హోమ్ /వార్తలు /బిజినెస్ /

Joe Biden గెలుపుతో మన ఐటీ నిపుణులకు కలిగే లాభం ఇదే...

Joe Biden గెలుపుతో మన ఐటీ నిపుణులకు కలిగే లాభం ఇదే...

అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్తలు... ఈ ఆంక్షలను సడలించాలని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌కు విజ్ఞప్తి చేశాయి. (ఫైల్ ఫోటో)

అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఇండియన్ అమెరికన్ వ్యాపారవేత్తలు... ఈ ఆంక్షలను సడలించాలని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌కు విజ్ఞప్తి చేశాయి. (ఫైల్ ఫోటో)

భారతీయ ఐటీ నిపుణులు బైడెన్‌ అధ్యక్షుడైతే ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు మారుతాయని, గ్రీన్‌కార్డు పొందటం సులభతరమవుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉన్న బ్యాక్‌లాగ్‌ అంతా క్లియర్‌ చేస్తామని ఎన్నికల సమయంలో డెమొక్రాట్స్‌ పలు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు.

ఇంకా చదవండి ...

  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నిక భారతీయ ఐటీ నిపుణులకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇంత కాలం ట్రంప్ పాలసీలతో విసిగిపోయిన ఐటీ నిపుణులకు బైడెన్ ఎన్నిక ఊరట అనే చెప్పాలి. H1B వీసాలతో సహా ఇతర అధిక-నైపుణ్య వీసాల పరిధిని బైడెన్ సర్కార్ పెంచవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు ట్రంప్ హయాంలో H1B వీసాలపై వివిధ దేశాలకు కోటా ప్రక్రియ కూడా బైడెన్ రద్దు చేసే చాన్స్ ఉంది. తద్వారా కోటాతో సంబంధం లేకుండా H1B వీసాలను జారీ చేసే అవకాశం ఉంది. తద్వారా భారతీయ నిపుణులకు అమురికాలో ఉపాధి పొందేందుకు అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది. ఈ రెండు దశలు వేలాది మంది భారతీయ నిపుణులకు ప్రయోజనం చేకూరుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో కొన్ని ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల భారత నిపుణులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. అంతేకాదు ట్రంప్ సర్కారు వర్క్‌ వీసా, గ్రీన్‌కార్డు నిబంధనలు కఠినతరం చేయటమేకాదు, చట్టపరంగా వాటికి ఆమోదముద్ర వేయించారు

  H1B వీసాదారులకు బైడెన్ గెలుపు వరమా..

  కమలా హారిస్ అమెరికా నూతన ఉపాధ్యక్షురాలు కావడం కూడా కాస్త కలిసి వచ్చే అంశమే. హెచ్ -1 బి వీసాదారుల జీవిత భాగస్వామికి వర్క్ వీసా పర్మిట్‌ను రద్దు చేయాలన్న ట్రంప్ పరిపాలన నిర్ణయాన్ని కూడా బైడెన్ ప్రభుత్వం రద్దు చేసే వీలుందని భావిస్తున్నారు. ట్రంప్ పరిపాలన విధానాలతో ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబాలు చాలా ప్రభావితమయ్యాయి. బైడెన్ సర్కార్ ఇమ్మిగ్రేషన్ సంస్కరణపై పనిచేయాలని యోచిస్తోంది. బైడెన్ తన ప్రచారంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో "యునైటెడ్ స్టేట్స్ లో ఇప్పటికే వివిధ స్థానాల్లో పనిచేయడానికి నిపుణులను నియమించడానికి ఉన్న హై-స్కిల్ వీసాల విషయంలో ఉదారంగా ఉంటామని ప్రకటించారు. అలాగే వీసా విధానంలో సంస్కరణలు తెస్తామని తెలిపారు. ఇవే జరిగితే ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న నిపుణులతో పాటు, కొత్తగా అమెరికాకు రావాలని కలగంటున్న నిపుణులకు ఇది వరమనే చెప్పాలి. అలాగే అమెరికాలో వ్యాపారం చేస్తున్న భారతీయ కంపెనీలకు కొత్తగా H1B వీసాల ద్వారా భారతీయులను అమెరికాకు తీసుకెళ్లి పనిచేయించుకునే వీలుంది.

  బైడెన్ గెలుపుతో చిగురించిన గ్రీన్‌కార్డు ఆశలు

  ఇక అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డు పొందాలని ప్రతి ఒక్క హెచ్‌1బీ వీసాదారుడి కల. కానీ డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్ష కాలంలో ఉన్న హెచ్‌1బీ వీసాను లాక్కోకపోతే చాలు. అనే పరిస్థితి వచ్చింది. కొన్నేళ్లయినా అమెరికాలో పనిచేయనిస్తే భారత్‌లో తమ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని మనవాళ్లు భావిస్తారు. అలాగే అమెరికాలో స్థిరపడేందుకు గ్రీన్ కార్డు పొందాలని ప్రతీ ఒక్కరు ఆశిస్తారు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు బైడెన్‌ అధ్యక్షుడైతే ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు మారుతాయని, గ్రీన్‌కార్డు పొందటం సులభతరమవుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉన్న బ్యాక్‌లాగ్‌ అంతా క్లియర్‌ చేస్తామని ఎన్నికల సమయంలో డెమొక్రాట్స్‌ పలు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. హెచ్‌1బీ వీసాదారు భార్య అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని ట్రంప్‌ సర్కార్‌ రద్దుచేయగా, దీనిని పునరుద్ధరిస్తామని బైడెన్ ఇప్పటికే హామీ ఇచ్చారు. అంతేకాదు బైడెన్‌ అధ్యక్షుడైతే , ఆయన ప్రభుత్వం అమెరికా వలస చట్టాల్ని కచ్చితంగా మార్చుతుందని, సెనెట్‌ ద్వారా చట్టాన్ని తీసుకొచ్చి అందరికీ మేలు చేస్తారని సమగ్రమైన వలసదారుల చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని, అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు భావిస్తున్నారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: US Elections 2020

  ఉత్తమ కథలు