడక్ట్ ను ప్రారంభిస్తున్నామన్నారు.
నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్ లో ఇప్పటికే రెండు లక్షల లీటర్ల వరకు ప్రతీ నెల అమ్ముతున్నట్లు చెప్పారు. ప్రెష్ మిల్క్ కూడా పల్లె పాలు అనే బ్రాండ్ తో వచ్చే సంవత్సరం మధ్య వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నామన్నారు. తాము ప్రోటీన్స్ ప్రొడక్ట్స్ లో కూడా వస్తున్నామని చెప్పారు. యూరోపియన్ టెక్నాలజీని వాడుతున్న దేశంలోనే అతి పెద్ద రెండో ప్లాంట్ ఇది కానుందని చెప్పారు. ఈ టెక్నాలజీతో వచ్చిన ప్రతి ప్రొడక్ట్ కూడా నిలువ కాలం కూడా ఎక్కువ ఉంటుందన్నారు. అనేక క్వాలిటీ సెంటర్స్ ద్వారా దీనిని ధ్రువీకరించామన్నారు. ప్యాకేజింగ్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిరోధించామన్నారు. 100శాతం రిసైకిల్ చేసుకునే ప్యాకేజీంగ్ చేస్తున్నామన్నారు. ఈ పద్ధతిలో ప్యాక్ అయ్యే వాటిని గేబుల్ టాప్ అంటారని వివరించారు. తమ నుంచి వచ్చే ఫ్రెష్ మిల్క్ ను సైతం 5 రోజులపాటు నిల్వ చేసుకోవచ్చన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MILK, Talasani Srinivas Yadav, Vikarabad