news18-telugu
Updated: August 31, 2020, 1:40 PM IST
JioFiber Free Trail: జియోఫైబర్ 30 రోజులు ఫ్రీ... అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ కూడా ఉచితం
(ప్రతీకాత్మక చిత్రం)
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? పిల్లల ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కోసం కొత్త ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? జియోఫైబర్ గుడ్ న్యూస్ చెప్పింది. సరికొత్త ప్లాన్స్ ప్రకటించింది. 'నయే ఇండియా కా నయా జోష్' పేరుతో కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభమౌతాయి. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఆఫర్ చేస్తోంది. 4కే సెట్ టాప్ బాక్స్ ఉచితం. కొత్త యూజర్లకు 10 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 30 రోజుల ఫ్రీ ట్రయల్‌లో భాగంగా 10 ఓటీటీ యాప్స్ యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కాలింగ్ ఉచితం. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్ నచ్చకపోతే కనెక్షన్ వద్దని చెప్పొచ్చు. ఎలాంటి కండీషన్స్ ఉండవు. ఈ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కొత్త కస్టమర్లకు మాత్రమే. సెప్టెంబర్ 1 నుంచి జియోఫైబర్ యాక్టివేట్ చేసుకునే కస్టమర్లకు 30 రోజుల ఉచిత ట్రయల్ వర్తిస్తుంది. కొత్తగా జియో ఫైబర్ 4 ప్లాన్స్ ప్రకటించింది. వాటి వివరాలు తెలుసుకోండి.
Jio IPL Special Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చుGold: మార్కెట్ రేట్ కన్నా రూ.3,000 తక్కువకే బంగారం... ఇదే ఆఖరి అవకాశం
JioFiber Rs 399 Plan: జియోఫైబర్ రూ.399 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.
JioFiber Rs 699 Plan: జియోఫైబర్ రూ.699 ప్లాన్ తీసుకుంటే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం.
JioFiber Rs 999 Plan: జియోఫైబర్ రూ.999 ప్లాన్ తీసుకుంటే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1000 విలువైన 11 ఓటీటీ యాప్స్ సబ్‍స్క్రిప్షన్స్ ఉచితం.
JioFiber Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1500 విలువైన 12 ఓటీటీ యాప్స్ సబ్‍స్క్రిప్షన్స్ ఉచితం.

లక్షలాది కనెక్షన్లతో జియోఫైబర్ భారతదేశంలో అతిపెద్ద ఫైబర్ ప్రొవైడర్‌గా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. కానీ భారతదేశం, భారతీయుల విషయంలో మా విజన్ చాలా పెద్దది. జియో ఫైబర్‌ను ప్రతీ ఇంటికి తీసుకెళ్లి, ఆ ఇంట్లో ప్రతీ ఒక్కరికీ సాధికారం ఇవ్వాలనుకుంటున్నాం. భారతదేశంలో విస్తృతంగా, వేగంగా పెరిగిన మొబైల్ కనెక్టివిటీగా జియోను మార్చాం. ఇప్పుడు జియోఫైబర్ గ్లోబల్ బ్రాడ్‌బ్యాండ్ నాయకత్వంలోకి దూసుకెళ్తోంది. 1600 పట్టణాలు, నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ అందిస్తోంది. ప్రతీ ఒక్కరూ జియోఫైబర్ ప్రయత్నంలో చేతులు కలిపి ప్రపంచంలో భారతదేశాన్ని బ్రాడ్‌బ్యాండ్ లీడర్‌గా మార్చాలని కోరుకుంటున్నాం.
— ఆకాశ్ అంబానీ, డైరెక్టర్, జియో
కొత్త కస్టమర్లకు మాత్రమే కాదు... ఇప్పటికే జియోఫైబర్ కస్టమర్లుగా ఉన్నవారికి కూడా లాయల్టీ బెనిఫిట్స్ ప్రకటించింది కంపెనీ. కొత్త టారిఫ్ ప్లాన్స్ ప్రకారం బెనిఫిట్స్ పొందేందుకు ప్రస్తుత జియోఫైబర్ కస్టమర్లు అప్‌గ్రేడ్ కావొచ్చు. ఆగస్ట్ 15 నుంచి 31 మధ్య జియోఫైబర్ తీసుకున్న వారికి 30 రోజుల ఫ్రీ ట్రయల్ బెనిఫిట్ వోచర్ మైజియోలో లభిస్తుంది.
Published by:
Santhosh Kumar S
First published:
August 31, 2020, 1:40 PM IST