Home /News /business /

JIO TPG DEAL TPG JOINS RUSH OF INVESTORS IN JIO PLATFORMS AS RIL UNITS TOTAL FUNDRAISING RACES PAST RS 1 LAKH CRORE BA

Jio-TPG deal | రిలయన్స్ జియో మరో డీల్.. 7 వారాల్లో తొమ్మిదోది...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీపీజీ అనే సంస్థ రిలయన్స్ జియోలో 0.93 శాతం వాటాల కోసం రూ.4546.80 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.

    రిలయన్స్ జియో మరో డీల్ చేసింది. టీపీజీ అనే సంస్థ రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. జియోలో 0.93 శాతం వాటాల కోసం రూ.4546.80 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో కలిపి ఇప్పటి వరకు రిలయన్స్ జియో ఏడు వారాల్లో తొమ్మిది డీల్స్ చేసింది. అలాగే, మొత్తం రూ.లక్ష కోట్ల పెట్టుబడులను సమీకరించింది. టీపీజీ సంస్థ గతంలో Airbnb, Uber and Spotify లాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రపంచంలో ఎలాంటి అవాంతరాలు లేని ఫండ్ రైజింగ్ చేసిన సంస్థగా జియో ఇన్ఫోకామ్ నిలిచింది. ఇప్పటి వరకు జియో సంస్థ 21.99 శాతం వాటాను విక్రయించింది. రూ.102,432.15 కోట్ల పెట్టుబడులను సాధించింది. ఈ పెట్టుబడులు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరించిన సమయంలోనే కావడం విశేషం. దీని ద్వారా భారతీయ టెలికం దిగ్గజం సత్తాను చాటింది. జియో స్ట్రాటజీ, టెక్నాలజీ సామర్థ్యం, దీటైన వ్యాపార దృక్పథం, దీర్ఘకాలిక పురోగతిని చూపింది.

    ఈ సందర్భంగా రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ ‘డిజిటల్ ఎకో సిస్టమ్ ద్వారా భారతీయులను సాంకేతికంగా సాధికరత దిశగా కృషిచేస్తున్న సంస్థలో ఇన్వెస్టర్ల జాబితాలోకి టీపీజీకి స్వాగతం పలుకుతున్నా. గ్లోబల్ టెక్నాలజీ వ్యాపారాల్లో టీపీజీ పెట్టుబడుల ట్రాక్ రికార్డు చూసి మేం ముగ్ధులయ్యాం.’ అని అన్నారు.

    టీపీజీ గ్రూప్ కో సీఈవో జిమ్ కోల్టర్ మాట్లాడుతూ ‘రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెడుతున్నందుకు ఉద్వేగంగా ఉంది. పురోగతి, మార్పు, ఆవిష్కరణల సంస్థల్లో 25 సంవత్సరాలుగా పెట్టుబడులు పెడుతున్నాం. భారత్‌లో కూడా దీర్ఘకాలం నుంచి ఉన్నాం. జియో ప్రయాణంలో జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారతీయ డిజిటల్ ఎకానమీ వృద్ది చెందడంలో జియో కీలక భూమిక పోషిస్తుంది. చిరు వ్యాపారులు, వినియోగదారులకు క్రిటికల్, హైక్వాలిటీ డిజిటల్ సర్వీసులతో జియో ఇండస్ట్రీ లీడర్‌గా నిలుస్తోంది.’ అని అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Jio, Jio fiber, JioMart, Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు