జియో ఐయూసీ టాప్ అప్ వోచర్‌కు సమానంగా కస్టమర్లకు ఉచిత డేటా...

ఐయూసీ టాప్ అప్ వోచర్లకు తగినట్లుగా అదనంగా కస్టమర్లకు వివిధ స్లాబుల్లో ఉచిత ఫ్రీ డేటాను అందించనున్నట్లు తెలిపింది.

news18-telugu
Updated: October 9, 2019, 6:33 PM IST
జియో ఐయూసీ టాప్ అప్ వోచర్‌కు సమానంగా కస్టమర్లకు ఉచిత డేటా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇకపై జియో కస్టమర్లు ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందనే, నిబంధన నేటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ట్రాయ్ ఈ సంవత్సరం చివరి నాటికి జనవరి 1, 2020 కల్లా ఐయూసీ చార్జీలను పూర్తిగా ఎత్తివేసేందుకు పునస్సమీక్ష చేయనుంది. కాగా జియో విడుదల చేసిన ప్రకటనలో ఐయూసీ టాప్ అప్ వోచర్లకు తగినట్లుగా అదనంగా కస్టమర్లకు వివిధ స్లాబుల్లో ఉచిత ఫ్రీ డేటాను అందించనున్నట్లు తెలిపింది. అలాగే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు సైతం ప్రతి నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీ బిల్లులో కలుపుతుండగా, అందుకు తగ్గట్టుగానే ఉచిత డేటాను సైతం అందించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ టాప్ అప్ వోచర్లు 10 నుంచి 100 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.

జియో నుంచి జియో నెట్ వర్క్ కు కాల్ చేస్తే ఎలాంటి ఐయూసీ చార్జీలు వర్తించవు. అలాగే ఇన్ కమింగ్ కాల్స్‌కు సైతం ఈ చార్జీలు వర్తించవు. దీంతో పాటు లాండ్ లైన్ ఫోన్లు, వాట్సప్, ఫేస్ టైమ్ లాంటి ఇంటర్నెట్ వాయిస్ బేస్డ్ ప్లాట్ ఫామ్‌లకు సైతం ఈ నిబంధన వర్తించదని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading