Home /News /business /

JUST FOLLOW FOUR WAYS FOR HOME LOAN EASY TO GET A LOAN READ THAT HERE UMG GH

Home Loan: హోమ్‌లోన్ కావాలా..? ఈ నాలుగు మార్గాలు పాటించండి.. ఈజీగా వచ్చేస్తుంది..!

గృహ రుణాలు

గృహ రుణాలు

వీలైనంత త్వరగా ఇంటిని కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే, హోమ్‌లోన్‌ (Home Loan) ఆమోదం పొందే సమయాన్ని వీలైనంత తక్కువగా ఉంచుకోవాలి. హోమ్ లోన్ అప్రూవల్ (Approval) సమయాన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం.

ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి హోమ్‌ లోన్‌ (Home Loan) ఎంతో సహాయంగా ఉంటుంది. అయితే హోమ్ లోన్ తీసుకోవడం సుదీర్ఘ ప్రక్రియతో కూడుకున్నది. దీంతో లోన్ ప్రాసెస్ నిరుత్సాహంగా అనిపించవచ్చు. నేటి డిజిటల్ యుగంలో కూడా హోమ్‌ లోన్‌ అప్లికేషన్(Application) కోసం చాలా డాక్యుమెంట్లు (Document's) అవసరమవుతాయి. వాటిని రుణదాతకు సమర్పించి ధ్రువీకరించాలి. హౌసింగ్ మార్కెట్ దాదాపు ప్రతి ఒక్కరికీ సవాలుగా ఉంది. వీలైనంత త్వరగా ఇంటిని కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే, హోమ్‌లోన్‌ ఆమోదం పొందే సమయాన్ని వీలైనంత తక్కువగా ఉంచుకోవాలి. హోమ్ లోన్ అప్రూవల్ సమయాన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం.

హోమ్ లోన్ పొందే సమయం తగ్గించుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు...

* మంచి క్రెడిట్ స్కోర్‌ అవసరం
హోమ్‌లోన్‌ త్వరగా ఆమోదం పొందడానికి మంచి CIBIL లేదా క్రెడిట్ స్కోర్(Credi Score) కీలకం. స్కోర్‌ను మెరుగుపరిచేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటంటే..

- చెల్లింపులన్నీ సకాలంలో చేయాలి. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, యుటిలిటీ బిల్లులు మొదలైనవి ఎప్పటికప్పుడు పే చేయాలి.

- క్రెడిట్ వినియోగాన్ని తక్కువగా ఉంచాలి. అందుబాటులో ఉన్న క్రెడిట్‌లో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించాలి.

- ఏదైనా అప్పు ఉంటే, వీలైనంత త్వరగా దాన్ని చెల్లించడానికి ప్రయత్నించండి.

- క్రెడిట్ నివేదికను క్రమం తప్పకుండా పరిశీలించాలి. ఏవైనా లోపాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి.

ఇదీ చదవండి:  Naresh: పవన్ మూడు పెళ్లిళ్లు.. నరేష్ నాలుగో పెళ్లి.. ఇండస్ట్రీ చులకన అయిపోయిందన్న నిర్మాత

* సరైన రుణదాతను సెలక్ట్‌ చేసుకోవాలి
కొన్ని కంపెనీలు రుణాన్ని ఇతరుల కంటే వేగంగా ఆమోదించే అవకాశం ఉంటుంది. హోమ్ లోన్‌ కోసం ముందస్తు ఆమోదం పొందడం ఉత్తమ మార్గం. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక సంస్థలు హోమ్‌లోన్‌లు అందిస్తున్నాయి. దరఖాస్తును సిద్ధం చేస్తున్నప్పుడు, అత్యుత్తమ రేట్ల కోసం అన్నింటినీ పరిశీలించాలి. సాధ్యమైనంత బెస్ట్ డీల్స్ పొందేందుకు ప్రయత్నించాలి.

* డౌన్ పేమెంట్ లేదా మార్జిన్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలి
హోమ్‌లోన్‌ త్వరగా ఆమోదం పొందాలని ఆశిస్తుంటే, డౌన్ పేమెంట్‌ను ఎక్కువగా చెల్లించాలి. రుణదాతలు సాధారణంగా 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ డౌన్ పేమెంట్‌ని ఆశిస్తారు. ఇది తక్కువ వడ్డీ రేటును పొందడంలో సహాయపడుతుంది. వాస్తవానికి మొదటిసారిగా ఇంటి కొనుగోలుదారు అయితే 20 శాతం డౌన్ పేమెంట్‌తో ముందుకు రావడం ఒక సవాలుగా ఉంటుంది, ఆ రకమైన నగదు లేకపోతే, ఇతర ఆప్షన్‌లు పరిశీలించవచ్చు.



* క్రెడిట్‌ స్కోర్‌ నిర్ధారించుకోవాలి
హోమ్ లోన్ అప్రూవల్ ప్రాసెస్‌ను ప్రారంభించే ముందు, ఆర్థిక వనరులు ఉన్నాయని నిర్దారించుకోండి. క్రెడిట్ స్కోర్‌ను క్రమబద్ధీకరించడం, అలాగే అవసరమైన అన్ని పత్రాలు, సమాచారాన్ని చేతిలో ఉంచుకోవడం అవసరం. ఆదాయం, అప్పులు, ఆస్తుల గురించి ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. దరఖాస్తును ప్రారంభించే ముందు క్రెడిట్ రిపోర్ట్, క్రెడిట్ స్కోర్ కచ్చితమైనవని నిర్ధారించుకోండి. క్రెడిట్‌ను క్లీన్‌గా ఉంచుకోవడం వల్ల మీ హోమ్ లోన్‌ను తక్కువ వడ్డీ రేటుతో పొందవచ్చు. స్వయం ఉపాధి పొందుతుంటూ, భవిష్యత్తు కోసం ఆదాయాన్ని పొందడం కొనసాగించడానికి ట్రాక్‌లో ఉన్నారని తప్పనిసరిగా చూపించాలి.
Published by:Mahesh
First published:

Tags: Cibil score, Credit card, Financial banks, Home loans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు