Home /News /business /

JOBS IN CRYPTO TOP TIPS FROM RECRUITERS ABOUT WHAT TO DO MK GH

Cryptocurrency Jobs: క్రిప్టోలో ఉద్యోగాల పరిస్థితి ఏంటి? నియామకాల గురించి రిక్రూటర్‌లు ఏమంటున్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్రిప్టో సంస్థలు క్రిప్టోగ్రఫీ, బ్లాక్ చైన్ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభగల వ్యక్తుల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. ఫలితంగా క్రిప్టోకరెన్సీ జాబ్ మార్కెట్ లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది.

ఇటీవల కాలంలో వర్చువల్ కరెన్సీగా డిజిటల్ యుగంలో చలామణి అవుతున్న క్రిప్టోకరెన్సీ వినియోగం బీభత్సంగా పెరిగిపోతోంది. గతంలో కేవలం సిటీల్లో నివసించే వారే క్రిప్టోకరెన్సీ కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు గ్రామీణులు కూడా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టేస్తున్నారు. దీనితో ఈ డిజిటల్ కరెన్సీ డిమాండ్ పెరిగిపోయి దాని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ కరెన్సీ రేట్లు పెరగడంతో పాటు డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ (DeFi), నాన్-ఫంజిబుల్ టోకెన్‌లు (NFTs) విస్తరిస్తున్నాయి. దాంతో క్రిప్టో కంపెనీలు, సంస్థలు శరవేగంతో ఆర్థికంగా ఎదుగుతున్నాయి. పెరుగుతున్న కార్యకలాపాలతో వాటిని మేనేజ్ చేయడం కొందరి వల్ల సాధ్యం కావడం లేదు. దాంతో క్రిప్టో కార్యకలాపాలను నిర్వహించడానికి అర్హతగల వ్యక్తులను నియమించుకోవడం అనివార్యంగా మారింది.

క్రిప్టో సంస్థలు క్రిప్టోగ్రఫీ, బ్లాక్ చైన్ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభగల వ్యక్తుల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. ఫలితంగా క్రిప్టోకరెన్సీ జాబ్ మార్కెట్ లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ఈ కొత్త పరిశ్రమలో కొద్ది సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని కూడా అనుభవజ్ఞుడిగా పరిగణిస్తున్నారు. ఫలితంగా నియామకాల ప్రక్రియ అనేదే చాలా కొత్తగా జరుగుతోంది. ఈ క్రమంలో ఎలాంటి వ్యక్తులకు క్రిప్టో కరెన్సీ సంస్థలు జాబ్స్ ఆఫర్ చేయనున్నాయి? క్రిప్టో కరెన్సీ జాబ్స్ ఎంపిక విషయంలో ఆ కంపెనీలు ఎలాంటి విధానాలను ఫాలో కానున్నాయి? వంటి తదితర విషయాలు తెలుసుకుందాం.

క్రిప్టోలో నియామకం గురించి రిక్రూటర్లు చెప్పిన చిట్కాలు

ఉన్న ఉద్యోగులనే తీర్చిదిద్దడం
బయటి వ్యక్తులను వెతకడం కంటే తమ సొంత కంపెనీల్లోని ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడమే ఉత్తమమని అమెరికాలోని క్రిప్టో & డేటా అసెట్స్ సెక్టార్‌కు సహ-నాయకత్వం వహించే డేవిడ్ రిచర్డ్‌సన్ చెప్పారు. కేవలం ఆరు నెలల అనుభవం ఉన్నవారికి ఎక్కువ చెల్లించే బదులు క్రిప్టోపై ఆసక్తి ఉన్న ప్రస్తుత సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో పెట్టుబడులు పెట్టడం తెలివైన నిర్ణయమన్నారు.

శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండండి
ఉన్న సిబ్బందితోపాటు కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాల కోసం బయట వ్యక్తులను నియమించుకోవాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఒక నిర్దిష్ట ఉద్యోగానికి కావాల్సిన కచ్చితమైన స్కిల్స్ ఉన్న వ్యక్తులు దొరకడం కష్టం. కాబట్టి సంస్థలు ప్రతిభగల ఎవరో ఒకరిని నియమించుకుని వారికి తక్కువ పరిజ్ఞానం ఉన్న అంశాల్లో శిక్షణ ఇవ్వవచ్చని గ్లోబల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ డైరెక్టర్ థామస్ విక్ సలహా ఇచ్చారు. అభ్యర్థులు కంపెనీలకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు. కానీ వారికి అన్ని ప్రత్యేకతలు ఉండకపోవచ్చని థామస్ అన్నారు.

యాక్ట్ ఫాస్ట్
అర్హత కలిగిన అభ్యర్థులకు డిమాండ్ పెరిగిపోతోందని ఒక అధికారి పేర్కొన్నారు. "వేగంగా పని చేయగల యజమానులు మూడు రౌండ్ల కంటే ఎక్కువ ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యోగి ప్రతిభను బట్టి అతనికి ఎలాంటి జాబ్ ఇస్తే బాగుంటుందో వెంటనే నిర్ణయం తీసుకోవాలి. తద్వారా కంపెనీలో అత్యుత్తమ ప్రతిభావంతులను తీసుకోవడం సాధ్యపడుతుంది. 1-2 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు జాబ్ ఆఫర్ చేసి త్వరగా నియామకాలు జరపవచ్చు. అవసరమైతే వారికి తర్వాత ట్రైనింగ్ ఇవ్వచ్చు. కచ్చితమైన స్కిల్స్ దొరికేంత వరకు వెయిట్ చేయడం వృధా" అని సదరు అధికారి క్రిప్టో సంస్థ యాజమాన్యాలకు సలహా ఇచ్చారు.

ప్యాషన్ ఉన్న ఉద్యోగుల కోసం అన్వేషించండి
క్రిప్టోలో పనిచేసే ఉద్యోగులు విరామం తీసుకుంటే కుదరదు. ట్రేడింగ్, కార్యకలాపాలు 24 గంటలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అమితాసక్తి, అభిరుచితో ఎల్లప్పుడూ పనిచేసే వారిని నియమించుకోవడం చాలా కీలకం అని రిచర్డ్‌సన్ చెప్పారు. క్రిప్టోకరెన్సీలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడం ద్వారా చాలా ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకోవాలని రిచర్డ్‌సన్ నిరుద్యోగులకు సూచించారు.
Published by:Krishna Adithya
First published:

Tags: JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు