ఐయూసీ టాప్ అప్ వోచర్లు రూ.10 నుంచి రూ.100 వరకూ...ఉచిత డేటా అదనం...

జియో రీచార్జ్ చేయించుకునే కస్టమర్లందరూ నేటి నుంచి ఇతర మొబైల్ ఆపరేటర్ల నెట్ వర్క్‌లకు కాల్ చేసినప్పుడు ఈ ఐయూసీ చార్జ్ కింద ప్రతి నిమిషానికి 6 పైసలు కట్ అవుతుంది. ఇందుకోసం ఐయూసీ టాప్ అప్ వోచర్లను సైతం ప్రవేశపెట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

news18-telugu
Updated: October 9, 2019, 8:39 PM IST
ఐయూసీ టాప్ అప్ వోచర్లు రూ.10 నుంచి రూ.100 వరకూ...ఉచిత డేటా అదనం...
Jio (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసే జియో కస్టమర్లు ఇకపై ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఈ నెల 9 నుంచి అందుబాటులోకి రానుంది. అంటే జియో రీచార్జ్ చేయించుకునే కస్టమర్లందరూ నేటి నుంచి ఇతర మొబైల్ ఆపరేటర్ల నెట్ వర్క్‌లకు కాల్ చేసినప్పుడు ఈ ఐయూసీ చార్జ్ కింద ప్రతి నిమిషానికి 6 పైసలు కట్ అవుతుంది. ఇందుకోసం ఐయూసీ టాప్ అప్ వోచర్లను సైతం ప్రవేశపెట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

జియో అందుబాటులోకి తెచ్చిన వోచర్లు చూస్తే...మొదటి రూ.10 వోచర్ ద్వారా 124 ఐయూసీ నిమిషాలతో పాటు అదనంగా 1 జీబీ డేటా లభించనుంది. అలాగే రూ.20 వోచర్ ద్వారా 249 ఐయూసీ నిమిషాలతో పాటు అదనంగా 2 జీబీ డేటా లభించనుంది. దీంతో పాటు రూ.50 వోచర్ ద్వారా 656 ఐయూసీ నిమిషాలతో పాటు 5 జీబీల డేటా లభిస్తుంది. ఇక చివరగా రూ.100ల వోచర్ టాప్ అప్ ద్వారా 1362 ఐయూసీ నిమిషాలతో పాటు 10 జీబీ ఉచిత డేటా లభిస్తుంది.

ఐయూసీ చార్జ్ ఇలా


First published: October 9, 2019, 8:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading