హోమ్ /వార్తలు /బిజినెస్ /

Joint Home Loan Benefit: భార్య పేరిట Home Loan తీసుకుంటున్నారా...అయితే బంపర్ ఆపర్...

Joint Home Loan Benefit: భార్య పేరిట Home Loan తీసుకుంటున్నారా...అయితే బంపర్ ఆపర్...

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

హోమ్ లోన్ తీసుకునే సమయంలో మీ జీవిత భాగస్వామిని సహ యజమాని గా చేర్చడం ద్వారా బ్యాంకుల నుంచి అనేక రెట్ల ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా, మహిళలు తీసుకునే రుణాలపై ప్రభుత్వాలు వివిధ రాయితీలను అందిస్తాయి.

ప్రతి ఒక్కరికి సొంతిల్లు అనేది ఓ కల. తమకంటూ ఓ ఇల్లు ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే, చాలీచాలని జీతాలు, అందుబాటులో లేని ఇళ్ల ధరలతో చాలా మందికి అది కలలానే మిగిలిపోతుంది. అయితే, ఉన్నంతలో పొదుపు చేసుకుంటూ, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే సొంతింటి కల ను నిజం చేసుకోవడం కష్టమేమీ కాదు. ముఖ్యంగా బ్యాంకులు ఇచ్చే రుణాలతో ఇది సాధ్యమవుతుంది. అయితే, లోన్ తీసుకునే సమయంలో సరైన ప్రణాళికతో ముందడుగు వేయాలి. తద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, ఆయా బ్యాంకులు అందజేసే బోనస్ పాయింట్లు, ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. హోమ్ లోన్ తీసుకునే సమయంలో మీ జీవిత భాగస్వామిని సహ యజమాని గా చేర్చడం ద్వారా బ్యాంకుల నుంచి అనేక రెట్ల ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా, మహిళలు తీసుకునే రుణాలపై ప్రభుత్వాలు వివిధ రాయితీలను అందిస్తాయి. తద్వారా మీపై వడ్డీ భారం తగ్గుతుంది. దీనితో పాటు మహిళా కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫీజు వంటి వాటిపై రాయితీ లభిస్తుంది. సాధారణంగా అన్ని రాష్ట్రాలు పురుషుల నుండి 6 శాతం, మహిళల నుండి 4 శాతం మేర స్టాంప్ డ్యూటీ ని వసూలు చేస్తాయి. అయితే, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు మహిళలకు స్టాంప్ డ్యూటీలో 1 నుండి 2 శాతం వరకు రాయితీని అందిస్తున్నాయి. అందువల్ల భార్యను సహ యజమాని గా చేర్చడం ద్వారా అదనపు ప్రయోజనాలు పొందవచ్చని గుర్తించుకోండి.

ఉమ్మడి యాజమాన్యం ద్వారా కలిగే ప్రయోజనాలు

ఉమ్మడి యాజమాన్యం ద్వారా ప్రధానంగా మూడు ప్రయోజనాలున్నాయి. దీని ద్వారా హోమ్ లోన్ ఎలిజిబిలిటి, డబుల్ టాక్స్ బెనిఫిట్స్, సులభంగా వారసత్వం బదిలీ వంటి ప్రయోజనాలు పొందవచ్చు.

టాక్స్ బెనిఫిట్స్

సహ యజమానిగా భార్యను చేర్చడం ద్వారా అదనపు పన్ను ప్రయోజనాల ను పొందవచ్చు. సెక్షన్ 80 (సి) కింద యజమాని, సహ యజమాని ఇద్దరూ పన్ను రిటర్న్‌లో రూ .2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

బ్యాంక్ లోన్ ప్రయోజనాలు

సాధారణంగా, బ్యాంకులు రుణగ్రహీత వార్షిక ఆదాయాన్ని బట్టి ఎంత మొత్తంలో రుణం మంజూరు చేయాలనేది నిర్ణయిస్తాయి. ఇది రుణగ్రహీత వార్షిక వేతనానికి ఐదు రెట్లు ఉంటుంది. కాగా, ఉమ్మడి దరఖాస్తుదారుల విషయంలో, ఇద్దరి ఆదాయాలను పరిగణలోకి తీసుకొని రుణాన్ని ముంజూరు చేస్తాయి. తద్వారా ఎక్కువ రుణానికి అర్హత లభిస్తుంది.

వారసత్వ బదిలీ సులభతరం

ఒకే యాజమాన్యం విషయంలో, ఆస్తి బదిలీకి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అదే, ఉమ్మడి -యాజమాన్యం విషయంలో అయితే సులభంగా, ఎటువంటి గందరగోళం లేకుండా తమ వారసులకు ఆస్తి ని బదిలీ చేయవచ్చు.

Published by:Krishna Adithya
First published:

Tags: Business, Home loan

ఉత్తమ కథలు