2020లో ప్రపంచ ఆర్థిక మాంద్యం లేనట్లే...తేల్చేసిన జేపీ మోర్గాన్

ఇప్పట్లో ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం లేదని ప్రపంచ ప్రసిద్ధ రేటింగ్ సంస్థ జేపీ మోర్గాన్ సంస్థ అంచనావేసింది. 2020 సంవత్సరంలో ఆర్థిక మాంద్యం ఉండకపోవచ్చని ఆ సంస్థ వెల్లడించింది.

news18-telugu
Updated: February 4, 2019, 12:32 PM IST
2020లో ప్రపంచ ఆర్థిక మాంద్యం లేనట్లే...తేల్చేసిన జేపీ మోర్గాన్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 4, 2019, 12:32 PM IST
అంతర్జాతీయ పారిశ్రామిక రంగాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెన్నాడుతున్న వేళ ప్రపంచ ప్రసిద్ధ రేటింగ్ సంస్థ జేపీ మోర్గాన్ తీపికబురు అందించింది. ఇప్పట్లో ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం లేదని అంచనావేసింది. 2020 సంవత్సరంలో ఆర్థిక మాంద్యం ఉండకపోవచ్చని జేపీ మోర్గాన్ వెల్లడించింది. ఫెడరల్ రిజర్వ్ వైఖరిలో మార్పు రావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, ఇప్పట్లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉండకపోవచ్చని అంచనావేసింది.

మదుపర్లకు ఆర్థిక మాంద్యం భయాలు నుంచి ఇక విముక్తి లభించనున్నట్లు జేపీ మోర్గాన్ అంచనావేసింది. తాజా అంచనాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడులు పుంజుకునే అవకాశం ఉంది. 2019 ద్వితీయార్థం నుంచి పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశముందని అంచనావేసింది. ఫెడరల్ రిజర్వ్ చర్యల మేరకు ఉపాధి కల్పన మెరుగవడం, ద్రవ్యోల్భణం కట్టడిలో ఉండడం జరిగితే 2020లో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం లేదని జేపీ మోర్గాన్ తేల్చేసింది.

First published: February 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...