జియో సినిమా యూజర్లకు బంపర్ ఆఫర్...సన్‌నెక్ట్స్‌ సినిమాలన్నీ చూసే చాన్స్...

సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫాంలోని కంటెంట్‌ను జియో సినిమా యాప్‌లో జియో వినియోగదారులు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ఈ మేరకు జియో, సన్ గ్రూప్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.

news18-telugu
Updated: December 3, 2019, 10:09 PM IST
జియో సినిమా యూజర్లకు బంపర్ ఆఫర్...సన్‌నెక్ట్స్‌ సినిమాలన్నీ చూసే చాన్స్...
జియో, సన్ నెక్ట్స్
  • Share this:
టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై సన్ గ్రూప్‌కు చెందిన సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫాంలోని కంటెంట్‌ను జియో సినిమా యాప్‌లో జియో వినియోగదారులు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ఈ మేరకు జియో, సన్ గ్రూప్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్రమంలో సదరు కంటెంట్‌ను జియో వినియోగదారులు తమ ఫోన్‌లోని జియో సినిమా యాప్‌లో వీక్షించవచ్చని జియో తెలిపింది.  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో సన్ నెక్స్ట్  లైబ్రరీలో అందుబాటులో ఉన్న అన్ని సినిమాలను జియో సినిమా తన యూజర్లకు అందించనుంది. ఇకపై  సన్ నెక్స్ట్  లైబ్రరీ నుండి 4,000 కి పైగా దక్షిణ భారత చలన చిత్రాలను జియో సినిమా అభిమానులు వీక్షించవచ్చు.

జియో సినిమా


జియో వినియోగదారులకు జియో సినిమాలో ప్రత్యేకమైన యాక్సస్ ఉంటుంది. వారి అభిమాన తారలు మహేష్ బాబు, రజనీకాంత్, విజయ్, అల్లు అర్జున్, అజిత్ కుమార్, మమ్ముట్టి మరియు మరెంతో మందితో జియో సినిమాలోని “సూపర్ సౌత్ స్వాగ్” లో భాగం కావచ్చు. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మోలీవుడ్ నుండి సౌత్ స్టార్స్ యొక్క జాబితాను మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆస్వాదించవచ్చు. కాగా జియో సినిమా యాప్‌లో ఇప్పటికే 10 వేలకు పైగా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా లక్షకు పైగా టీవీ షో ఎపిసోడ్ల కంటెంట్‌ను కలిగి ఉంది. ఇక ప్రస్తుతం సన్‌ నెక్ట్స్‌ మూవీ కేటలాగ్‌తో అపరిమిత సినిమాలు చూసే వీలును దక్షిణాది ప్రేక్షకులకు కల్పించింది. కాగా దక్షిణ భారత స్టూడియోల నుంచి అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు సన్‌ నెక్ట్స్ పేరు గాంచింది.

 

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు