హోమ్ /వార్తలు /బిజినెస్ /

RBI Warning: ఈ 5 రకాల మోసాలతో మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం... ఆర్‌బీఐ వార్నింగ్

RBI Warning: ఈ 5 రకాల మోసాలతో మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం... ఆర్‌బీఐ వార్నింగ్

RBI Warning | సైబర్ నేరగాళ్లు పెరిగిపోతుండటం ఫైనాన్షియల్ సంస్థలకు తలనొప్పిగా మారాయి. ఇలాంటి మోసాలతో అమాయకులు దారుణంగా నష్టపోతున్నారు. అందుకే సైబర్ నేరాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.

RBI Warning | సైబర్ నేరగాళ్లు పెరిగిపోతుండటం ఫైనాన్షియల్ సంస్థలకు తలనొప్పిగా మారాయి. ఇలాంటి మోసాలతో అమాయకులు దారుణంగా నష్టపోతున్నారు. అందుకే సైబర్ నేరాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.

RBI Warning | సైబర్ నేరగాళ్లు పెరిగిపోతుండటం ఫైనాన్షియల్ సంస్థలకు తలనొప్పిగా మారాయి. ఇలాంటి మోసాలతో అమాయకులు దారుణంగా నష్టపోతున్నారు. అందుకే సైబర్ నేరాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.

టెక్నాలజీ పెరిగిన తర్వాత డిజిటల్ లావాదేవీలు (Digital Transactions) కూడా పెరిగాయి. డిజిటల్ పద్ధతిలో లావాదేవీలు పెరిగిపోవడంతో మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. లావాదేవీలు జరిగే పద్ధతి తెలియకపోవడం, డిజిటల్ పేమెంట్స్‌పై (Digital Payments) పూర్తిగా అవగాహన లేకపోవడం కారణంగా కస్టమర్లు దారుణంగా మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో కస్టమర్లను దోచుకుంటున్నారు. దీంతో అప్రమత్తమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. మోసాలు జరిగే తీరును వివరిస్తూ ఇటీవల ఓ బుక్‌లెట్ రిలీజ్ చేసింది. కస్టమర్లు ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించింది. మరి సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో, ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోండి.

Online Sales Platforms: ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్స్‌లో కస్టమర్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తుంటారు. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే వెబ్‌సైట్స్ వీరి టార్గెట్. అందులో కస్టమర్లు పోస్ట్ చేసిన వస్తువుల్ని తాము కొంటామని నమ్మిస్తారు. మీ వస్తువు నచ్చింది డబ్బులు పంపిస్తామని చెబుతారు. అయితే డబ్బులు పంపించకుండా యూపీఐ ద్వారా రిక్వెస్ట్ మనీ ఆప్షన్ ద్వారా డబ్బుల్ని రిక్వెస్ట్ చేస్తారు. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు వస్తాయని నమ్మిస్తారు. డబ్బులు స్వీకరించడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విషయం తెలియని కస్టమర్లు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే వారి అకౌంట్ నుంచి డబ్బులు మాయమౌతాయి.

Health Credit Cards: మీ ఆరోగ్యం కోసం ప్రత్యేక క్రెడిట్ కార్డులు... లాభాలు ఇవే

Fake Customer Care Numbers: ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఇన్స్యూరెన్స్ లాంటి సేవల కోసం కస్టమర్ కేర్ నెంబర్లను గూగుల్ సెర్చ్‌లో వెతకడం అలవాటే. సదరు సంస్థ అధికార వెబ్‌సైట్‌లో కస్టమర్ కేర్ నెంబర్లు తీసుకుంటే ఇబ్బంది లేదు. కానీ గూగుల్‌లో నేరుగా సెర్చ్ చేసి కనిపించిన నెంబర్ డయల్ చేస్తే చిక్కులు తప్పవు. చాలావరకు ఫేక్ నెంబర్స్ ఉంటాయి. ఈ ఫేక్ నెంబర్స్‌కి కాల్ చేయగానే కస్టమర్ల వివరాలన్నీ తెలుసుకొని అకౌంట్ ఖాళీ చేస్తుంటారు.

Juice jacking: బస్టాండ్, రైల్వే స్టేషన్, పబ్లిక్ ప్లేసెస్‌లో మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ చేస్తుంటారా? పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్స్‌తో మీ డేటాను మొత్తం కాజేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. ఇమెయిల్స్, ఎస్ఎంఎస్, పాస్‌వర్డ్స్ లాంటి వివరాలను ఛార్జింగ్ పోర్ట్ నుంచి సైబర్ నేరగాళ్లు సేకరిస్తారు. వాటితో మీ అకౌంట్ కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తారు.

Bank Holidays: ఖాతాదారులకు గమనిక... 11 రోజుల్లో 7 రోజులు బ్యాంకులు బంద్

Screen Sharing App: మోసగాళ్లు స్క్రీన్ షేరింగ్ యాప్స్ ద్వారా యూజర్ల మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. కస్టమర్ల బ్యాంకు ఖాతా వివరాలు, లాగిన్ వివరాలు తెలుసుకొని ఇంటర్నెట్ బ్యాంకింగ్, పేమెంట్స్ యాప్స్ లోకి లాగిన్ అవుతారు. ఆ తర్వాత అకౌంట్ ఖాళీ చేస్తారు.

QR code: మీకు వాట్సప్‌లో, మెయిల్‌లో వచ్చే క్యూఆర్ కోడ్స్‌ని స్కాన్ చేస్తే చిక్కులు తప్పవు. మీరు ఇలాంటి క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేస్తే మీకు తెలియకుండానే మీ అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అయ్యే అవకాశముంది.

First published:

Tags: Cyber Attack, CYBER CRIME, Personal Finance, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు